
న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా రూ.2,000 కోట్ల నిధులను సమీకరించింది. ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీతోసహా ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి ఈ మొత్తాన్ని అందుకున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఆదాయం, వృద్ధి, లాభదాయకత పరంగా 2022–23 ఉత్తమ సంవత్సరంగా నిలుస్తుందని బైజూస్ ఫౌండర్, సీఈవో బైజు రవీంద్రన్ ఈ సందర్భంగా తెలిపారు.
గౌరవప్రద పెట్టుబడిదారుల నుండి నిరంతర మద్దతు సంస్థ ఇప్పటివరకు సృష్టించిన ప్రభావాన్ని, లాభదాయకతకు మార్గాన్ని ధృవీకరిస్తుందని చెప్పారు. 120కిపైగా దేశాల్లో 15 కోట్ల మంది బైజూస్ ఉత్పత్తులు, సేవలను వినియోగిస్తున్నారు.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
Comments
Please login to add a commentAdd a comment