'లంగ్స్‌ ఆఫ్‌ చత్తీస్‌గఢ్‌'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్‌.. | Alok Shukla Wins Prestigious Goldman Environmental Prize | Sakshi
Sakshi News home page

'లంగ్స్‌ ఆఫ్‌ చత్తీస్‌గఢ్‌'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్‌..

Published Sun, Jun 2 2024 11:03 AM | Last Updated on Sun, Jun 2 2024 11:03 AM

Alok Shukla Wins Prestigious Goldman Environmental Prize

సినిమాల్లోనూ చూస్తుంటాం హీరోనే మొత్తం ప్రత్యర్థులను గడగడలాడించి యోధుడులా గెలవడం. రియల్‌ లైఫ్‌లో అంత ఈజీ కాదు. కానీ అటాంటి రియల్‌ హీరోని చత్తీశ్‌గఢ్‌లో చూడొచ్చు. ఒకేఒక్కడు యోధుడిలా లంగ్స్‌ ఆప్‌ చత్తీస్‌గఢ్‌గా పేరుగాంచిన హస్డియో అడువులను సంరక్షించారు. ఇవి భారతదేశంలోని అతిపెద్ద అటవీ సంపద. ఆయన ఒక్కడే అక్కడ ఉన్న గిరిజనులు ప్రజలను చైత్యన్యవంతం చేసి అక్కడ పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చేశాడు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి ఇక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా వెనుదిరిగేలా చేశాడు. అందుకుగాను అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు కూడా. ఎవరా వ్యక్తి అంటే..?

'లంగ్స్‌ ఆఫ్‌ చత్తీస్‌గఢ్‌'గా పేరుగాంచిన హిస్టియో అడువులు భారతదేశంలోని అతిపెద్ద​ అటవీ ప్రాంతంలో ఒకటి. దాదాపు 657 చదరుపు విస్తీర్ణంలో దట్టమైన జీవవైవిధ్యమైన హస్టియో అడువులు భారతదేశంలోని అత్యంత విస్తృతమైన అటవీ ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ సుమారు 25 రకాల అంతరించిపోతున్న జాతులు, 92 పక్షి జాతులు, 167 అరుదైన ఔషధ వృక్ష జాతులకు నిలయం ఈ అడవులు. దాదాపు 15 వేల మంది గిరిజనులు జీవనోపాధి ఈ హస్టియో అరణ్య అడవులపైనే ఆధారపడి ఉంది.

అంతేగాక ఈ ప్రాంతం భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు నిల్వల్లో ఒకటి. ఈ హస్టియో అడవులు కింద దాదాపు ఐదు బిలియన్‌ టన్నుల బొగ్గు ఉన్నట్లు అంచనా. దీంతో 2010లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ హస్టియో అడవులలో ఉన్న గొప్ప జీవవైవిధ్యాన్ని గుర్తించి మైనింగ్‌ కోసం నోగో జోన్‌గా ప్రకటించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ ప్రదేశంలో మైనింగ్‌ కార్యకలాపాలు సాగించేందుకు ముమ్మరంగా   ప్రయత్నించాయి. అంతేగాదు సుమారు 21 ప్రతిపాదిత బొగ్గు గనులను వేలం వేసే యత్నం చేసింది. దీంతో అటవీ, గిరిజన హక్కుల కార్యకర్త అలోక్ శుక్లా(43) స్ధానిక గిరిజన సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి..బొగ్గు వేలాన్ని వ్యతిరేకించేలా చేశాడు. 

అంతేగాదు బొగ్గు గనులను రక్షించేందుకు గ్రామ శాసనమండలి చేత 2020లో 9.45 లక్షల ఎకరాల్లో లెమ్రు ఏనుగుల రిజ్వరాయర్‌ సంబంధించిన ఏనుగులు కారిడార్‌ని నియమించేలా పోత్సహించాడు. చత్తీస్‌గఢ్‌ బచావో వంటి హ్యాష్‌ ట్యాగ్‌ నినాదాలతో డిజిటల్‌, సోషల్‌ మీడియాల్లో ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యిపోయాడు అలోక్‌. మోటారు సైకిల్‌పై ర్యాలీ దగ్గర నుంచి, వివాహ పత్రికల్లో సైతం అదే నినాదంతో కూడిన హ్యాష్‌ ట్యాగ్‌లు ఒక్కసారిగా పంచదృష్టిని ఆకర్షించాయి. గ్రామస్తుల చేత చెట్లు నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని కౌగలించుకుని కాపాడుకునేలా చైతన్యం తీసుకొచ్చాడు. 

దీంతో జూలై 2022లో రాష్ట్ర శాసనసభ మొత్తం హస్టియో అరణ్య ప్రాంతంలోని మైనింగ్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అమోదించింది. ఆ తర్వాత అదే ఏడాది జూలై 21 నాటి 21 బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వ రద్దు చేసింది. ఇలా అలోక్‌ శుక్లా తన ప్రణాళికబద్ధమైన అలుపెరగని కృషితో 21 మైనింగ్‌ గనుల తవ్వకాలు జరపకుండా నాలుగున్నర ఎకరాల అడువులను విజయవంతంగా రక్షించాడు. అందుకుగానూ ప్రతిష్టాత్మక గోల్డ్‌మ్యాన్‌ పర్వావరణ బహిమని అందుకున్నాడు. దీన్ని గ్రీన్‌ నోబెల్‌ అని కూడా పిలుస్తారు. ఈ బహుమతి, ఆఫ్రికా, ఆసియా, యూరప్, ద్వీపాలు, ఉత్తర అమెరికా, దక్షిణ మధ్య అమెరికా వంటి ప్రపంచంలోని దాదాపు ఆరు ఖండాంతర ప్రాంతాల్లోని పర్యావరణ నాయకుల చేసిన కృషిగానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవిస్తారు. కాగా, ఈ గోల్డ్‌మ్యాన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రైజ్‌ను శాన్‌ఫ్రావిన్సిస్కో పౌర నాయకులు రిచర్డ్‌, రోడా గోల్డ్‌మన్‌లు ఏర్పాటు చేశారు. 

(చదవండి: ఫిడే చెస్‌ రేటింగ్‌ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్‌ జియానా గర్గ్‌..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement