
సాక్షి, కామారెడ్డి: గాంధారి పోలీస్ స్టేషన్‌లో గండివేట్ గ్రామానికి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కుర్చీలు, కర్రలు, అందుబాటులో ఉన్న వస్తువులతో ఓ వర్గంపై మరో వర్గం పరస్పరం దాడులు చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గండివేట్ గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో గాంధారి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ వివాదం మరింత ముదరడంతో పోలీస్ స్టేషన్‌లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పీఎస్‌లోనే కొట్టుకోవడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment