Viral Video: ఫ్యాన్స్‌ గుర్తుపట్టడంతో భయపడి పరిగెత్తిన స్టార్ హీరో.. | Shahrukh Khan Runs Towards His Car After Fans Recognize Him | Sakshi
Sakshi News home page

Shahrukh Khan: గుర్తుపట్టిన ఫ్యాన్స్‌.. పరిగెత్తిన స్టార్‌ హీరో.. వీడియో వైరల్

Published Sun, Jul 24 2022 9:12 PM | Last Updated on Sun, Jul 24 2022 9:33 PM

Shahrukh Khan Runs Towards His Car After Fans Recognize Him - Sakshi

తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఫ్యాన్స్ ఎలా ప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెల్ఫీలు అంటూ మీద పడతారు. ఇబ్బందులకు గురిచేస్తారు. ఒక్కొక్కసారి వారి అభిమానం చూసి భయపడిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇలా తాజాగా తన ఫ్యాన్స్‌ను చూసిన బాలీవుడ్ బాద్‌షా భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నాడు. 

బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారుక్ ఖాన్‌కు వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వచ్చి చాలాకాలమే అయింది. ఈ క్రమంలో లాంగ్ గ్యాప్‌ తీసుకున్న షారుక్‌ ఖాన్‌ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే 'పఠాన్' మూవీ కంప్లీట్‌ చేసిన బాద్‌షా 'డుంకీ' చిత్రీకరణలో పాల్గొన్నాడు. రాజ్‌ కుమార్‌ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌ స్పాట్‌లో ఆయన్ను గుర్తుపట్టిన ఫ్యాన్స్‌ సెల్ఫీల కోసం షారుక్‌ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది గమనించిన షారుక్‌ ఖాన్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నాడు. 

చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్‌..
నూలుపోగు లేకుండా రణ్‌వీర్‌ సింగ్‌.. మానసిక రోగి అంటూ బ్యానర్లు


ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఉంది షారుక్‌ ఖాన్‌ పొట్టిగా కనపించడంతో అతను కాదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో షారుక్‌కు సరసన తాప్సీ నటిస్తోంది. అలాగే షారుక్ 'పఠాన్‌' సినిమా 2023 జనవరిలో విడుదల కానుంది.   

చదవండి: కేటీఆర్‌ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి..
శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్‌.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement