దుబాయ్: టెస్టుల్లో నంబర్‌వన్ జట్టుకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఐసీసీ రెట్టింపు చేసింది. గతంలో ఉన్న రూ.3.25 కోట్ల నుంచి రూ.6.5 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అలాగే మహిళల క్రికెట్‌కు కూడా పెద్ద మొత్తంలో డబ్బును వెచ్చించనుంది. 2017లో ఇంగ్లండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ ప్రైజ్‌మనీ రూ.6.5 కోట్లకు పెంచింది. మహిళల వన్డేల్లోనూ నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌ను బంగ్లాదేశ్‌లో నిర్వహిస్తామని ఐసీసీ తెలిపింది.
2015 వరల్డ్‌కప్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 95.2 శాతం సరైన నిర్ణయాలు ఇచ్చిన అంపైర్లను ఈ సందర్భంగా ప్రశంసించింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐసీసీ డెరైక్టర్ గైల్స్ క్లార్క్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్‌సన్‌లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికారులతో సమావేశంకానున్నారు.
రెండింటిలో శ్రీనివాసన్ పేరే: ఐసీసీ సమావేశానికి చైర్మన్ హోదాలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ హాజరయ్యారు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు శశాంక్ మనోహార్ ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో భారత్ తరఫున కూడా శ్రీనినే ప్రాతినిధ్యం వహించారు. సమావేశానికి హాజరైన వారి జాబితా లో చైర్మన్, ప్రతినిధి స్థానంలో శ్రీనివాసన్ పేరే ఉం దని ఐసీసీ వెల్లడించింది. మరోవైపు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఈ సమావేశానికి హాజరైనా... భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ గురించి ఎక్కడా మాట్లాడలేదు.
టాప్ టెస్టు జట్టుకు రూ. 6.5 కోట్లు
Published Wed, Oct 14 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM
Advertisement
Advertisement