హీరో, హోండా.. రికార్డు విక్రయాలు
* ధన్‌తేరాస్ రోజున టూవీలర్ అమ్మకాల జోరు... 2 లక్షలు విక్రయించిన హీరో
* హోండా అమ్మకాలు 1.65 లక్షలు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ధన్‌తేరాస్ రోజున భారీ అమ్మకాలు నమోదు చేశాయి. హీరో ఏకంగా రెండు లక్షల వాహనాల అమ్మకాల మార్కును అధిగమించింది. ఇలా ఒక్క రోజులో ఇన్ని అమ్మకాలు సాధించ డం తమకు ఇదే తొలిసారని, గతేడాది ఇదే రోజుతో పోలిస్తే 80% పైగా వృద్ధి సాధించామని హీరో మోటోకార్ప్ నేషనల్ సేల్స్ హెడ్ ఎ.శ్రీనివాసు తెలిపారు. డిమాండ్ భారీగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి అందుకు అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
మరోవైపు హోండా 1.65 లక్షల వాహనాలను విక్రయించినట్లు వెల్లడించింది. గతేడాది ధన్‌తేరాస్ రోజున 78,500 వాహనాలు విక్రయించగా.. ఈసారి అమ్మకాలు ఏకంగా 110% వృద్ధి చెందినట్లు తెలిపింది. హీరో నుంచి విడిపోయి ప్రత్యేక కంపెనీగా ఏర్పడిన తర్వాత ఇదే తమకు తొలి పండుగ సీజన్ అని, భారీ విక్రయాలు కస్టమర్లకు తమపై ఉన్న నమ్మకాన్ని తెలియజే స్తోందని హెచ్‌ఎంఎస్‌ఐ వైస్ ప్రెసిడెంట్ యాదవీందర్ గులేరియా చెప్పారు. ఈ పండుగ సీజన్‌ను రికార్డు అమ్మకాలతో ముగించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.