కాటలిన్ కారికో, డ్రూ వీస్‌మాన్ ఈసారి ఫిజియాలజీ, మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను ఈ ఇద్దరు విజేతలకు ఈ అవార్డు లభించింది. వీరి ఆవిష్కరణలు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా, మరింత సమర్థవంతంగా పనిచేసే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ అభివృద్ధికి గణనీయంగా సహకరించాయి. ఈ విజేతలకు నోబెల్ ప్రైజ్‌తో పాటు ప్రైజ్ మనీగా ఎంత మొత్తంలో నగదు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నోబెల్ బహుమతి విజేతలు ఈ బహుమతితో పాటు అనేక ఇతర కానుకలు అందుకుంటారు. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ బహుమతి కింద వారికి ఊహకందనంత నగదు వారికి లభిస్తుంది. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా వీరికి అత్యంత ఆదరణ లభిస్తుంది. ఈసారి నోబెల్ బహుమతి పొందిన వారందరికీ 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్ అందించారు. డాలర్లలో చూస్తే దాదాపు 9.86 డాలర్లు. భారతీయ రూపాయిలలో చూస్తే 8 కోట్ల రూపాయలకంటే అధికం. నోబెల్ విజేతలకు డబ్బుతో పాటు బంగారు పతకాన్ని, సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు.
2020 సంవత్సరంలో ఈ మొత్తం ఒక కోటి స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2017వ సంవత్సరంలో ఇది 90 లక్షల స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2012లో నోబెల్ విజేతలకు 80 లక్షల స్వీడిష్ క్రోనార్లను అందించారు. దీని ప్రకారం చూస్తే కాలక్రమేణా బహుమతిగా వచ్చే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. 1901లో మొదటిసారి నోబెల్ బహుమతిని అందించినప్పుడు, ఒక్కో కేటగిరీ ప్రైజ్ మనీ 150,782 స్వీడిష్ క్రోనార్‌గా ఉండేది. అంటే ఆ మొత్తాన్ని ప్రస్తుత భారతీయ రూపాయల్లోకి మారిస్తే రూ.11 లక్షలకు పైగానే ఉంటుంది. అంటే తొలిసారి నోబెల్ బహుమతి మొత్తం రూ. 11 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ. 8 కోట్లకు పెరిగింది.
ఇది కూడా చదవండి: ప్రపంచ అందగత్తెల వ్యాలీ ఎక్కడుంది? వారి దీర్ఘాయువు సీక్రెట్ ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment