గ్రేట్ రన్.. ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్
పరుగులు తీసే మనసుంటే వయసుతో పనేంటని నిరూపించారు హైదరాబాదీలు. పాతికేళ్ల యువకులు.. టీనేజీ కుర్రాళ్లు.. పదేళ్లు కూడా లేని చిచ్చర పిడుగులు.. రిటైరైన పెద్దలు.. ఇలా అన్ని వయసుల వారు పరుగు పథంలో దూసుకెళ్లారు. అడుగులో అడుగేస్తూ.. వడివడిగా సాగిపోతూ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎయిర్‌టెల్, హైదరాబాద్ రన్నర్స్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ‘ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్’ గ్రాండ్ సక్సెస్ అయింది. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి మొదలైన రన్‌లో పాల్గొన్న రన్నర్లు.. వారికి అడుగడుగునా సపోర్ట్ చేసిన నగరవాసులతో మారథాన్ మార్గం కోలాహలంగా మారిపోయింది.
తెల్లవారుజామున 5 గంటలకే సిటీ రోడ్లు రన్నర్లతో నిండిపోయాయి. రన్ మొదలైన పీపుల్స్ ప్లాజా దగ్గర సందడి కనిపించింది. ఉదయం 6 గంటలకు హాఫ్ మారథాన్ మొదలైంది. రెండు ఫార్మాట్లలో కలిపి సుమారు 15 వేల మంది రన్నర్లు ఈవెంట్‌లో పాలుపంచుకున్నారు. ఓ చోట జోరుగా.. మరోచోట నెమ్మదిగా.. మధ్యలో ఫ్లైఓవర్లు, ఎత్తుపల్లాల రహదారుల మీదుగా మారథాన్ ఉల్లాసంగా సాగింది.
అంతటా ఉత్సాహం..
మారథాన్ సాగే రూట్‌లో వాలంటీర్ల సందడి కనిపించింది. ప్రతి కిలోమీటర్‌కు వాటర్ స్టేషన్, రెండు కిలోమీటర్లకు ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ ఏర్పాటు చేసి రన్నర్లకు చేదోడువాదోడుగా ఉన్నారు. అరటిపళ్లు పంపిణీ చేశారు. గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఉదయం 8 గంటలకు 5కె రన్ మొదలైంది. స్టేడియంలో ఏర్పాటు చేసిన మ్యూజిక్‌కు అనుగుణంగా స్టెప్పులేస్తూ.. వేలాది మంది పరుగెత్తారు. కేటీఆర్, రానా, సునీల్ కూడా రన్‌లో పాల్గొన్నారు. కమాన్ హైదరాబాద్ నినాదాల తో స్టేడియం మార్మోగిపోయింది. బే ్లడ్ రన్నర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఏర్పాట్లు బాగున్నాయి
‘జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ టైస్టులు జరిపిన దాడుల్లో నా కుడికాలు పోయింది. అయినా నాకిష్టమైన పరుగును మాత్రం ఆపలేదు. గతేడాది హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై మారథాన్‌లలో పాల్గొన్నా. ఇందులో నాతో పాటు 15 మంది కృత్రిమ కాలుతో పరుగెత్తారు.
- డీపీ సింగ్, ఆర్మీ మాజీ మేజర్
ఎంజాయ్ చేశా
భారత్‌లో పాల్గొన్న తొలి మారథాన్ ఇదే. ఎంతో ఎంజాయ్ చేశా. నాతో వచ్చిన 12 మంది ఫ్రెండ్స్... హాఫ్ మారథాన్ మార్గంలో సాగుతూ నన్ను ఎంకరేజ్ చేశారు. వచ్చే ఏడాదీ తప్పకుండా వస్తా.
- క్రిస్టియన్ పయే, అమెరికా
- వీఎస్