
లాటరీ తగిలితే ఎవరికైనా మాటల్లో చెప్పలేనంతా ఆనందంగా ఉంటుంది. అది సహజం. కానీ ఇక్కడొక వ్యక్తికి లాటరీ తగలడమే అత్యంత విషాదంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే శాపంగా మారింది అనే చెప్పాలి.
వివరాల్లోకెళ్తే...థాయ్‌లాండ్‌కు చెందిన మణిత్ అనే వ్యక్తి రూ. 1.3 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. దీంతో అతను తెగ ఆనందపడటమే కాకుండా అందులో కొంత భాగాన్ని ఆలయానికి విరాళంగా ఇద్దాం అనుకున్నాడు. మిగిలిన సోమ్మును కుటుంబసభ్యుల కోసం ఉపయోగించాలని ప్లాన్ చక్కగా చేసుకున్నాడు. ఐతే పాపం ఇది అతనికి విషాదాన్ని మిగుల్చుతుందని కల్లో కూడ అనుకుని ఉండడు. ఎదుకంటే? అతడి భార్య అంగ్‌కన్‌రత్ ఆ లాటరీ తీసుకుని తన ప్రియుడుతో జంప్ అయ్యిపోయింది.
ఇదంతా తెలియని మణిత్ లాటరీ గెలుచుకున్నాను కదా అని కుటుంబసభ్యులతో గ్రాండ్‌గా పార్టీ చేసుకుంటున్నాడు. ఆ వేడుకలో భార్యతో కనిపించిన ఆ వ్యక్తిని చూసి ఎవరని ప్రశ్నిస్తే తమ బంధవు అని చెప్పింది. దీంతో అతను తన భార్య తరుఫు బంధువుగానే భావించాడే తప్ప ఏ సందేహం రాలేదు మణిత్‌కి. దీంతో అతను ఆనందంగా పార్టీలో మునిగిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో మణిత్ ఒక్కసారిగా షాక్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఐతే మణిత్, అంగన్‌రాత్‌లకు వివాహమై 26 ఏళ్లు అయ్యింది, పైగా ముగ్గురు పిల్లలు కూడా. ఆమె పారిపోతుందనేలా తనపై ఎలాంటి సందేహం తనకు రాలేదని మణిత్ పోలీసులకు చెప్పాడు. ఐతే పోలీసులు వారికి వివాహం అయ్యి అన్నేళ్లు అయినప్పటికీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోకపోవడంతో మణిత్‌కు ఎలాంటి న్యాయం చేయలేమని తేల్చి చెప్పారు. అతను ఆ లాటరీ డబ్బును ఆమెకే గిఫ్ట్‌గా ఇచ్చి దాయమని చెప్పినట్లు పోలీసులకు ఆవేదనగా చెప్పాడు. తాము కేవలం అతడి భార్యను ఒప్పించి డబ్బు ఇప్పించే ప్రయత్నం మాత్రమే చేయగలమని, పైగా ఆ సోమ్ము చట్టబద్ధంగా వారికి చెందదు అని మణిత్‌కి చెప్పారు పోలీసులు. దీంతో అతను భార్యకోసం తీవ్రంగా గాలించడమే కాకుండా చివరకు థాయ్‌లాండ్ మీడియాను సైతం సంప్రదించాడు.
Comments
Please login to add a commentAdd a comment