న్యూఢిల్లీ: ఇటీవల ఇతర సంస్థలను చేజిక్కించుకోవడంలో వేగం చూపుతున్న ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తు న్న జియోజెబ్రాను కొనుగోలు చేసింది. అయితే డీల్ విలువను బైజూస్ వెల్లడించలేదు. లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా 11.5 కోట్ల మంది విద్యా ర్ధులకు సేవలందిస్తున్న బైజూస్ తాజా కొనుగోలుతో ప్రస్తుత మాథమాటిక్స్ పోర్ట్‌ఫోలియోకు మరిన్ని అభ్యాసన విధానాలను జత చేసుకోనుంది.
అంతేకాకుండా కొత్త ప్రొడక్టులను సైతం ప్ర వేశపెట్టనుంది. కాగా.. మాథమాటిక్స్ లెర్నిం గ్‌లో పటిష్ట ప్లాట్‌ఫామ్స్ కలిగిన జియోజెబ్రా ఇకపైన కూడా వ్యవస్థాపకుడు, డెవలపర్ మార్కస్ హోహెన్‌వార్టర్ ఆధ్వర్యంలో స్వతంత్ర యూనిట్‌గా కొనసాగనున్నట్లు బైజూస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment