న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (ఈఎఫ్‌ఏ) కార్యక్రమానికి అంతర్జాతీయ ప్రచారకర్తగా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ నియమితులయ్యారు. అందరికీ సమానంగా విద్యను అందించాలన్న ఆశయాన్ని ప్రచారం చేయడానికి ఆయనతో ఒప్పందం చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.
గ్లోబల్ అంబాసిడర్‌గా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీతో కలిసి పనిచేయడం గర్వంగానూ, ఆనందగానూ ఉందని బైజూస్ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాము దాదాపు 5.5 మిలియన్ల మంది పిల్లలకు సాధికారత కల్పిస్తోంది. మానవ సామర్థ్యాన్ని పెంపొందించే శక్తికి లియోనెల్ మెస్సీని ప్రతినిధులు మరెవ్వరూ ఉండరని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు దాదాపు 3.5 బిలియన్ల మందిఫ్యాన్స్ ద్వారా విదేశాల్లో చేరాలని కంపెనీ యోచిస్తోంది. కాగా సోషల్ మీడియాలో లియోనెల్ మెస్సీ ఫాలోయర్ల సంఖ్య దాదాపు 450 మిలియన్ల మంది ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment