
ఉద్యోగులకు క్లాస్ తీసుకున్న చంద్రబాబు
విజయవాడ : పీఆర్సీ అడిగేందుకు వెళ్లిన ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ఉద్యోగులు ఎవరూ పని చేయటం లేదని, తాను ఆశించినంత ఫలితాలు రావటం లేదని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఉద్యోగులు బాగా పని చేస్తేనే ఆదాయం పెరుగుతుందని, ఆదాయం పెరిగితేనే పీఆర్సీ ఆటోమేటిక్గా వస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా ఉద్యోగులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముందు మీరంతా కష్టపడి పనిచేయాలని సూచించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సచివాలయంలో సమావేశం అయ్యారు.
అప్పుడు కూడా చంద్రబాబు పీఆర్సీ పెంపు ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో తమకు కూడా పీఆర్సీ పెంచే అంశాన్ని చర్చించేందుకు వెళ్లిన ఉద్యోగులకు సీఎం వద్ద నుంచి ఊహించని షాక్ ఎదురైంది.