Activa
-
ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి ప్రముఖ కంపెనీ
'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' ఆల్ ఎలక్ట్రిక్ యాక్టివాను నవంబర్ 27న ఆవిష్కరించడానికి సిద్ధమైంది. చాలా రోజుల నిరీక్షణ తరువాత కంపెనీ తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ గురించి ఓ క్లారిటీ ఇచ్చింది.ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఇప్పటి వరకు హోండా మోటార్‌సైకిల్ కంపెనీ ఒక్క వాహనాన్ని కూడా లాంచ్ చేయలేదు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభాగంలో ఒక ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది.హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన బ్యాటరీ ప్యాక్, రేంజ్, డిజైన్, ఫీచర్స్ వంటి చాలా వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కాబట్టి నవంబర్ 27న సంస్థ బహుశా ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము.ఇదీ చదవండి: వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 100 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఖచ్చితమైన రేంజ్ గణాంకాలు త్వరలోనే తెలుస్తాయి. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డిస్క్ బ్రేక్‌లు మరియు ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. -
హోండా ఈవీ స్కూటర్ వచ్చేస్తోంది.. యాక్టివాకంటే తక్కువ ధరలో
సాక్షి,ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు,హోండా మోటార్‌సైకిల్ స్కూటర్ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అతి త్వరలో విడుదల చేయనుంది. యాక్టివా కంటే తక్కువ ధరతో హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో భారతదేశంలో విడుదల చేయనుండటం విశేషం. సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లే లక్క్ష్యంగా దీన్ని లాంచ్ చేయనుంది. (డిష్ టీవీ ఛైర్మన్ బై..బై! షేర్లు రయ్ రయ్..!) తాజా నివేదికల ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోల్‌తో నడిచే ప్రస్తుత తరం యాక్టివా కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అభివృద్ధిని కంపెనీ ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా వెల్లడించారు. స్థానిక మార్కెట్ నుండి విడిభాగాలను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను తక్కువగా అందించనుందట.అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల, రేంజ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీని మార్చుకునే సదుపాయంతో వివిధ మోడళ్లలో తీసుకురానుందని అంచనా. రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో లాంచ్ చేస్తుంది. (ఆస్తుల విక్రయంలో ఫ్యూచర్ సప్లైకు ఎదురు దెబ్బ) దశాబ్దం చివరి నాటికి ఈ విభాగంలో 30శాతం వాటానుటార్గెట్గా పెట్టుంది. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం గరిష్టంగా గంటకు 60 కి.మీ. మించదట. అలాగే 72,000-75,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. కాగా ప్రస్తుతం, ఎలక్ట్రిక్ టూ వీలర్ స్పేస్‌లో కేవలం బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ టూ వీలర్ బ్రాండ్లు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వీటితోపాటు ఒకినావా, అథర్ ,ఓలా వంటి స్టార్టప్‌లు తమ హవాను చాటుకుంటున్నాయి. తాజా హోండా కూడా ఎంట్రీ ఇస్తుండటంతో మారుతి సుజుకీ సహా దాదాపు అన్నీకంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయనున్నాయి. ఇటీవల యమహా ఇండియాఎలక్ట్రిక్ స్కూటర్లపై పని చేస్తున్నట్లు ప్రణాళికలను ధృవీకరించిన సంగతి తెలిసిందే. -
హోండా బీఎస్-6 యాక్టివా 125 ఎఫ్1 లాంచ్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ టూవీలర్‌ను లాంచ్ చేసింది. 'నిశ్శబ్ద విప్లవం'లో భాగంగా బీఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తన మొట్టమొదటి స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, ఇంజీన్ అప్డేట్స్తో న్యూ జనరేషన్ యాక్టివాను తీసుకొచ్చింది. ముఖ్యంగా నాయిస్ లెస్ స్టార్టర్ మోటార్, ఇన్‌స్ట్రుమెంటల్‌ను క్లస్టర్ కొత్త యాక్టివా 125 ఎఫ్ 1 స్కూటర్లో సరికొత్త ఫీచర్లుగా ఉన్నాయి. 125 సీసీ ఇంజీన్, డిస్క్‌బ్రేక్ తదితర ఫీచర్లతో లాంచ్ చేసింది. ఇంకా స్టాండ్ ఇండికేటర్‌ను కూడా జోడించింది. స్టాండ్ వేసి వుంటే ఇంజీన్‌స్టార్ కాదు అన్నమాట. అలాగే 6 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది.ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. ధరల విషయానికి వస్తే, సాధారణ హోండా యాక్టా 125 రూ 60,000 - రూ .64,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభం. బీఎస్ 9(ఎఫ్-1) రెగ్యులర్ వేరియంట్ యాక్టివా స్కూటర్ ధర సుమారు 10శాతం పెరగనుంది. -
మందు కొట్టి.. యువతి ర్యాష్ డ్రైవింగ్
హైదరాబాద్: స్నేహితులతో కలసి కారులోనే పార్టీ చేసుకుని, మద్యం సేవించారు. అదే మత్తులోనే ఓ యువతి మితిమీరిన వేగంతో కారు నడిపింది. దీంతో కారు అదుపు తప్పి యాక్టివాను ఢీకొట్టింది. శనివారం అర్ధరాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో యాక్టివాపై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు బోర బండకు చెందిన రామాయణం చిరంజీవి(20)గా, క్షతగాత్రుడు రామనాతి సాయికుమార్(20)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారకురాలైన న్యూఢిల్లీకి చెందిన జెన్నీ జాకబ్(26)ను అదుపులోకి తీసుకుని, బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా 51 శాతం బీఏసీ రీడింగ్ నమోదైందని పోలీసులు చెప్పారు. ఆదివారం రాయదుర్గం ఎస్ఐ నదీమొద్దీన్ వివరాలను మీడియాకు వెల్లడించారు. న్యూఢిల్లీకి చెందిన జెన్నీ జాకబ్, లీజా.. మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తూ కోకాపేట్‌లోని బ్లాసమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. శనివారం స్నేహితుడు రవనీత్ సింగ్‌ను కలిసి.. రాత్రి జూమ్‌కార్‌లో క్రెటా కారును అద్దెకు తీసుకొని కారులోనే పార్టీ చేసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు లీజాతో కలసి కారు నడుపుకుంటూ మాదాపూర్ నుంచి నిర్మాణంలో ఉన్న టీహబ్ మీదుగా రాయదుర్గం వైపు వెళుతున్నారు. మద్యం మత్తులో ఉన్న జెన్నీ జాకబ్ కారును మితిమీరిన వేగంతో నడుపుతూ బయోడైవర్సిటీ వద్ద హోండా యాక్టివాను ఢీకొట్టింది. ఆ బైక్‌పై ఉన్న చిరంజీవి, సాయికుమార్ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చిరంజీవి మృతి చెందాడు. మాదాపూర్‌లోని జుమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న చిరంజీవి రోజూమాదిరిగానే విధులు ముగించుకొని స్నేహితుడు సాయికుమార్‌తో కలసి యాక్టివాపై గచ్చిబౌలి నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. తీవ్రగాయాలై చికిత్స పొందుతున్న సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఉన్న ఒక్క కుమారుడు చిరంజీవి మృతి చెందడంతో రామాయణం శ్రీనివాస్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పల్టీలు కొట్టిన కారు.... మద్యం మత్తులో ఉన్న జెన్నీ జాకబ్ మితిమీరిన వేగంతో కారు నడిపి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌ను ఢీ కొట్టిన అనంతరం కారు మూడు పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. క్రేటా కారులో బెలూన్ ఓపెన్ కావడంతో జెన్నీ, లీజాకు గాయాలు కాలేదు. కారులో బీరు సీసాలు, చికెన్ లెగ్ పీస్‌లు పోలీసులకు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నదీమొద్దీన్ తెలిపారు. -
టాప్ సెల్లింగ్ టూవీలర్గా హోండా యాక్టివా
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది తొలి అర్ధ భాగ ంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్గా హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ)కు చెందిన ‘యాక్టివా’ అవతరించింది. ఇది వరకు ఈ రికార్డు హీరో మోటోకార్ప్‌కు చెందిన స్ల్పెండర్ సిరీస్ పేరిట ఉండేది. అలాగే గత 17 ఏళ్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూవీలర్లలో బైక్స్‌దే ఆధిపత్యం. కాగా ఇప్పుడు హోండా యాక్టివా, బైక్స్ దూకుడుకు కళ్లెం వేసింది. సియామ్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది తొలి ఆరు నెలలో (జనవరి-జూన్) యాక్టివా టూవీలర్స్ విక్రయాలు 13,38,015 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో హీరో స్ల్పెండర్ సిరీస్ వాహన విక్రయాలు 12,33,725 యూనిట్లుగా ఉన్నాయి.కాగా హెచ్ఎంఎస్ఐ.. తన యాక్టివా శ్రేణిలో యాక్టివా 3జీ, యాక్టివా 125, యాక్టివా ఐ అనే మూడు వాహనాలను వినియోగదారులకు అందిస్తోంది. ఇక హీరో కంపెనీ తన స్ల్పెండర్ సిరీస్‌లో భాగంగా సూపర్ స్ల్పెండర్, స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ప్రొ, స్ల్పెండర్ ప్రొ క్లాసిక్, స్ల్పెండర్ ఐస్మార్ట్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. -
సరికొత్త రంగుల్లో యాక్టివా-ఐ
హైదరాబాద్ : హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ తన ప్రముఖ స్కూటర్ యాక్టివా-ఐ కి కొత్త రంగులు అద్దింది. మూడు కొత్త రంగుల్లో ఈ స్కూటర్ ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. యూత్ ను ఎక్కువగా ఆక్టటుకోవడం కోసం, తాజాదనం కోసం యాక్టివా-ఐ ని రంగురంగుల్లో మార్కెట్లోకి తీసుకొస్తున్నామని కంపెనీ తెలిపింది. 2016 కు ఈ యాక్టివా-ఐ ఏడవ మోడల్. ఫ్యామిలీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోవడమే లక్ష్యంగా యాక్టివా-ఐ మార్కెట్లో నూతనావిష్కరణలతో కంపెనీ ప్రవేశపెడుతోంది. పెర్ల్ ట్రాన్స్ ఎల్లో, కాండీ జాజీ బ్లూ కొత్త కలర్స్ తో పాటు పెర్ల్ అమేజింగ్ వైట్ అండ్ బ్లాక్ లో కూడా ఈ యాక్టివా-ఐ అందుబాటులోకి వచ్చింది. డీలక్స్ రేంజిలో ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ రంగులో ఆక్టివా ఐ లభిస్తుంది. దీనితో పాటు పియర్ల్ అమేజింగ్ వైట్ మరియు ఆర్చిడ్ పర్పుల్ మెటాలిక్ రంగుల్లో కూడా ఈ యాక్టివా-ఐ లభిస్తుందని కంపెనీ తెలిపింది. రెగ్యులర్ గా తమ ఉత్పత్తులకు తాజాదనాన్ని చేకూరుస్తూ.. వినియోగదారులకు ఆశ్చర్యం కలిగించడమే తమ లక్ష్యమని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్ విందర్ సింగ్ గులెరియా తెలిపారు. ఈ తాజాదనంతో టూ-వీలర్ పరిశ్రమలో యాక్టివా-ఐ దూసుకెళ్తోందని తాము విశ్వసిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.