
'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' ఆల్ ఎలక్ట్రిక్ యాక్టివాను నవంబర్ 27న ఆవిష్కరించడానికి సిద్ధమైంది. చాలా రోజుల నిరీక్షణ తరువాత కంపెనీ తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ గురించి ఓ క్లారిటీ ఇచ్చింది.
ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఇప్పటి వరకు హోండా మోటార్‌సైకిల్ కంపెనీ ఒక్క వాహనాన్ని కూడా లాంచ్ చేయలేదు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభాగంలో ఒక ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది.
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన బ్యాటరీ ప్యాక్, రేంజ్, డిజైన్, ఫీచర్స్ వంటి చాలా వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కాబట్టి నవంబర్ 27న సంస్థ బహుశా ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము.
ఇదీ చదవండి: వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 100 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఖచ్చితమైన రేంజ్ గణాంకాలు త్వరలోనే తెలుస్తాయి. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డిస్క్ బ్రేక్‌లు మరియు ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment