వెయ్యి మందికి బైజూస్‌ బైబై | Byjus begins second round of job cuts, more than 1,000 employees | Sakshi
Sakshi News home page

వెయ్యి మందికి బైజూస్‌ బైబై

Published Tue, Jun 20 2023 6:21 AM | Last Updated on Tue, Jun 20 2023 6:21 AM

Byjus begins second round of job cuts, more than 1,000 employees - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌ తాజాగా వివిధ విభాగాల నుంచి 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. బిలియన్‌ డాలర్ల (రూ.8,200 కోట్లు) టర్మ్‌ లోన్‌ విషయమై అమెరికాలో రుణదాతలతో బైజూస్‌ న్యాయ పోరాటం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చేసుకోవడం గమనార్హం.

కొత్త ఉద్యోగుల చేరికను కలిపి చూస్తే మొత్తం ఉద్యోగుల సంఖ్య 50,000 స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. బైజూస్‌ లోగడ 5 శాతం ఉద్యోగులు అంటే సుమారు 2,500 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. 2020 అక్టోబర్‌ నుంచి ఆరు నెలల కాలంలో ఇంత మందిని తగ్గించుకోనున్నట్టు తెలిపింది. 2023 మార్చి నాటికి లాభాల్లోకి రావాలన్న లక్ష్యంలో భాగంగా నాడు ఆ నిర్ణయం తీసుకుంది. వ్యయాలు తగ్గించుకోవడంలో భాగమే ఈ తొలగింపులు అన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement