టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు అకౌంట్ లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ‘నా పేరిట ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నకిలీది. ఆ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన వార్తలు గానీ, కోట్స్ గానీ దయచేసి ఎక్కడా వాడకండి. ఇన్‌స్టాగ్రామ్ టీమ్‌కి ఈ విషయం గురించి వెంటనే రిపోర్టు చేస్తానంటూ’ దాదా ట్వీట్ చేశాడు. sganguly99 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చిన పోస్టుల ఆధారంగా.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌ను, కెప్టెన్ కోహ్లిని విమర్శిస్తూ గంగూలీ వ్యాఖ్యలు చేశాడంటూ పలు మీడియా చానళ్లలో వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ అకౌంట్ నకిలీదని గంగూలీ వివరణ ఇచ్చాడు.
ఆ పోస్టుల్లో ఏముందంటే...
‘టెస్టు మ్యాచ్ గెలవాలంటే ప్రతీ ఒక్కరూ పరుగులు చేయాల్సి ఉంటుంది. కోహ్లి బాగా ఆడకపోయి ఉంటే రెండో రోజే టీమిండియా ఇన్నింగ్స్‌కు ముగింపు పడేది. కెప్టెన్‌గా ఉన్న కారణంగా నువ్వు(కోహ్లి) విమర్శలు ఎదుర్కోక తప్పదు. విజయం వరించినపుడు ఆనందించడమే కాదు అపజయాన్ని కూడా స్వీకరించాలంటూ’ కోహ్లిని ట్యాగ్ చేస్తూ దాదా పేరిట ఉన్న అకౌంట్ నుంచి వచ్చిన పలు పోస్టులు వైరల్ అయ్యాయి. కాగా ఇప్పటికే ఆ అకౌంట్‌కు 55.3 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
My Instagram page is a fake one ..please don’t pick up any news or quotes from it ..Will report to Instagram immediately @samiprajguru @imVkohli
— Sourav Ganguly (@SGanguly99) August 6, 2018
Comments
Please login to add a commentAdd a comment