బీసీసీఐకి రూ.158 కోట్లు బాకీ.. బైజూస్‌కు నోటీసులు  | BCCI Files Insolvency Plea Against Byjus Before NCLT Citing Default In Payment Of 158 Crore | Sakshi
Sakshi News home page

బీసీసీఐకి రూ.158 కోట్లు బాకీ.. బైజూస్‌కు నోటీసులు 

Published Tue, Dec 5 2023 8:36 AM | Last Updated on Tue, Dec 5 2023 9:15 AM

BCCI Files Insolvency Plea Against Byjus Before NCLT Citing Default In Payment Of 158 Crore - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బాకీ పడిన రూ. 158 కోట్లకు సంబంధించి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ‘బైజూస్‌’ సంస్థకు నోటీసులు జారీ చేసింది. భారత క్రికెట్‌ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఈ నోటీసులు ఇచ్చింది. ‘దీనిపై స్పందించేందుకు బైజూస్‌కు రెండు వారాల గడువు ఇచ్చాం.

ఆపై మరో వారం రోజుల్లో బీసీసీఐ తమ అభ్యంతరాలను దాఖలు చేయాలి’ అని ఆదేశించిన ఎన్‌సీఎల్‌టీ... ఈ కేసును డిసెంబర్‌ 22కు వాయిదా వేసింది. 2019లో భారత క్రికెట్‌ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా వచ్చిన బైజూస్‌ సంస్థ తర్వాతి రోజుల్లో దివాళా తీయడంతో బీసీసీఐకి రూ. 158 కోట్లు బాకీ పడింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement