Honda Motorcycle & Scooter India
-
ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి ప్రముఖ కంపెనీ
'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' ఆల్ ఎలక్ట్రిక్ యాక్టివాను నవంబర్ 27న ఆవిష్కరించడానికి సిద్ధమైంది. చాలా రోజుల నిరీక్షణ తరువాత కంపెనీ తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ గురించి ఓ క్లారిటీ ఇచ్చింది.ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో ఇప్పటి వరకు హోండా మోటార్‌సైకిల్ కంపెనీ ఒక్క వాహనాన్ని కూడా లాంచ్ చేయలేదు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభాగంలో ఒక ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది.హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన బ్యాటరీ ప్యాక్, రేంజ్, డిజైన్, ఫీచర్స్ వంటి చాలా వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కాబట్టి నవంబర్ 27న సంస్థ బహుశా ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము.ఇదీ చదవండి: వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 100 కిమీ రేంజ్ అందించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఖచ్చితమైన రేంజ్ గణాంకాలు త్వరలోనే తెలుస్తాయి. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డిస్క్ బ్రేక్‌లు మరియు ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. -
కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' (HMSI) అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో ఒక కోటి (10 మిలియన్) యాక్టివా స్కూటర్లను విక్రయించి సేల్స్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుంది.2001లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన యాక్టివా 2017 నాటికి 50 లక్షల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత 50 లక్షల సేల్స్ సాధించడానికి 7 సంవత్సరాల సమయంలో పట్టింది. యాక్టివా స్కూటర్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులు వంటి ప్రాంతాల్లో విరివిగా అమ్ముడైంది. దీంతో 1 కోటి సేల్స్ సాధించింది. అమ్మకాల్లో యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోడల్స్ రెండూ ఉన్నాయి.ఇదీ చదవండి: బీఎండబ్ల్యూ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే..హోండా మోటార్‌సైకిల్ విక్రయిస్తున్న టూ వీలర్స్ ఇవే..యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోటార్‌సైకిల్స్ మాత్రమే కాకుండా డియో, షైన్ 100, సీడీ 110 డ్రీమ్ డీలక్స్, షైన్ 125, ఎస్పీ125, హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్, సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, ఎన్ఎక్స్500, ఎక్స్ఎల్750 ట్రాన్సల్ప్, ఆఫ్రికా ట్విన్, గోల్డ్ వింగ్ టూర్, హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్ వంటి టూ వీలర్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం 110సీసీ, 125 సీసీ బైకులు అమ్ముడవుతున్నాయి. -
హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' తన సీబీ350, హైనెస్ సీబీ350 బైకులకు రీకాల్ ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్‌షాఫ్ట్ సమస్యల కారణంగానే ఈ రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు, కానీ కంపెనీ ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.వీల్ స్పీడ్ సెన్సార్‌లో ఉన్న సమస్య వల్ల అందులోని నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి వాటిమీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను రీకాల్ ద్వారా పరిష్కరించడానికి కంపెనీ సిద్ధమైంది.ఇదీ చదవండి: 809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే? ఇక క్యామ్‌షాఫ్ట్ కాంపోనెంట్‌తో వచ్చే సమస్యలు.. వెహికల్ పనితీరు మీద ప్రభావితం చూపుతాయి. కాబట్టి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన.. కంపెనీ వెల్లడించిన బైకులకు సంస్థ ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తుంది. వాహనం వారంటీతో సంబంధం లేకుండా సమస్యకు కారణమైన భాగాలను కంపెనీ ఉచితంగానే రీప్లేస్ చేస్తుంది. -
హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం ప్రత్యేకంగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కర్నాటకలోని నర్సాపుర ప్లాంటులో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు వెల్లడించింది. ఈ ఫెసిలిటీ నుంచి తొలి రెండు ఎలక్ట్రిక్ మోడళ్లు 2023–24లో రోడ్డెక్కనున్నాయి. మధ్యస్థాయి మోడల్‌తోపాటు వాహనం నుంచి వేరు చేయగలిగే బ్యాటరీతో సైతం ఈవీ రానుంది. (UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ) 2030 నాటికి 10 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. బ్యాటరీ, మోటార్, పీసీ యూ వంటి కీలక విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అత్సు షి ఒగటా తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 6,000 కంపెనీ టచ్ పాయింట్లలో చార్జింగ్ సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఫిల్లింగ్ స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, ఇతర ప్రాంతాల్లో సైతం బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నారు. రెండు కొత్త మోడళ్లు.. గుజరాత్‌లోని విఠలాపూర్ ప్లాంటులో స్కూటర్ల తయారీకై కొత్త లైన్‌ను జోడించనున్నట్టు ఒగటా వెల్లడించారు. తద్వారా అదనంగా 6 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యం తోడవుతుందని చెప్పారు. నర్సాపుర ప్లాంటు నుంచి యాక్టివా స్కూటర్ల తయారీని గుజరాత్ ప్లాంటుకు బదిలీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్తగా 160 సీసీ బైక్, 125 సీసీ స్కూటర్‌ను మూడు నెలల్లో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. పండగల సీజన్ నాటికి 350 సీసీ బైక్ ఒకటి రానుంది. (జోస్ అలుకాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాధవన్) కాగా, భారత్‌లో కంపెనీకి ఉన్న నాలుగు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 52 లక్షల యూనిట్లు. 2022–23లో హెచ్ఎంఎస్ఐ దేశీయంగా 40 లక్షల పైచిలుకు ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం కంపెనీ 18 మోడళ్లను 38 దేశాలకు ఎగుమతి చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 మోడళ్లను 58 దేశాలకు చేర్చాలన్నది సంస్థ ఆలోచన. అంతర్జాతీయంగా 2040 నాటికి ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ మోడళ్ల విక్రయాలు 100 శాతానికి చేర్చాలన్నది హోండా ధ్యేయం. -
స్మార్ట్ కీతో యాక్టివా 125
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తాజాగా ఆధునీకరించిన ఇంజన్‌తో యాక్టివా 125 స్కూటర్‌ను నాలుగు వర్షన్స్‌లో విడుదల చేసింది. డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్–స్మార్ట్ వీటిలో ఉన్నాయి. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.81,342 నుంచి రూ.90,515 వరకు ఉంది. అయిదు రంగుల్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: స్వర్గంలో ఉన్న నానాజీ, నానీ.. నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం) స్టార్ట్/స్టాప్ ఫీచర్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఓపెన్ గ్లోవ్ బాక్స్, ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్‌తో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంది. రియల్ టైమ్ మైలేజ్, ట్యాంకులో ఉన్న ఇంధనంతో ప్రయాణించే దూరం, ఇంధనం ఎంత ఉంది, సగటు మైలేజ్, సమయం వంటి వివరాలను చూపే చిన్న డిజిటల్ స్క్రీన్ పొందుపరిచారు. ఇంధన సమర్థవంతమైన టైర్లను జోడించారు. స్మార్ట్ ఫైండ్, సేఫ్, అన్‌లాక్, స్టార్ట్ ఫీచర్లు గల స్మార్ట్ కీతో టాప్ ఎండ్ వేరియంట్ లభిస్తుంది. వాహనాల మధ్య ఈ స్కూటర్ ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్...: టీం మొత్తానికి ఉద్వాసన) -
ఎలక్ట్రిక్ మార్కెట్లోకి హోండా మోటార్స్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా(హెైచ్ఎంఎస్ఐ) భారత్‌లోని ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నహాలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో యాక్టివా, షైన్ వంటి ప్రముఖ మోడల్స్ విక్రయించే ఈ సంస్థ తన డీలర్ భాగస్వాములతో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అట్సుషి ఒగాటా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "జపాన్ హోండా మోటార్ కంపెనీ తన మాతృ సంస్థతో చర్చించిన తర్వాత ఈ విభాగంలోకి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈవీ వాహనలను తయారు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనం కోసం విడిభాగాల సేకరణ, సరఫరా భాగస్వాములకు చర్చలు ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఈవీలను ఎగుమతి చేస్తామని కంపెనీ వెల్లడించింది.(చదవండి: ఇండియన్ మార్కెట్లోకి లండన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు) ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతు ఇస్తున్నందున విదేశీ కంపెనీలతో సహా పలు కంపెనీలు ఈవీ విభాగంలోకి ప్రవేశిస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు మెట్రో నగరాలకు మాత్రమే చేరువ అయ్యాయని చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు చేరువ కాలేదని అన్నారు. ఈవీ ప్రొడక్ట్ కు మాత్రమే పరిమితం కాకుండా బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ తయారీ విషయాన్ని కూడా కంపెనీ పరిగణనలోకి తీసుకోబోతోందని ఒగాటా పేర్కొన్నారు. హోండా మోటార్ ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి మూడు వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించింది. ఇప్పటికే చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ రాబోయే రెండేళ్లలో 5 నుంచి 25 కిలోవాట్ల సామర్ధ్యం గల ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ వాహనలను ప్రారంభించాలని చూస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వ్యాపారంపై రూ.1,000 కోట్ల పెట్టుబడిని కేటాయించిన సంస్థ సంప్రదాయ ఇంజిన్ వాహనాలపై కూడా పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుంది. హీరో మోటోకార్స్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, ఓలా లాంటి కంపెనీలు ఈ విభాగంలోకి వచ్చిన నేపథ్యంలో హోండా కంపెనీ ప్రవేశం ద్వారా పోటీ మరింత పెరుగుతుందని ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. (చదవండి: డౌన్‌లోడ్‌లో దూసుకెళ్తున్న ఇండియన్ ‘కూ’ యాప్) -
హీరో, హోండా.. రికార్డు విక్రయాలు
* ధన్‌తేరాస్ రోజున టూవీలర్ అమ్మకాల జోరు... 2 లక్షలు విక్రయించిన హీరో * హోండా అమ్మకాలు 1.65 లక్షలు న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ధన్‌తేరాస్ రోజున భారీ అమ్మకాలు నమోదు చేశాయి. హీరో ఏకంగా రెండు లక్షల వాహనాల అమ్మకాల మార్కును అధిగమించింది. ఇలా ఒక్క రోజులో ఇన్ని అమ్మకాలు సాధించ డం తమకు ఇదే తొలిసారని, గతేడాది ఇదే రోజుతో పోలిస్తే 80% పైగా వృద్ధి సాధించామని హీరో మోటోకార్ప్ నేషనల్ సేల్స్ హెడ్ ఎ.శ్రీనివాసు తెలిపారు. డిమాండ్ భారీగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి అందుకు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు హోండా 1.65 లక్షల వాహనాలను విక్రయించినట్లు వెల్లడించింది. గతేడాది ధన్‌తేరాస్ రోజున 78,500 వాహనాలు విక్రయించగా.. ఈసారి అమ్మకాలు ఏకంగా 110% వృద్ధి చెందినట్లు తెలిపింది. హీరో నుంచి విడిపోయి ప్రత్యేక కంపెనీగా ఏర్పడిన తర్వాత ఇదే తమకు తొలి పండుగ సీజన్ అని, భారీ విక్రయాలు కస్టమర్లకు తమపై ఉన్న నమ్మకాన్ని తెలియజే స్తోందని హెచ్ఎంఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ యాదవీందర్ గులేరియా చెప్పారు. ఈ పండుగ సీజన్‌ను రికార్డు అమ్మకాలతో ముగించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
హోండా ‘ఆక్టివా’ ఉత్పత్తి పెంపు
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్లో మరిన్ని ఆక్టివా స్కూటర్లను విక్రయించడంపై హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) దృష్టి సారించింది. 2001లో ఆక్టివా స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చామని, మంచి అమ్మకాలు సాధిస్తోందని హెచ్ఎంఎస్ఐ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ ఎస్. గులేరియా పేర్కొన్నారు. మార్కెట్లోకి వచ్చి 14 ఏళ్లు అయినప్పటికీ, ఇప్పటికీ ఈ స్కూటర్‌కు వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోందని, ఇది ఈ స్కూటర్‌కు వినియోగదారులు ఇస్తోన్న ప్రాధాన్యతను వెల్లడిస్తోందని వివరించారు. పండుగల సీజన్ కారణంగా పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి బెంగళూరులోని మూడోప్లాంట్లో ఉత్పత్తిని పెంచామని పేర్కొన్నారు. జూలై-సెప్టెంబర్ కాలానికి రోజువారీ ఉత్పత్తి 15-20 శాతం పెంచామని వివరంచారు. ఏప్రిల్-జూలై కాలానికి ఎంక్వైరీలు 30 శాతం పెరగాయని, అమ్మకాలు 33 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. వివిధ మోడళ్లకు సంబంధించి పెండింగ్ ఆర్డర్లు ఇప్పటివరకూ 60,000 ఉన్నాయని, వీటిల్లో 70 శాతం ఆక్టివా స్కూటర్వేనని వివరించారు. కాగా గత నెలలో హీరో మోటోకార్ప్ బైక్, స్ప్లెండర్ బైక్‌ల విక్రయాల(1,65,779)ను ఈ ఆక్టివా స్కూటర్ విక్రయాలు (1,91,883)అధిగమించాయి. ఆక్టివా స్కూటర్ నంబర్‌వన్ టూవీలర్గా నిలిచిందని గులేరియా పేర్కొన్నారు. గత 11 నెలల కాలంలో స్ప్లెండర్ అమ్మకాలను ఆక్టివా అమ్మకాలు మూడు సార్లు అధిగమించాయని వివరించారు.