
Aryan Khan Arrest In Drugs Case: కెరీర్ సంగతేమోగానీ.. వివాదాలు తారల బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీస్తాయా? అంటే.. అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఓ కూల్‌డ్రింక్ కంపెనీ, మరొక కంపెనీ బలవంతంగా అంబాసిడర్ హోదా నుంచి తప్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.
ఎడ్యుకేషన్ టెక్ ప్లాట్‌ఫామ్ బైజూస్‌కి గత కొన్నేళ్లుగా షారుక్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన యాడ్స్ సైతం బుల్లితెరపై కనిపిస్తుంటాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన్ని బైజూస్ అంబాసిడర్ నుంచి తొలగించాలని పలువురు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ ‘డ్రగ్స్ వ్యవహారంలో’ అరెస్టైన విషయం తెలిసిందే. ఓ క్రూయిజ్‌షిప్ పార్టీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు నిర్వహించడం.. అందులో ఆర్యన్ ఉండడం, అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం, ఆపై అరెస్ట్ పరిణామాలు అందరికీ తెలిసినవే. అయితే పిల్లల్ని సరిగ్గా పెంచడం చేతకానీ షారుక్.. ఓ మేధావి క్యారెక్టర్‌లో బైజూస్ యాడ్‌లో నటించడం, పేరెంట్స్‌కు పిల్లల విషయంలో పాఠాలు చెప్పడం, సలహాలు ఇవ్వడం మింగుడు పడడం లేదని చాలామంది విమర్శిస్తున్నారు.
దీంతో నిన్నంతా(ఆదివారం) బైజూస్ ట్యాగ్ ట్విటర్ టాప్‌లో ట్రెండ్ అయ్యింది. పిల్లల్ని సక్రమంగా పెంచలేని షారుక్‌ను బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించాలని పలువురు బైజూస్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బైజూస్ రంగంలోకి దిగినట్లు సమాచారం. షారుక్‌ను అంబాసిడర్‌గా తప్పించడంతో పాటు ఇప్పటికే తీసిన యాడ్‌లను సైతం టీవీల్లో టెలికాస్ట్ కాకుండా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఓ జాతీయ మీడియా ప్రముఖంగా కథనం ప్రచురించింది. మరోవైపు ఈ వ్యవహారం ప్రభావంతో మరికొన్ని బ్రాండ్‌లు సైతం షారుక్‌కి దూరమయ్యే అవకాశం ఉందని కోరెరో కన్సల్టింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ సలిల్ వైద్యా అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా సినిమాలతో సక్సెస్‌కి దూరమైన షారుక్.. ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్‌కూ దూరమైతే కష్టమే మరి!
చదవండి: నా కొడుకు అన్ని రకాలుగా ఎంజాయ్ చేయాలి: షారుక్ వీడియో వైరల్
జయపై ట్రోలింగ్
ఇక గతంలో బాలీవుడ్‌పై డ్రగ్స్ ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. పార్లమెంట్ సాక్షిగా నటి జయా బచ్చన్, చిత్ర పరిశ్రమను వెనకేసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జయను సైతం ఈ వ్యవహారంలోకి లాగి..‘‘Thali me ched wali’’ aunty పేరుతో ట్విటర్‌లో ఏకీపడేశారంతా. అసలు విషయం ఏంటంటే.. గతంలో నటుడు, లోక్‌సభ ఎంపీ రవికిషన్(రేసు గుర్రం ఫేమ్) గతంలో పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో డ్రగ్స్ సంస్కృతి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాజ్యసభలో మాట్లాడిన జయా బచ్చన్.. కొందరి ఆధారంగా మొత్తం పరిశ్రమను నిందించడం సరికాదని ఆవేశంగా ప్రసగించారు. అయితే ఆర్యన్ అరెస్ట్ పరిణామాల నేపథ్యంలో ‘ఇప్పుడేమంటావ్ జయా ఆంటీ?’ అంటూ జయా బచ్చన్‌ను నిలదీస్తున్నారు చాలామంది నెటిజన్స్.
Reminds me this epic defence of drug abuse in Bollywoodpic.twitter.com/EcBiD07aLy
— Rishi Bagree (@rishibagree) October 3, 2021
#AryanKhan
— Shruti (@kadak_chai_) October 3, 2021
#JayaBachchan
No Shor from "Thali me ched wali "aunty pic.twitter.com/fisoYanHCb