హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే.. | Honda Motorcycle Recalls 300 and 350 CC Bikes | Sakshi
Sakshi News home page

హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..

Published Tue, Sep 17 2024 2:43 PM | Last Updated on Tue, Sep 17 2024 3:13 PM

Honda Motorcycle Recalls 300 and 350 CC Bikes

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా' తన సీబీ350, హైనెస్ సీబీ350 బైకులకు రీకాల్ ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్‌షాఫ్ట్ సమస్యల కారణంగానే ఈ రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.

2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు, కానీ కంపెనీ ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.

వీల్ స్పీడ్ సెన్సార్‌లో ఉన్న సమస్య వల్ల అందులోని నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి వాటిమీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను రీకాల్ ద్వారా పరిష్కరించడానికి కంపెనీ సిద్ధమైంది.

ఇదీ చదవండి: 809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే?    

ఇక క్యామ్‌షాఫ్ట్ కాంపోనెంట్‌తో వచ్చే సమస్యలు.. వెహికల్ పనితీరు మీద ప్రభావితం చూపుతాయి. కాబట్టి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన.. కంపెనీ వెల్లడించిన బైకులకు సంస్థ ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తుంది. వాహనం వారంటీతో సంబంధం లేకుండా సమస్యకు కారణమైన భాగాలను కంపెనీ ఉచితంగానే రీప్లేస్ చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement