ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇన్సెంటివ్‌ల విషయంలో జరిగిన అన్యాయంపై ఓ మహిళా ఉద్యోగి తన సీనియర్‌తో ఘర్షణకు దిగినట్లుగా ఆ వైరల్ వీడియోలో కనిపిస్తోంది.
తొలగింపునకు గురైన మహిళా ఉద్యోగి ఇన్సెంటివ్‌లు, ఇతర విషయాల్లో తనకు జరిగిన అన్యాయంపై తన బాస్‌ను గట్టిగా ప్రశ్నించింది. తనను ఉన్నట్టుండి తొలగించారని, ఫైనల్ సెటిల్‌మెంట్‌లోనూ అన్యాయం జరిగిందని, కేవలం రూ. 2,000 మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది జరిగిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందంటూ ట్విటర్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. 'ఘర్ కే కలేష్' అనే ట్విటర్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో ప్రామాణికత నిర్ధారణ కాలేదు.
ఈ వీడియోపై పలువురు ట్విటర్ యూజర్లు ప్రతిస్పందించారు. ఇలాంటివి జరగకుండా వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవడం మేలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు ఫైనల్ సెటిల్‌మెంట్‌లో ఆమెకు కేవలం రూ.2000 మాత్రమే ఇవ్వడంపై బైజూస్ యాజమాన్యాన్ని విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు.
Kalesh b/w Employee and Byjus Companyy over giving lot’s of mental pressure during job (Unfortunately Girl is missing since then) pic.twitter.com/xzgIUbqjeq
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023
Comments
Please login to add a commentAdd a comment