Prize
-
ఆ ఊళ్లో.. ఇళ్లు, కారు చౌక! ధర ఎంతంటే? కేవలం...
ఆ ఊళ్లో ఇళ్లు కారుచౌకగా దొరుకుతాయి. అక్కడి ఇళ్ల ధరలు తెలుసుకుంటే, ఇక్కడి జనాలు ఏమాత్రం నమ్మలేరు. ఆ ఊరు ఇటలీలో ఉంది. సిసిలీ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని సంబూకా అనే పట్టణంలో ఒక్కో ఇల్లు ఒక యూరో నుంచి మూడు యూరోల (దాదాపు రూ. 90 నుంచి రూ. 270) ధరకే దొరుకుతాయి.సరిగా చెప్పాలంటే, ఈ ఇళ్లు మామూలు పిజ్జా ధర కంటే తక్కువే! ఇటలీలో పిజ్జా ధర దాదాపు 5 యూరోల (రూ.446) వరకు ఉంటుంది. ఈ పట్టణంలో ఇప్పటికే రెండుసార్లు– 2019లో ఒకసారి, 2021లో ఒకసారి ఇళ్ల వేలం నిర్వహించారు. ఆ వేలం పాటల్లో ఇళ్ల ధరలు ఒక యూరో నుంచి మూడు యూరోల వరకు పలికాయి.త్వరలోనే మరోసారి ఈ ఊళ్లో ఇళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈసారి కూడా వేలంలో ఇళ్ల ధరలు పెద్దగా పెరిగే అవకాశం లేదని, ఇళ్ల ప్రారంభ ధరలు 3 యూరోల (సుమారు రూ.270) నుంచి మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలాకాలంగా ఖాళీగా మిగిలిపోయి, పాడుబడిన ఇళ్లను ఈ పట్టణ సంస్థ ఇలా వేలంలో విక్రయిస్తోంది. వీటిని కొనుగోలు చేసేందుకు ఇటాలియన్లతో పాటు ఇటలీకి వచ్చే విదేశీ పర్యాటకులు కూడా ఆసక్తి చూపుతున్నారు.పురాతనమైన పాడుబడిన ఇళ్లకు పన్నులు కట్టలేక కొందరు యజమానులు వాటిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్నారని, అందుకే ఇక్కడ ఇళ్లు ఇంత చౌకగా దొరుకుతున్నాయని రియల్ ఎస్టేట్ ఏజెంట్ మారిజియో బెర్తీ చెబుతున్నారు. ఇక్కడ చౌకగా దొరికే ఇళ్లలో ఎక్కువగా శతాబ్దాల కిందట నిర్మించినవి. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మసూద్ అహ్మది అనే వ్యక్తి, ఆయన భార్య షెల్లీ ఇక్కడ మూడు యూరోలకు 2019లో పద్దెనిమిదో శతాబ్ది నాటి ఇల్లు కొన్నారు.దానిని 8400 యూరోల (సుమారు రూ.7.50 లక్షలు) ఖర్చుతో బాగు చేయించుకున్నారు. ఇక్కడ ఇళ్ల ధరల కంటే, వాటి మరమ్మతుల ఖర్చే ఎక్కువగా ఉంటుంది. మరమ్మతు ఖర్చులు కలుపుకున్నా, ఇక్కడి ఇళ్ల ధరలు కారుచౌక అనే చెప్పాలి. -
'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..
సినిమాల్లోనూ చూస్తుంటాం హీరోనే మొత్తం ప్రత్యర్థులను గడగడలాడించి యోధుడులా గెలవడం. రియల్ లైఫ్‌లో అంత ఈజీ కాదు. కానీ అటాంటి రియల్ హీరోని చత్తీశ్‌గఢ్‌లో చూడొచ్చు. ఒకేఒక్కడు యోధుడిలా లంగ్స్ ఆప్ చత్తీస్‌గఢ్‌గా పేరుగాంచిన హస్డియో అడువులను సంరక్షించారు. ఇవి భారతదేశంలోని అతిపెద్ద అటవీ సంపద. ఆయన ఒక్కడే అక్కడ ఉన్న గిరిజనులు ప్రజలను చైత్యన్యవంతం చేసి అక్కడ పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చేశాడు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి ఇక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా వెనుదిరిగేలా చేశాడు. అందుకుగాను అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు కూడా. ఎవరా వ్యక్తి అంటే..?'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'గా పేరుగాంచిన హిస్టియో అడువులు భారతదేశంలోని అతిపెద్ద అటవీ ప్రాంతంలో ఒకటి. దాదాపు 657 చదరుపు విస్తీర్ణంలో దట్టమైన జీవవైవిధ్యమైన హస్టియో అడువులు భారతదేశంలోని అత్యంత విస్తృతమైన అటవీ ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ సుమారు 25 రకాల అంతరించిపోతున్న జాతులు, 92 పక్షి జాతులు, 167 అరుదైన ఔషధ వృక్ష జాతులకు నిలయం ఈ అడవులు. దాదాపు 15 వేల మంది గిరిజనులు జీవనోపాధి ఈ హస్టియో అరణ్య అడవులపైనే ఆధారపడి ఉంది.అంతేగాక ఈ ప్రాంతం భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు నిల్వల్లో ఒకటి. ఈ హస్టియో అడవులు కింద దాదాపు ఐదు బిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు అంచనా. దీంతో 2010లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ హస్టియో అడవులలో ఉన్న గొప్ప జీవవైవిధ్యాన్ని గుర్తించి మైనింగ్ కోసం నోగో జోన్‌గా ప్రకటించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ ప్రదేశంలో మైనింగ్ కార్యకలాపాలు సాగించేందుకు ముమ్మరంగా ప్రయత్నించాయి. అంతేగాదు సుమారు 21 ప్రతిపాదిత బొగ్గు గనులను వేలం వేసే యత్నం చేసింది. దీంతో అటవీ, గిరిజన హక్కుల కార్యకర్త అలోక్ శుక్లా(43) స్ధానిక గిరిజన సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి..బొగ్గు వేలాన్ని వ్యతిరేకించేలా చేశాడు. అంతేగాదు బొగ్గు గనులను రక్షించేందుకు గ్రామ శాసనమండలి చేత 2020లో 9.45 లక్షల ఎకరాల్లో లెమ్రు ఏనుగుల రిజ్వరాయర్ సంబంధించిన ఏనుగులు కారిడార్‌ని నియమించేలా పోత్సహించాడు. చత్తీస్‌గఢ్ బచావో వంటి హ్యాష్ ట్యాగ్ నినాదాలతో డిజిటల్, సోషల్ మీడియాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యిపోయాడు అలోక్. మోటారు సైకిల్‌పై ర్యాలీ దగ్గర నుంచి, వివాహ పత్రికల్లో సైతం అదే నినాదంతో కూడిన హ్యాష్ ట్యాగ్లు ఒక్కసారిగా పంచదృష్టిని ఆకర్షించాయి. గ్రామస్తుల చేత చెట్లు నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని కౌగలించుకుని కాపాడుకునేలా చైతన్యం తీసుకొచ్చాడు. దీంతో జూలై 2022లో రాష్ట్ర శాసనసభ మొత్తం హస్టియో అరణ్య ప్రాంతంలోని మైనింగ్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అమోదించింది. ఆ తర్వాత అదే ఏడాది జూలై 21 నాటి 21 బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వ రద్దు చేసింది. ఇలా అలోక్ శుక్లా తన ప్రణాళికబద్ధమైన అలుపెరగని కృషితో 21 మైనింగ్ గనుల తవ్వకాలు జరపకుండా నాలుగున్నర ఎకరాల అడువులను విజయవంతంగా రక్షించాడు. అందుకుగానూ ప్రతిష్టాత్మక గోల్డ్‌మ్యాన్ పర్వావరణ బహిమని అందుకున్నాడు. దీన్ని గ్రీన్ నోబెల్ అని కూడా పిలుస్తారు. ఈ బహుమతి, ఆఫ్రికా, ఆసియా, యూరప్, ద్వీపాలు, ఉత్తర అమెరికా, దక్షిణ మధ్య అమెరికా వంటి ప్రపంచంలోని దాదాపు ఆరు ఖండాంతర ప్రాంతాల్లోని పర్యావరణ నాయకుల చేసిన కృషిగానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవిస్తారు. కాగా, ఈ గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్‌ను శాన్‌ఫ్రావిన్సిస్కో పౌర నాయకులు రిచర్డ్, రోడా గోల్డ్‌మన్‌లు ఏర్పాటు చేశారు. (చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!) -
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ప్రతి ఏటా అందించే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’కు సంబంధించి కొత్త మార్గదర్శకాన్ని ప్రకటించింది. ఇన్ఫోఫిస్ ప్రైజ్ కోసం నామినేషన్ల వయోపరిమితిని 40 ఏళ్లలోపు కుదించినట్లు ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ బుధవారం వెల్లడించింది. మరింత మంది యువ ప్రతిభావంతులను పరిశోధనలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఇన్ఫోసిస్ ప్రైజ్ కోసం నామినేషన్ల వయోపరిమితిని 40 ఏళ్లలోపు తగ్గించినట్లు తెలిపింది. వారిలోని అసాధారణ ప్రతిభను కనిపెట్టి, వారి సేవలను సత్కరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.అంతేగాక ఇప్పటివరకు సోషల్ సైన్సెస్ కేటగిరిలో భాగమైన ఎకానమిక్స్ కోసం ప్రత్యేక బహుమతి అందిచనున్నట్లు తెలిపింది. దీంతో బహుమతులు అందజేసే వర్గాల సంఖ్య ఏడుకు చేరుకుంది. కాగా ఫౌండేషన్ తరపున ఇప్పటి వరకు 92 మంది పరిశోధకులకు అవార్డులు ప్రదానం చేశారు.కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను పత్రి ఏటా ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ను అందిస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్య వంటి ఆరు విభాగాల్లో కృషి చేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రతి కేటగిరి నుంచి గెలుపొందిన విజేతలకు ఒక బంగారు పతకంతోపాటు, ప్రశంస పత్రం, లక్ష డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం రూ. 83 లక్షల 50 వేలు), దానికి సమానమైన ప్రైజ్ పర్స్ అందిస్తారు.ఇదిలా ఉండగాప్రొఫెసర్ అరవింద్, ప్రొఫెసర్ కౌశిక్ బసు, ప్రొఫెసర్ శ్రీనివాస్ కులకర్ణితో కూడిన జ్యూరీ ఇప్పటికే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’ కోసం నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఏడాది నవంబర్‌లో విజేతలను ప్రకటించే అవకాశం ఉంది. అవార్డు ప్రదానోత్సవం జనవరిలో జగనుంది.మానవాళికి మేలు చేసే అత్యుత్తమ పరిశోధనలను గుర్తించడం, దేశంలోని యువ పరిశోధకులకు, ఔత్సాహిక శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలవడమే ఇన్ఫోసిస్ ప్రైజ్ ప్రాథమిక లక్ష్యం. కాగా విదేశాలకు చెందిన విజేతలు బహుమతిని గెలుచుకునే సమయంలో తమకు నచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్లలో తగిన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దేశంలో గరిష్టంగా రెండు పర్యటనలలో 30 రోజులు గడవాల్సిందిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కోరుతుంది. -
Leif Erikson Lunar Prize: ఇస్రోకు ఐస్లాండ్ ‘అన్వేషణ’ అవార్డ్
న్యూఢిల్లీ: చంద్రుడిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు ఐస్‌ల్యాండ్‌కు చెందిన సంస్థ నుంచి అవార్డ్ దక్కింది. చంద్రయాన్–3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకుగాను 2023 ఏడాదికి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్‌ను ఇస్తున్నట్లు హుసావిక్ నగరంలోని ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం తెలిపింది. క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 400 సంవత్సరాల ముందే అమెరికా గడ్డపై కాలుమోపిన తొలి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్కు గుర్తుగా ఈ అవార్డును ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం ఇస్తోంది. నూతన అన్వేషణలతో చేస్తున్న కృషికిగాను ఈ అవార్డ్‌ను ప్రదానంచేస్తోంది. ఇస్రో తరఫున భారత రాయబారి బి.శ్యామ్ ఈ అవార్డ్‌ను అందుకున్నారు. అవార్డ్ ఇచి్చనందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధన్యవాదాలు తెలిపారు. -
Safeena Husain: ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్
పేదరికంలో పుట్టిన దిల్లీకి చెందిన సఫీనా హుసేన్ చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరింది. లండన్‌లో చదువుకున్న సఫీనా అమెరికాలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత మన దేశానికి తిరిగి వచ్చి పేదింటి ఆడపిల్లలు బడి బాట పట్టడానికి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఎన్నో రాష్ట్రాలలో వేలాదిమంది ఆడపిల్లలు చదువుకోగలిగేలా చేసింది. తాజాగా... ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో కృషి చేస్తున్న వారికి ‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్, ఖతర్’ వారు ఇచ్చే ‘వైజ్’ప్రైజ్‌కు ఎంపికైంది. ఈ ప్రైజుకు ఎంపికైన ఫస్ట్ ఇండియన్ సఫీనా హుసేన్ గురించి... ‘అబ్బాయిని స్కూలుకు పంపిస్తున్నారు కదా. మరి అమ్మాయిని ఇంటిపనులకే పరిమితం చేస్తున్నారేమిటి?’ అని అడిగినప్పుడు ఆ ఇంటిపెద్ద నవ్వుతూ ఇచ్చిన సమాధానం.... ‘ఆడపిల్లలకు చదువెందుకు. ఏదో ఒకరోజు పెళ్లి చేయాల్సిందే కదా’ ఇంచుమించు ప్రతి ఇంటి నుంచి ఇలాంటి సమాధానమే వినిపించింది. ‘ఆడపిల్లలకు విద్య’ అనే నినాదం ప్రాధాన్యతకు నోచుకోని ఎన్నో ప్రాంతాలను చూసింది సఫీనా. దీనికి పేదరికం ఒక కారణం అయితే, ఆర్థికస్థాయి బాగున్నా ‘ఆడపిల్లకు చదువెందుకు’ అనే నిర్లిప్తత మరోకారణం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి ఆడపిల్ల బడికి వెళ్లాలనే లక్ష్యంతో ‘ఎ డ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సఫీనా. ‘ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దానితో మమేకం కావాలి’ అంటున్న సఫీనాకు పేదరికం అనేది అపరిచిత సమస్య కాదు. దిల్లీలోని ఒక పేదకుటుంబంలో పుట్టింది. ఎన్నో కష్టాల మధ్య కూడా ‘చదువు’ అనే ఆయుధాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఆ కుటుంబం నుంచి లండన్‌లో చదువుకున్న తొలి వ్యక్తి అయింది. లండన్ నుంచి అమెరికాకు వెళ్లి స్వచ్ఛంద సేవారంగంలో పని చేసిన సఫీనా 2005లో స్వదేశానికి తిరిగి వచ్చింది. ‘చదువుకోవడం వల్ల నేను ఎంతో సాధించాను. దేశదేశాలు తిరిగాను. చదువుకోకపోతే నా పరిస్థితి ఊహకు కూడా అందనంత దయనీయంగా ఉండేది’ అనుకున్న సఫీనా హుసేన్ పేదింటి ఆడపిల్లల చదువు కోసం తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. ప్రభుత్వ సంస్థల నుంచి వివరాలు సేకరించింది. చదువుకు సంబంధించి జెండర్–గ్యాప్ ఉన్న 26 జిల్లాల గురించి తెలుసుకుంది. అందులో తొమ్మిది రాజస్థాన్‌లో ఉన్నాయి. రాజస్థాన్‌లో ఆడపిల్లల చదువుకు దూరంగా ఉన్న ప్రాంతాలను మొదట ఎంపిక చేసుకుంది సఫీనా బృందం. గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకులతో ‘ఆర్మీ ఆఫ్ జెండర్ చాంపియన్స్’ను ఏర్పాటు చేసి ‘దయచేసి మీ అమ్మాయిని స్కూల్‌కు పంపించండి’ అంటూ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ‘ఆడపిల్లలకు చదువు’ అనే అంశంపై గ్రామ సమావేశాలు ఏర్పాటు చేశారు. సఫీనా ఆమె బృందం కృషి వృథా పోలేదు. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది ఆలోచన తీరులో మార్పు వచ్చింది. తమ ఇంటి ఆడపిల్లలను స్కూలుకు పంపించడం ప్రారంభించారు. చాలా బడులలో ఆడపిల్లల కోసం టాయిలెట్ సదుపాయాలు లేవు. అలాంటి బడులలో ప్రత్యేక టాయిలెట్లు నిర్మించేలా చేశారు. బడిలో అకాడమిక్ పాఠాలు మాత్రమే కాకుండా లైఫ్స్కిల్స్కు సంబంధించిన పాఠాలు కూడా చెప్పేవారు. ‘ఆడపిల్లలకు చదువు దూరం కావడం అనేది ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్న అంశం కాదు. అది పితృస్వామిక భావజాలానికి సంబంధించింది. మేము పనిచేసిన కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇంటి ఆడపిల్ల కంటే గొర్రెలు, మేకలను విలువైన ఆస్తిగా భావించడం చూశాం. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకు రావాలనుకున్నాం. అది అంత తేలిక కాదని తెలిసినా రంగంలోకి దిగాం. ప్రభుత్వ సంస్థల నుంచి లోకల్ వాలెంటీర్స్ వరకు కలిసి పనిచేశాం. అయితే మేము నిరాశతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు’ అంటుంది సఫీనా. ‘ఆడపిల్లలకు చదువు అందని ప్రాంతాలు ఏమిటి?’ అనే అంశంపై ఒకప్పుడు ప్రభుత్వ సంస్థల డాటాపైన ఆధారపడిన సఫీనా బృందం ఇప్పుడు డాటా ఎనాలటిక్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. జియో–ట్యాగ్డ్ టార్గెట్ విలేజెస్ నుంచి మొబైల్ ఫోన్స్‌లో డాటా సేకరిస్తున్నారు. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకొని ఉత్తమఫలితాలు సాధించడానికి వారికి ఇది ఉపయోగపడుతుంది. గతాన్ని గట్టిగా గుర్తు పెట్టుకున్న సఫీనా హుసేన్ ఎన్నో రాష్ట్రాలలో ఎంతోమంది పేదింటి అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కోసం ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ ద్వారా కృషి చేస్తోంది. అయినా వెనకడుగు వేయలేదు ‘ఎడ్యుకేట్ గర్ల్స్’తో తొలి అడుగులు వేసినప్పుడు ‘మీలాగే చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు’ అని నిరుత్సాహపరిచారు కొందరు. అయితే అలాంటి మాటలను మేము సీరియస్‌గా తీసుకోలేదు. ‘ఫలితం వచ్చేవరకు మా ప్రయత్నం’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బయటి వాళ్లు చెప్పే మాటల కంటే తమ ఊరి వాళ్లు చెప్పే మాటలకే గ్రామస్థులు ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో స్థానికులతో కలిసి ఆర్మీ ఆఫ్ జెండర్ ఛాంపియన్స్‌ను ప్రారంభించి ఆడపిల్లల విద్యకు సంబంధించి ఇంటింటి ప్రచారం నిర్వహించాం. – సఫీనా హుసేన్, ఫౌండర్, ఎడ్యుకేట్ గర్ల్స్ -
నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది?
కాటలిన్ కారికో, డ్రూ వీస్మాన్ ఈసారి ఫిజియాలజీ, మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను ఈ ఇద్దరు విజేతలకు ఈ అవార్డు లభించింది. వీరి ఆవిష్కరణలు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా, మరింత సమర్థవంతంగా పనిచేసే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధికి గణనీయంగా సహకరించాయి. ఈ విజేతలకు నోబెల్ ప్రైజ్‌తో పాటు ప్రైజ్ మనీగా ఎంత మొత్తంలో నగదు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నోబెల్ బహుమతి విజేతలు ఈ బహుమతితో పాటు అనేక ఇతర కానుకలు అందుకుంటారు. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ బహుమతి కింద వారికి ఊహకందనంత నగదు వారికి లభిస్తుంది. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా వీరికి అత్యంత ఆదరణ లభిస్తుంది. ఈసారి నోబెల్ బహుమతి పొందిన వారందరికీ 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్ అందించారు. డాలర్లలో చూస్తే దాదాపు 9.86 డాలర్లు. భారతీయ రూపాయిలలో చూస్తే 8 కోట్ల రూపాయలకంటే అధికం. నోబెల్ విజేతలకు డబ్బుతో పాటు బంగారు పతకాన్ని, సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు. 2020 సంవత్సరంలో ఈ మొత్తం ఒక కోటి స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2017వ సంవత్సరంలో ఇది 90 లక్షల స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2012లో నోబెల్ విజేతలకు 80 లక్షల స్వీడిష్ క్రోనార్లను అందించారు. దీని ప్రకారం చూస్తే కాలక్రమేణా బహుమతిగా వచ్చే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. 1901లో మొదటిసారి నోబెల్ బహుమతిని అందించినప్పుడు, ఒక్కో కేటగిరీ ప్రైజ్ మనీ 150,782 స్వీడిష్ క్రోనార్‌గా ఉండేది. అంటే ఆ మొత్తాన్ని ప్రస్తుత భారతీయ రూపాయల్లోకి మారిస్తే రూ.11 లక్షలకు పైగానే ఉంటుంది. అంటే తొలిసారి నోబెల్ బహుమతి మొత్తం రూ. 11 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ. 8 కోట్లకు పెరిగింది. ఇది కూడా చదవండి: ప్రపంచ అందగత్తెల వ్యాలీ ఎక్కడుంది? వారి దీర్ఘాయువు సీక్రెట్ ఏమిటి? -
సువర్ణావకాశం.. ఒక ఐడియా రూ.10 లక్షలు - ట్రై చేయండిలా!
ఆధునిక కాలంలో సృజనాత్మకత పెరిగిపోతోంది. కేవలం చదువుకున్న వారు మాత్రమే కాకుండా నిరక్ష్యరాస్యులు కూడా తమదైన రీతిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏవియేషన్ కంపెనీ బోయింగ్ ఇండియా కొత్త ఆలోచనల కోసం ఒక కార్యక్రమం ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బోయింగ్ ఇండియా తన ప్రతిష్టాత్మక బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ కోసం విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఇతర వర్ధమాన వ్యవస్థాపకులను ఆహ్వానించింది. ఇక్కడ వినూత్న ఆలోచలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఉత్తమ 7మందికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల బహుమతి లభిస్తుంది. ఏరోస్పేస్, రక్షణ, టెక్నాలజీ, సామాజిక ప్రభావం వంటి విషయాలపైన ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్డ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆలోచనలను 2023 నవంబర్ 10 వరకు పంపవచ్చు. గత ఏడాది ఇదే ప్రోగ్రామ్ కోసం టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందిన విద్యార్థుల నుంచి 1600 కంటే ఎక్కువ, స్టార్టప్ ఔత్సాహికుల నుంచి 800 కంటే ఎక్కువ ఆలోచనలు వెల్లువెత్తాయి. కాగా ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: 12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి.. ఈ సంవత్సరం బోయింగ్ బిల్డ్ ప్రోగ్రామ్ కోసం ఏడు ప్రసిద్ధ ఇంక్యుబేటర్లతో జతకట్టింది. అవి సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ - ఐఐటీ ముంబై, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ - ఐఐటీ ఢిల్లీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ - ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ - ఐఐఎస్సీ బెంగళూరు, టీ-హబ్ హైదరాబాద్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ - కేఐఐటీ భువనేశ్వర్. -
స్వాతంత్య్ర దినోత్సవం: క్విజ్, ఎస్సే, డ్రాయింగ్ పోటీలు.. విజేతలకు నగదు బహుమతులు
సాక్షి, హైదరాబాద్: భారత్ 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహిస్తుంది.విద్యార్థులు క్విజ్, జనరల్ ఎస్సే, Art/ Drawing లలో పాల్గొనవచ్చును. ☛ క్విజ్ పోటీ : http://special.sakshi.com/independence_day_quiz/ ఈ లింక్ ద్వారా క్విజ్ పోటీలో పాల్గొనాలి. ఈ క్వీజ్‌లో పాల్గొనే అవకాశం.. ఆగస్టు 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ☛ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 'టెక్నాలజీ' ఎలా అభివృద్ధి చెందింది? అనే అంశం పై ఒక జనరల్ ఎస్సేను, అలాగే Independenceకి సంబంధించిన Art/ Drawing ని 9010050984 నెంబర్‌కు వాట్సప్ (లేదా) sakshieduinfo@gmail.comకి పంపండి. ఈ పోటీలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవి పూర్తి ఉచితంగా రాయవచ్చును. మీరు జనరల్ ఎస్సే, Art/ Drawingని పంపాల్సిన చివరి తేదీ ఆగస్టు 15, 2023. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వబడును. అలాగే పోటీలో పాల్గొన్న అందరికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. విజేతల ఫోటోతో పాటు పేరుని కూడా www.sakshieducation.comలో ప్రచురిస్తాము. ఇంకేందుకు ఆలస్యం ఇప్పుడే మీ తెలివికి పదును పెట్టండి.. నగదు బహుమతి పొందండి. ఆల్ ది బెస్ట్.. -
గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి.. కాంగ్రెస్ ఫైర్.. రూ కోటి నిరాకరణ
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ప్రఖ్యాత గీతా ప్రెస్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ మండిపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన హిందుత్వ భావాజాలానికి ముడిపెట్టారు. వినాయక్ దామోదర్ సావర్కర్, గాడ్సే వారసత్వానికి అవార్డు ఇస్తున్నారని ఆరోపించారు. 2015లో గీతా ప్రెస్‌లో రిలీజ్ అయిన, జర్నలిస్టు అక్షయ ముకుల్ రాసిన వివాదాస్పద పుస్తకాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. కాగా.. రాజకీయంగా వివాదం రేగడంతో రూ.కోటి రూపాయల నగదును గీతా ప్రెస్ నిరాకరించింది. The Gandhi Peace Prize for 2021 has been conferred on the Gita Press at Gorakhpur which is celebrating its centenary this year. There is a very fine biography from 2015 of this organisation by Akshaya Mukul in which he unearths the stormy relations it had with the Mahatma and the… pic.twitter.com/PqoOXa90e6 — Jairam Ramesh (@Jairam_Ramesh) June 18, 2023 గీతా ప్రెస్‌కు అవార్డు.. అహింస, ఇతర గాంధేయ మార్గాల్లో సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గాను గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని కేటాయించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సాంస్కృతి శాఖ తెలిపింది. గాంధీ శాంతి బహుమతి విజేతకు రూ.కోటి నగదు, జ్ఞాపిక, సంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్త్రం అందజేస్తారు. I congratulate Gita Press, Gorakhpur on being conferred the Gandhi Peace Prize 2021. They have done commendable work over the last 100 years towards furthering social and cultural transformations among the people. @GitaPress https://t.co/B9DmkE9AvS — Narendra Modi (@narendramodi) June 18, 2023 ఇదీ చదవండి:గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి భారత వారసత్వంపై దాడి.. గీతా ప్రెస్‌కు శాంతి బహుమతి కేటాయింపును కాంగ్రెస్ వ్యతిరేకించడంపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. కర్ణాటకాలో గెలుపు అనంతరం భారత వారసత్వంపై కాంగ్రెస్ బహిరంగంగానే దాడి చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకాలో మత మార్పిడి వ్యతిరేక చట్టాలు తొలగించడం, గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని వ్యతిరేకించడం ఇందుకు నిదర్శనాలని దుయ్యబట్టారు. ప్రజలు ఇందుకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. With the win in Karnataka, Congress has now openly unleashed a war against India's civilisational values and rich legacy, be it in the form of repeal of anti-conversion law or criticism against Geeta Press.people of India will resist this aggression and reassert our… — Himanta Biswa Sarma (@himantabiswa) June 19, 2023 భారతదేశంలో హిందు సనాతన ధర్మానికి చెందిన జ్ఞానాన్ని గీతా ప్రెస్ అందిస్తోంది కాబట్టే కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ముస్లీం లీగ్‌లో లౌకికత్వాన్ని చూడగలిగిన కాంగ్రెస్ పార్టీకి గీతా ప్రెస్‌లో మాత్రం మతపరమైన అంశం కనిపిస్తోందని దుయ్యబట్టారు. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ముస్లీం లీగ్ లౌకిక పార్టీ అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు. ఇదీ చదవండి: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు దెబ్బ మీద దెబ్బ.. వరుసగా వలసలు -
కల్యంపూడి రాధాకృష్ణారావుకు అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ పురస్కారం
వాషింగ్టన్: ప్రఖ్యాత భారత్–అమెరికన్ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102)ను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించింది. స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్’ను 2023 సంవత్సరానికి గాను రాధాకృష్ణారావుకు అందజేయనున్నట్లు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్టాటిస్టిక్స్‌లో 75 ఏళ్ల క్రితం ఆయన చేసిన కృషి సైన్స్‌పై ఇప్పటికీ అమిత ప్రభావం చూపిస్తోందని ప్రశంసించింది. కెనడాలోని ఒట్టావాలో ఈ ఏడాది జూలైలో జరిగే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ బహుమతి కింద 80,000 డాలర్లు అందజేస్తారు. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ను ప్రతి రెండేళ్లకోసారి ప్రదానం చేస్తారు. 2017లో తొలిసారిగా ఈ అవార్డును డేవిర్ ఆర్ కాక్స్ అందుకున్నారు. 2019లో బ్రాడ్జీ ఎఫ్రాన్, 2021లో నాన్ లాయిర్డ్ స్వీకరించారు. ఏపీలో విద్యాభ్యాసం కల్యంపూడి రాధాకృష్ణారావు కర్ణాటకలోని హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో విద్యాభ్యాసం సాగింది. ఆంధ్రా విశ్వావిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో ఎంఎస్సీ చేశారు. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎంఏ డిగ్రీ అందుకున్నారు. ఇంగ్ల్లండ్‌లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో పీహెచ్డీ చేశారు. 1965లో కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి డీఎస్సీ డిగ్రీ స్వీకరించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, తర్వాత కేంబ్రిడ్జిలోని ఆంత్రోపాలాజికల్ మ్యూజియంలో సేవలందించారు. పలు భారత, విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ అందుకున్నారు. -
రీల్స్ చెయ్.. లక్ష పట్టేయ్! గవర్నమెంట్ బంపర్ ఆఫర్..
ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వంటి సోషల్ మీడియాలో రీల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. రీల్స్ చేసి ఆకట్టుకోగల సత్తా ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రీల్స్ చేసి ఆకట్టుకున్న వారికి లక్ష బహుమతి అందివ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అందించిన సమాచారం ప్రకారం.. రీల్స్ చేసే వారి కోసం ఒక ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో గెలిచిన వారికి ఒక లక్ష నగదు బహుమతి లభిస్తుంది. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, నగర ప్రాముఖ్యత గురించి ఆసక్తికరంగా చూపరులను ఆకట్టుకునే విధంగా 60 సెకన్ల నిడివితో ఓ వీడియో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ చేసే వీడియోలో @DigitalMediaTS అని ట్యాగ్ చేయాలి. అంతే కాకుండా ఇలాంటి వీడియోలను dir_dm@telangana.gov.in కి కూడా మెయిల్ చేయవచ్చు. ఏప్రిల్ 30 చివరి నాటికి వీడియోలను పంపాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. మరిన్ని వివరాలు కోసం https://it.telangana.gov.in/contest/ వెబ్సైట్ సందర్శించవచ్చు. గతంలో డబ్ ష్మాష్, టిక్ టాక్ వంటివి మంచి ట్రెండింగ్‌లో నడిచాయి, అయితే ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ వీడియోలో, రీల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. రీల్స్ చేస్తూ కాలం గడిపేవారికి ఇది ఒక సువర్ణావకాశం అనే చెప్పాలి. వీడియోలన్నీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధిని తెలియజేయాలి. Great with Reels? Love Hyderabad? Here's something exciting for you! Capture the charm and vividness of #HappeningHyderabad and share with us by tagging @DigitalMediaTS Win cash prizes worth Rs 1,00,000/- Entries close on April 30. For details visit https://t.co/8J20OoaI9v pic.twitter.com/oaL1KTlI0Y — Telangana Digital Media Wing (@DigitalMediaTS) April 4, 2023 -
లాటరీ తగలడమే శాపమైంది...లవర్‌తో భార్య జంప్
లాటరీ తగిలితే ఎవరికైనా మాటల్లో చెప్పలేనంతా ఆనందంగా ఉంటుంది. అది సహజం. కానీ ఇక్కడొక వ్యక్తికి లాటరీ తగలడమే అత్యంత విషాదంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే శాపంగా మారింది అనే చెప్పాలి. వివరాల్లోకెళ్తే...థాయ్‌లాండ్‌కు చెందిన మణిత్ అనే వ్యక్తి రూ. 1.3 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. దీంతో అతను తెగ ఆనందపడటమే కాకుండా అందులో కొంత భాగాన్ని ఆలయానికి విరాళంగా ఇద్దాం అనుకున్నాడు. మిగిలిన సోమ్మును కుటుంబసభ్యుల కోసం ఉపయోగించాలని ప్లాన్ చక్కగా చేసుకున్నాడు. ఐతే పాపం ఇది అతనికి విషాదాన్ని మిగుల్చుతుందని కల్లో కూడ అనుకుని ఉండడు. ఎదుకంటే? అతడి భార్య అంగ్‌కన్‌రత్ ఆ లాటరీ తీసుకుని తన ప్రియుడుతో జంప్ అయ్యిపోయింది. ఇదంతా తెలియని మణిత్ లాటరీ గెలుచుకున్నాను కదా అని కుటుంబసభ్యులతో గ్రాండ్‌గా పార్టీ చేసుకుంటున్నాడు. ఆ వేడుకలో భార్యతో కనిపించిన ఆ వ్యక్తిని చూసి ఎవరని ప్రశ్నిస్తే తమ బంధవు అని చెప్పింది. దీంతో అతను తన భార్య తరుఫు బంధువుగానే భావించాడే తప్ప ఏ సందేహం రాలేదు మణిత్‌కి. దీంతో అతను ఆనందంగా పార్టీలో మునిగిపోయాడు. ఆ తర్వాత చూస్తే ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో మణిత్ ఒక్కసారిగా షాక్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే మణిత్, అంగన్‌రాత్‌లకు వివాహమై 26 ఏళ్లు అయ్యింది, పైగా ముగ్గురు పిల్లలు కూడా. ఆమె పారిపోతుందనేలా తనపై ఎలాంటి సందేహం తనకు రాలేదని మణిత్ పోలీసులకు చెప్పాడు. ఐతే పోలీసులు వారికి వివాహం అయ్యి అన్నేళ్లు అయినప్పటికీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోకపోవడంతో మణిత్‌కు ఎలాంటి న్యాయం చేయలేమని తేల్చి చెప్పారు. అతను ఆ లాటరీ డబ్బును ఆమెకే గిఫ్ట్‌గా ఇచ్చి దాయమని చెప్పినట్లు పోలీసులకు ఆవేదనగా చెప్పాడు. తాము కేవలం అతడి భార్యను ఒప్పించి డబ్బు ఇప్పించే ప్రయత్నం మాత్రమే చేయగలమని, పైగా ఆ సోమ్ము చట్టబద్ధంగా వారికి చెందదు అని మణిత్‌కి చెప్పారు పోలీసులు. దీంతో అతను భార్యకోసం తీవ్రంగా గాలించడమే కాకుండా చివరకు థాయ్‌లాండ్ మీడియాను సైతం సంప్రదించాడు. (చదవండి: బాటిల్లో 135 ఏళ్ల నాటి లేఖ! అందులో ఏముందంటే.....) -
లాటరీలో ఏకంగా రూ. 248 కోట్లు ...కానీ భార్య, పిల్లలకు చెప్పకుండా..
ఒక వ్యక్తికి ఏకంగా రూ. 248 కోట్లు ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. కానీ ఈ విషయం తన భార్యకు పిల్లలకు చెప్పలేదట. పైగా చెబితే వారుకి ఎక్కడ అహంకారం నెత్తికెక్కి సోమరులుగా మారతారని చెప్పలేదంటున్నాడు. వివరాల్లోకెళ్తే...చైనాలోని ఒక వ్యక్తి లాటరీలో రూ. 248 కోట్ల ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. అతను అక్టోబర్ 24న ఫ్రైజ్‌మనీని కలెక్ట్ చేసుకోవడమే కాకుండా దాదాపు రూ. 5 కోట్లు చారిటీలకు విరాళంగా ఇచ్చాడు. అతను ఈ డబ్బును తీసుకునేటప్పుడూ కూడా కార్టూన్ వేషంలో వచ్చి తీసుకున్నాడు. అత్యంత గోప్యంగా ఉండాలన్న ఉద్దేశంతో అలా చేసినట్లు వివరించాడు. ఆ తర్వాత అధికారులు సదరు వ్యక్తిని గ్వాంగ్సీ జువాంగ్ ప్రాంతానికి లీగా గుర్తించారు. తాను ఇంత పెద్ద మొత్తంలో డబ్బును గెలుచుకున్నట్లుతన భార్యకు, పిల్లలకు కూడా చెప్పలేదన్నాడు. ఇంత మొత్తంలో డబ్బు చూసి అహంకారంతో ఉండటమే గాక పిల్లలు సరిగా చదువుకోవడం మానేస్తారని చెప్పకూడదని నిర్ణయించుకున్నాడట. చైనా చట్టం ప్రకారం సుమారు రూ. 48 కోట్లు పన్నుల రూపంలో వెళ్లిపోగా దాదాపు రూ. 147 కోట్లు ఇంటికి తీసుకువెళ్లనున్నాడు. తాను గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొంటున్నానని, ఈ సారి మ్రాతం ఈ నెంబర్‌కి భారీ మొత్తంలో లాటరీ తగిలిందని లీ ఆనందంగా చెప్పుకొచ్చాడు. (చదవండి: గులాబీ కలర్ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా) -
మార్కెట్లోకి ఐటీసీ కొత్త చాక్లెట్.. ప్రత్యేక టెక్నాలజీతో తయారీ!
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌లో భాగమైన దేశీ లగ్జరీ చాక్లెట్ బ్రాండ్ ఫాబెల్ కొత్తగా ఫైనెస్ పేరిట మరో కొత్త చాక్లెట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రచారం కోసం ప్రముఖ ఆస్ట్రేలియన్ షెఫ్ ఎడ్రియానో జుంబోతో ఫాబెల్ చేతులు కలిపింది. ది కోకో ఫైనెసర్ అనే ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన ఈ చాక్లెట్ కన్నా మృదువైనది తయారు చేసిన వారికి రూ.1 కోటి బహుమతిగా అందిస్తామని ఈ సందర్భంగా ఐటీసీ తరఫున ఫాబెల్ సవాలు కూడా విసిరారు. చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
ప్రధాని పుట్టినరోజు.. రూ.8.5 లక్షలు గెలుచుకునే లక్కీ ఛాన్స్!
అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ యజమాని ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా కస్టమర్లకు థాలి ఆఫర్ ప్రకటించాడు. తన హోటల్లోని థాలి తింటే.. రూ.8.5 లక్షల నగదు గెలుచుకోవచ్చని ప్రధానిపై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు. కాగా సెప్టెంబరు 17 ప్రధాని మోదీ పుట్టిన రోజు. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఆర్డోర్( ARDOR ) 2.1 రెస్టారెంట్లో 56 వంటకాలతో ఓ బాహుబలి థాలిని ఏర్పాటు చేశాడు ఓ రెస్టారెంట్ యజమాని. ఇందులో కస్టమర్లు తమకు నచ్చిన వెజ్ లేదా నాన్ వెజ్ ఐటెమ్‌ను ఆర్డర్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ స్పెషల్ థాలిపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. "ప్రధాని మోదీని నేను చాలా గౌరవిస్తాను, అందుకే ఆయన పుట్టినరోజున ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాను. అందుకే థాలి పోటీ పెట్టినట్లు చెప్పారు. ప్రత్యేకమైన థాలీకి ’56 అంగుళాల మోదీజీ’ అని పేరు పెట్టినట్లు వివరించారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ థాలిని తినే కస్టమర్లకు బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలో దంపతులు కూడా పాల్గొనవచ్చని.. ఆ జంట నుంచి ఎవరైనా ఈ థాలీని 40 నిమిషాల్లో పూర్తి చేస్తే, వారికి 8.5 లక్షల రూపాయల బహుమతిని అందుకోవచ్చని తెలిపారు. అలాగే, సెప్టెంబర్ 17-26 మధ్య రెస్టారెంట్లో ఈ థాలీ తిన్నవారిలో లక్కీ విన్నర్‌ని ఎంపిక చేసి వారికి కేదార్నాథ్ పర్యటన అవకాశం కల్పిస్తామన్నారు. చదవండి: SCO Summit: చైనా అధ్యక్షుడికి దూరం దూరంగా మోదీ.. నో స్మైల్, నో షేక్‌హ్యండ్ -
ఆమె... అగణిత మేధావి
గణితశాస్త్రంలో డెబ్భై యేళ్లుగా ప్రపంచానికి అంతుపట్టకుండా ఉన్న అత్యంత క్లిష్టమైన జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్‌కు పరి ష్కారం సూచించారు 32 ఏళ్ల నీనా గుప్తా. అందుకుగాను ఆమె 2021 డిసెంబర్లో, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్ ప్రైజ్’ పురస్కారానికి ఎంపికయ్యారు. కోల్‌కతాలో జన్మించిన నీనా గుప్తా , బెతున్ కళాశాల నుండి గణిత శాస్త్ర ఆనర్స్‌లో పట్టా తీసుకున్నారు. ఇప్పుడు తాను పాఠాలు బోధిస్తున్న ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐ) సంస్థ నుంచే పీహెచ్డీ తీసుకున్నారు. తన పరిశోధనలకు గాను ఆమె ఇప్పటికే డజను అవార్డులు పొందారు. 40 ఏళ్ల లోపు ఉండే యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన రామానుజన్ అవార్డును ఇటీవలే నీనా గుప్తాకు ఇచ్చారు. అకడమిక్ రంగంలో గౌరవనీయమైన అవార్డును గెలుచుకున్న నాల్గవ భారతీయురాలు ఆమె. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె అఫైన్ ఆల్జీబ్రాక్ జ్యామితిలో, కమ్యుటేటివ్ ఆల్జీబ్రాలో చేసిన అత్యుత్తమ కృషికి, ప్రత్యేకించి అఫైన్ స్పేస్‌ల కోసం జారిస్కీ రద్దు సమస్యపై కనిపెట్టిన పరిష్కారం కోసం ఈ విశిష్ట బహుమతిని అందుకున్నారు. జారిస్కీ రద్దు సమస్యకు ఆమె చూపిన పరిష్కారం తనకు గతంలోనే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ 2014 యంగ్ సైంటిస్ట్స్ అవార్డును సంపాదించి పెట్టింది. 2019లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకున్నారామె. గణితం అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది అని వేద గణితం చెబుతుంది. సంఖ్యామానానికి పట్టుగొమ్మ అయిన సున్నా ఆవిష్కరణే దీనికి నిదర్శనం. ఇది ప్రపంచ గణిత శాస్త్రా నికి భారతీయుల అద్భుత కానుక. గణితం కష్టం కాదు. ఇతర సబ్జెక్టులులాగా దీన్ని కంఠస్థం చేయలేరు. మీకు గణిత భావనపై స్పష్టత ఉంటే, మీరు కూడా క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించగలరు. ప్రాక్టీస్ కీలకం, అది మినహా వేరే మంత్రం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 32 ఏళ్ల నీనా గుప్తా. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. తనకు పదేళ్ల వయసులోనే గణితశాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. పదమూడేళ్లు నిండేసరికల్లా ఎస్.ఎల్. లోనీ... త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను ఆపోశన పట్టడమే కాకుండా సొంతంగా సిద్ధాం తాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ, అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించారు. శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగపడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్–తీటా ఫంక్షన్స్‌పై చేసిన పరిశో ధనలు చాలా ప్రసిద్ధమైనవి. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాసన్ రామానుజన్ పేరు మీద ఉన్న ‘రామానుజన్ అవారు’్డ నీనా గుప్తాకు రావడం పట్ల దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు. డాక్టర్ టి. నాగయ్య వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ మొబైల్ : 97012 75354 (నేడు జాతీయ గణిత దినోత్సవం) -
వైరల్: బంఫర్ ఆఫర్.. 20 నిమిషాల్లో తింటే 20 వేలు మీవే !
ఇటీవల సోషల్‌మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఒక్కోసారి అనుకోకుండా అవి వైరల్‌గా మారి దూసుకుపోతుంటాయ్ కూడా. తాజాగా ఓ రోడ్ సైడ్ పుడ్ స్టాల్ యజమాని ఇలానే భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరాడు. అదేంటంటే.. ఓ రోల్‌ని జస్ట్ 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోవచ్చంటూ అందరినీ ఆకర్షించాడు. సాధారణంగా ఇటువంటి ఫుడ్ ఛాలెంజ్‌లు విదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అందులో తక్కువ సమయంలో ఎక్కువ ఫుడ్ లాగిస్తే సరిపోతుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్ స్టాల్ యజమాని తను తయారు చేసిన 10 కేజీల బాహుబలి కాథీ రోల్‌ను కేవలం 20 నిమిషాల్లో తింటే రూ.20,000 ఇస్తానని పుడ్ లవర్స్‌కి బంఫర్ ప్రకటించాడు. ఇక ఆ రోల్ మేకింగ్ వీడియోని సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ఛాలెంజ్‌కి ఎవరైనా రావచ్చని తెలిపాడు. ఆ రోల్‌ని.. గోధుమపిండితో తయారుచేసి 30 గుడ్లను ఆమ్లెట్‌గా వేయడంతో పాటు అదనంగా అందులో నూడుల్స్, కబాబ్స్, సోయా ఛాప్‌తో నింపేశాడు. చూస్తుంటే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. దీనంతటనీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారి పుడ్ లవర్స్‌ని నోరూరిస్తోంది. ఛాలెంజ్ ఆసక్తిగా ఉన్నా, రోల్ టేస్టీగా ఉన్నా.. ఆ బాహుబలి రోల్‌ని 20 నిమిషాల్లో తినాలంటే ఎంతటి భోజనప్రియులకైనా కొంచెం కష్టమే మరీ. అది కూడా 10 కేజీలు బరువు గల ఆహారం అంటే.. మామూలు విషయం కాదండి. అందుకే ఏమో అంత ధైర్యంగా ఆ ఛాలెంజ్ విసురుతున్నాడు. View this post on Instagram A post shared by THE FOOD CULT - TFC (@the.food_cult) చదవండి: ‘పాల దంతాలు ఊడిపోయాయి సాయం చేయండి’.. ప్రధాని మోదీ, అస్సాం సీఎంకు అక్కాచెల్లెళ్ల లేఖ -
యూకే పోటీలో రూ. 4.9 కోట్లు గెలిచిన హైదరాబాదీ
హైదరాబాద్ : నూతన ఆవిష్కరణలు, సరికొత్త సేవలు అందివ్వడంలో హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. జాతీయంగానే కాదు అంతర్జాతీయ వేదికల మీద సైతం ప్రశంసలు పొందుతున్నాయి. బెస్ట్ అవార్డులకు అర్హత సాధిస్తున్నాయి. కోవిడ్ కాంటెస్ట్ డేటా ఆధారిత కోవిడ్ సేవలకు సంబంధించి యూకేకి చెందిన ట్రినిటీ ఛాలెంజ్ సంస్థ ఇటీవల పోటీలు నిర్వహించగా గచ్చిబౌలిలో ఉన్న స్టాట్విగ్ సంస్థకు చెందిన వ్యాక్సిన్ లెడ్జర్ స్టార్టప్ రూ. 4.9 కోట్ల బహుమతి గెలుచుకుంది. ఫైనల్స్‌కి మొత్తం 16 స్టార్టప్స్ పోటీ పడగా వ్యాక్సిన్ లెడ్జర్ మూడో విజేతగా నిలిచింది. పనితీరు ఇలా టీకా తయారైంది మొదలు అది తీసుకునే వ్యక్తి వరకు వ్యాక్సిన్ వయల్ ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి పరిస్థితిలో ఉందనే విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం వ్యాక్సిన్ లెడ్జర్ ప్రత్యేకత. వ్యాక్సిన్ తయారీ నుంచి ఎయిర్‌పోర్టు, వ్యాక్సిన్ వెహికల్, స్టోరేజీ సెంటర్, రీజనల్ సెంటర్, సబ్‌సెంటర్, అంతిమంగా లబ్ధిదారుడు... ఇలా వ్యాక్సిన్ ప్రయాణించే ప్రతీ చోట అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉంది. ఆ పరిస్థితుల్లో వ్యాక్సిన్ పాడవకుండా ఉందా ? లేదా ? ఇలా అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. బ్లాక్ చైయిన్ టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యాక్సిన్ లెడ్జర్ పని చేస్తుంది. 2 కోట్ల టీకాలు ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా టీకాలను వ్యాక్సిన్ లెడ్జర్ ట్రాక్ చేసింది. ఎక్కడైనా ఉష్ణోగ్రత పెరిగిపోతే వెంటనే అలెర్ట్‌లు అందించింది. దీంతో పాటు చెడిపోయిన వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటిప్పుడు వ్యాక్సిన్ లెడ్జర్ తెలియజేసింది. దీంతో వ్యాక్సిన్ వేస్టేజ్ గణనీయంగా తగ్గిపోయింది. రెండేళ్ల శ్రమ - చక్రవర్తి (స్టాట్విగ్, సీఈవో) బ్లాక్ చైన్ టెక్నాలజీపై 25 సభ్యులతో కూడి మా టీం రెండేళ్ల పాటు శ్రమించింది. యూనిసెఫ్ ఆర్థిక సహకారం అందించింది. మా వ్యాక్సిన్ లెడ్జర్ డేటా ఎనాలసిస్‌లో... టీకా తయారీ నుంచి లబ్ధిదారుడికి చేరేలోపు ప్రతీ 10 టీకాలలో 3 టీకాలు వృధా అవుతున్నట్టు తేలింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో ప్రతీ టీకా ఎంతో కీలకమైన దశలో... మా వ్యాక్సిన్ లెడ్జర్ని అందుబాటులోకి రావడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. చదవండి : ప్రపంచంలో శక్తివంతమైన మైక్రోచిప్ అభివృద్ధి చేసిన టెస్లా -
స్కూలు టీచర్‌కు భారీ బహుమతి.. ఎందుకంటే?
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని పరితేవాడి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్‌సిన్హ్ డిసేల్ (32) చరిత్ర సృష్టించారు. భారతదేశంలో క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ విప్లవానికి పునాదివేయడంతోపాటు, బాలికా విద్య ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఒక మిలియన్ డాలర్ల వార్షిక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 కు విజేతగా ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 10మంది ఫైనలిస్టులతో పోటీపడి మరీ డిసేల్ ఈ ఘనతను సాదించారు. అంతేకాదు తన ప్రైజ్ మనీని తోటిపోటీదారులతో కలిసి పంచుకుంటానని ప్రకటించి విశేషంగా నిలిచారు. వృత్తిపరంగా వారు చేసిన అసాధారణమైన కృషికి మద్దతుగా తన బహుమతిలో 50 శాతం నగదును టాప్-10 ఫైనలిస్టులతో పంచుకుంటానని ఆయన ప్రకటించారు. అంటే మిగతా తొమ్మిదిమంది ఫైనలిస్టులు ఒక్కొక్కరూ 55 వేల డాలర్లు చొప్పున అందుకుంటారు. బహుమతి డబ్బును పంచుకున్న మొదటి విజేతగా చరిత్ర సృష్టించారని ప్రముఖ దాత, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ అన్నారు. తద్వారా పంచుకోవడం, ఇవ్వడంలోని ప్రాముఖ్యతను ప్రపంచానికి బోధించారని ప్రశంసించారు. రంజిత్‌లాంటి ఉపాధ్యాయులు క్లైమేట్ చేంజ్‌ను నిలువరించడంతో పాటు, శాంతియుతమైన, ధర్మబద్ధమైన సమాజాలను నిర్మిస్తారని, అసమానతలను తొలగించి ఆర్థికవృద్ధితో ముందుకు నడిపిస్తారని యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) సహాయ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియాన్నిని కొనియాడారు. తద్వారా మన భవిష్యత్తును కాపాడుతారని పేర్కొన్నారు. మరోవైపు కరోనా మహమ్మారి విద్యను, విద్యార్థులను బాగా ప్రభావితం చేసింది. కానీ ఈ కష్ట సమయంలో ప్రతి విద్యార్థి వారి జన్మహక్కు అయిన నాణ్యమైన విద్యను పొందేలా తమ వంతు కృషి చేస్తున్నారని డిసేల్ అన్నారు. డిసేల్ కృషి 2009 లో సోలాపూర్‌లోని పరితేవాడిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిసెల్ వచ్చినప్పుడు అదొక శిధిలమైన భవనం. స్టోర్ రూంగా, పశువుల కొట్టంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేది. ఈ పరిస్థితిని ఛాలెంజింగ్‌గా తీసుకున్న డిసెల్ పాఠశాల సంస్కరణకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు బాలికలను పాఠశాలకు రప్పించాలని ధ్యేయంగా పెట్టుకన్నారు. అలాగే గ్రామంలో బాల్య వివాహాలను అడ్డుకోవడంపై దృష్టి పెట్టారు. ఆయన కృషి ఫలితంగా 100శాతం బాలికలు హాజరుకావడం మాత్రమే కాదు, గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా నిలువరించగలిగిన ఘనతను దక్కించుకున్నారు. విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటం, తరగతి పాఠ్యపుస్తకాలను విద్యార్థుల మాతృభాషలోకి అనువదించడమే కాకుండా, ఆడియో పాఠాలను అందించేందుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్లను తీసుకొచ్చారు. వీటితోపాటు వీడియో ఉపన్యాసాలు, కథలు, ఎసైన్‌మెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేశారు. దీంతో మహారాష్ట్రలో క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టిన తొలి పాఠశాలగా డిసేల్ ఆధ్వర్యంలోని స్కూలు నిలిచింది. డిసేల్ ప్రతిపాదిత పైలట్ పథకం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెడతామని రాష్ట్ర మంత్రిత్వ శాఖ 2017 లో ప్రకటించింది. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టి) పాఠ్యపుస్తకాలు క్యూఆర్ కోడ్‌తో రూపొందించాలని 2018లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచ దేశాల యువకుల మధ్య శాంతిని పెంపొందించేందుకుకూడా డిసేల్ విశేష కృషి చేశారు."లెట్స్ క్రాస్ ది బోర్డర్స్" ప్రాజెక్ట్ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భారతదేశం, పాకిస్తాన్, పాలస్తీనా ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్, యుఎస్ , ఉత్తర కొరియాకు చెందిన అనేకమంది యువకులను భాగస్వామ్యం చేశారు. ఇప్పటివరకు, ఎనిమిది దేశాల 19,000 మంది విద్యార్థులనుఇందులో చేరడం విశేషం. అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ ద్వారా వీకెండ్స్‌లో విద్యార్థులను వర్చువల్ ఫీల్డ్ ట్రిప్స్‌కు తీసుకెళతారు. మరీ ముఖ్యంగా తన ఇంటిలో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ ప్రయోగాలతో విద్యార్థులను ఆకట్టుకుంటూ మరింత పాపులర్ అయ్యారు. కాగా 2014 లో వర్కీ ఫౌండేషన్ ఏర్పాటైంది. ఉపాధ్యాయు వృత్తిలో విశేష కృషి చేసిన అసాధారణమైన టీచర్లను గౌరవిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక బహుమతిని ప్రకటిస్తుంది. 140 కి పైగా దేశాల నుండి 12వేల మందికి పైగా దరఖాస్తు చేయగా తుది విజేతగా డిసేల్ ఎంపికయ్యారు. నైజీరియాకు చెందిన ఒలాసుంకన్మి ఒపీఫా, యూకేకు చెందిన జామీ ఫ్రాస్ట్, ఇటలీ నుండి కార్లో మజ్జోన్, దక్షిణాఫ్రికా నుండి మోఖుడు సింథియా మచాబా, అమెరికాకుచెందిన లేహ్ జుయెల్కే, యున్ జియాంగ్, దక్షిణ కొరియాకు చెందిన హ్యూన్, మలేషియాకు చెందిన శామ్యూల్ యెషయా, వియత్నాం నుండి హన్హ్ ఫాంగ్ , బ్రెజిల్ నుండి డోని ఇమాన్యులా బెర్టాన్ టాప్ 10లో నిలిచారు. గ్లోబల్ టీచర్ ప్రైజ్ మనీని 10 సంవత్సరాలలో సమాన వాయిదాలలో చెల్లిస్తుంది -
సాక్షి సెలబ్రేషన్ ఆఫర్
-
భారత సంతతి వ్యక్తికి ఐన్‌స్టీన్ ప్రైజ్
చికాగో: భౌతికశాస్త్రంలో అత్యున్నత సేవలందించిన వారికి ప్రోత్సాహకంగా అమెరికన్ ఫిజికల్ సొసైటీ (ఏపీఎస్) అందజేస్తున్న ప్రతిష్టాత్మక ‘ఐన్‌స్టీన్ ప్రైజ్’కు ఈ ఏడాది భారత సంతతి వ్యక్తి ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్ ఎంపికయ్యారు. అక్టోబర్ 23న జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో అభయ్ ఐన్‌స్టీన్ ప్రైజ్–2018తోపాటు పదివేల డాలర్లను నగదు ప్రోత్సాహకాన్ని అందుకుంటారు. అభయ్ ప్రస్తుతం ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తుండడంతోపాటు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ అండ్ ది కాస్మోస్‌కి డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అభయ్ మాట్లాడుతూ... ‘ఈ అవార్డు గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఏపీఎస్ అందించే పురస్కారాల్లో ఇదే అత్యంత గౌరవమైంది. భారత్‌లో విద్యనభ్యసిస్తున్నప్పటి నుంచి నాకు భౌతికశాస్త్రంపై ఎంతో ఆసక్తి ఉండేది. మొదట్లో నాకు కేవలం ఒక మరాఠీ మాత్రమే తెలిసేది. పదకొండో తరగతి వరకు మరాఠీ మీడియంలో చదువుకున్నాను. హిందీ, ఇంగ్లిష్ భాషలపై పట్టుసాధించిన తర్వాత సంస్కృతిపై భాష ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాను. కాలేజీ రోజుల్లో నేర్చుకున్న భౌతికశాస్త్రం ప్రకృతిని అర్థం చేసుకోడానికి ఎంతగానో ఉపయోగపడింద’న్నారు. 1974లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన అభయ్... లూప్ క్వాంటమ్ గ్రావిటీ ప్రోగ్రామ్‌పై అనేక పరిశోధనలు చేశారు. -
వింబుల్డన్ ప్రైజ్‌మనీ పెంపు
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రైజ్‌మనీని పెంచారు. ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 22 లక్షల పౌండ్ల చొప్పున (రూ. 18 కోట్ల 23 లక్షల 42 వేలు) అందజేస్తారు. గతేడాది సింగిల్స్ చాంపియన్స్‌కు 20 లక్షల పౌండ్లు చొప్పున ఇచ్చారు. క్రితం ఏడాదితో పోలిస్తే ఈసారి విజేతలకు 2 లక్షల పౌండ్లు పెంచినట్లు బుధవారం ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. తొలి రౌండ్లో ఓడిన వారికి 35 వేల పౌండ్లు (రూ. 29 లక్షలు) లభిస్తాయి. గత ఆరు సంవత్సరాల్లో సింగిల్స్ విజేత ప్రైజ్‌మనీ రెట్టింపు కావడం గమనార్హం. 2011లో 1.1మిలియన్ పౌండ్లుగా ఉంది. కాగా ఈ ఏడాది టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 12.5 శాతం పెరిగి 31.6మిలియన్ పౌండ్లకు చేరుకుంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది. మరోవైపు మహిళా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ గర్భస్థ శిశువుపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన రొమేనియా జట్టు కోచ్ ఇలీ నస్టాసేను ఈసారి రాయల్ బాక్స్‌లోకి ఆహ్వానించడంలేదని నిర్వాహకులు ప్రకటించారు. -
లక్కీ డ్రా నిర్వాహకులు అరెస్టు
- లక్కీ డ్రా పేరుతో రూ. 1300 ప్రకారం వసూలు - 3500 మంది నుంచి రూ. 45.50 లక్షలు - అదుపులోకి తీసుకున్న పోలీసులు మంత్రాలయం రూరల్: ‘రూ. 1300 చెల్లించి టికెట్ కొనుక్కోండి... తగిలితే మంచి బహుమతి వస్తుంది.. లేకపోయినా ఆ విలువకు తగ్గట్టు ఏదో ఒక వస్తువు అందిస్తాం’ అంటూ కొందరు.. జనానికి ఆశ చూపించి లక్కి డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. ఇలా 3500 మంది నుంచి 45.50 లక్షలు వసూలు చేశారు. ఒప్పందం ప్రకారం ఈ నెల 9వతేదీన కోసిగి చౌడేశ్వరి దేవాలయం వద్ద డిప్పు వేయాల్సి ఉండగా ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. చివరకు వారిపై అనుమానం పెరగడంతో కోసిగికి చెందిన కొందరు నిలదీయగా మంత్రాలయం వైష్ణవి పాఠశాల వద్ద ఆదివారం డిప్పు తీస్తుండగా మంత్రాలయం ఎస్ఐ శ్రీనివాసనాయక్ అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగేశ్వరరావు ఎస్ఐలు రాజారెడ్డి, శ్రీనివాసనాయక్, భానుమూర్తి , స్పెషల్ పార్టీ సిబ్బందితో వైష్ణవి స్కూల్ దగ్గరకు చేరుకుని లక్కీ డ్రా నిర్వాహకులైన మంత్రాలయం మండలం సూగూరుకు చెందిన జె.చంద్రశేఖర్, కోసిగికి చెందిన ఎస్.రత్నయ్య, పి.రాఘవేంద్ర, సుభాన్సాహెచ్ను అరెస్టు చేశారు. అయితే వారిని అరెస్టు చేస్తే తాము చెల్లించిన డబ్బు ఎలా అంటూ జనం అక్కడకు దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అనుమతి లేకుండా లక్కీడ్రా నిర్వహిస్తున్న వారిపై చీటింగ్ కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. అనుమతి తీసుకున్నట్లు చెప్పారు: లక్ష్మన్న, పెద్దకడబూరు మూడు నెలల క్రితం మా ఊరికి వచ్చి లక్కి డ్రా గురించి చెప్పారు. అనుమతులు కూడా తీసుకున్నట్లు చెప్పడంతో రూ. 1300 ప్రకారం చెల్లించి టికెట్లు కొనుగోలు చేశాం. డిప్పు కోసం ఇప్పటికే రెండు సార్లు ప్రదేశాలను మార్చారు. ఆదివారం మంత్రాలయంలో డ్రా తీస్తున్నట్లు తెలియడంతో ఇక్కడి వచ్చాం. చివరికి ఇదంతా మోసమని తెలిసింది. మాకు న్యాయం చేయాలి: కమ్మరి వీరేష్, మాధవరం ఏవో మాయ మాటలు చెప్పడంతో టికెట్ కొనుక్కొని రూ. 1300 చెల్లించాం. ఇప్పుడు మోసమని తెలిసింది కనుక ఆర్గనైజర్ల దగ్గరి నుంచి మాకు డబ్బులు ఇప్పించాలి. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీ పెంపు
సింగిల్స్ విజేతలకు రూ. 18 కోట్ల 24 లక్షలు తొలి రౌండ్లో ఓడినవారికి రూ. 24 లక్షలు మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్‌మనీని గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14 శాతం పెంచారు. ఈ సంవత్సరం 5 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 246 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్నట్లు టోర్నీ డైరెక్టర్ క్రెయిగ్ టిలే తెలిపారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 37 లక్షల (రూ. 18 కోట్ల 24 లక్షలు) డాలర్ల చొప్పున అందజేస్తారు. తొలి రౌండ్లో ఓడినవారికి 50 వేల డాలర్లు (రూ. 24 లక్షల 65 వేలు) ఇవ్వనున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 16 నుంచి 29 వరకు మెల్బోర్న్లో జరుగుతుంది. -
టెన్నిస్‌లో ఆశ్రిత ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్ : ఢిల్లీలోని ఆర్.కె.కన్నా టెన్నిస్ స్టేడియంలో సెప్టెంబర్ 26 నుంచి 30వ తేది వరకు జరిగిన జాతీయ కేంద్రీయ విద్యాలయాల టెన్నిస్ టోర్నమెంట్లో ఏటుకూరు గ్రామానికి చెందిన లేళ్ల ఆశ్రిత ప్రతిభ కనబర్చి టీం ఈవెంట్లో రన్నరప్ టైటిల్‌ను, సింగిల్స్‌లో తృతీయ స్థానాన్ని సాధించింది. ఆగస్టులో హైదరాబాద్‌లో జరిగిన కె.వి.ఎస్ రీజనల్ స్పోర్ట్స్ మీట్లో టెన్నిస్ విభాగంలో ఆశ్రిత బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. తల్లిదండ్రులు మధు, సుధాకర్ ప్రోత్సహంతో స్థానిక ఎన్టీఆర్ టెన్నిస్ కోచ్ శివప్రసాద్ వద్ద టెన్నిస్ శిక్షణకు శ్రీకారం చుట్టిన ఆమె అంచలంచెలుగా జాతీయ స్థాయికి ఎదిగింది. ఆశ్రిత ప్రస్తుతం నల్లపాడులోని కేంద్రీయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. 2015 ఢిల్లీలో జరిగిన జాతీయ కేంద్రీయ విద్యాలయాల టెన్నిస్ పోటీలలో టీం ఈవెంట్లో రన్నరప్ టైటిల్ సాధించింది. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించిన ఐటా టెన్నిస్ టోర్నమెంట్లలో అండర్–14 బాలికల విభాగంలో పలు టైటిల్స్ సాధించింది. ఆట తీరును మెరుగుపర్చుకోనేందుకు ప్రతిరోజు 4 గంటలు టెన్నిస్‌లో శిక్షణ పొందుతూ ఆటలోని మెలుకవలు నేర్చుకుంటోంది. జాతీయ స్థాయి రన్నరప్ టైటిల్ సాధించిన ఆశ్రితను బుధవారం ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, జిల్లా టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి కె.చారి తదితరులు అభినందించారు.