బైజూస్ బ్రాండ్‌పై సేవలు అందిస్తున్న ఎడ్‌టెక్ దిగ్గజం థింక్ అండ్ లెర్న్, తన ఉద్యోగుల్లో 25 శాతం మందికే ఫిబ్రవరి నెల పూర్తి వేతనాలు అందించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఇలా వేతనం అందుకోబోతున్న వారంతా తక్కువ వేతన స్కేలులో ఉన్న వారే కావడం గమనార్హం.
మిగతా వారికి పాక్షిక చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. కొందరు పెట్టుబడిదార్లు నిధులను బ్లాక్ చేయడంతో కంపెనీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వేతనాలు చెల్లిస్తున్నామని బైజూస్ యాజమాన్యం ఇటీవల ఉద్యోగులకు లేఖలు పంపింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలను గత శుక్రవారం రాత్రి ప్రాసెస్ చేశామని అందులో పేర్కొంది. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమచేస్తామని కంపెనీలు వర్గాలు తెలిపినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..!
Comments
Please login to add a commentAdd a comment