ChatGPT false: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరమైనది కూడా. టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. చాట్‌జీపీటీ (ChatGPT) చెప్పింది కదా అని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడో ప్రొఫెసర్.
రెడ్డిట్ థ్రెడ్ ప్రకారం.. టెక్సాస్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్.. విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాశారని అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధనం తప్పుగా చెప్పడంతో క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడు.
ఇదీ చదవండి: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్!
విద్యార్థులు వ్యాసాలు సొంతంగా రాస్తున్నారా లేదా అని పరిశీలించడానికి ఆ ప్రొఫెసర్ చాట్‌జీపీటీ సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ అనేది ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్‌బాట్. ఇది వచనాన్ని రూపొందించగలదు. భాషలను అనువదించగలదు. వివిధ రకాల సృజనాత్మక కంటెంట్‌ను రాయగలదు. మీ ప్రశ్నలకు సమాచార రూపంలో సమాధానం ఇవ్వగలదు.
తమ ఫైనల్ ఎగ్జామ్స్‌లో భాగంగా విద్యార్థులు తాము రాసిన వ్యాసాలను సమర్పించారు. వారి ప్రొఫెసర్ ఆ వ్యాసాలను స్కాన్ చేయడానికి చాట్‌జీపీటీని ఉపయోగించారు. అయితే విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాసినవని చాట్‌జీపీటీ సూచించింది. దీంతో విద్యార్థులు వ్యాసాలను సొంతంగా రాయలేదని భావించిన ప్రొఫెసర్ క్లాస్‌లోని విద్యార్థులందరినీ ఫెయిల్ చేశాడు.
అయితే, చాట్‌జీపీటీ చెప్పింది తప్పు అని తేలింది. వ్యాసాలను విద్యార్థులే స్వయంగా రాశారని, కంప్యూటర్లను ఉపయోగించ లేదని స్పష్టమైంది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు.
ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో..
Comments
Please login to add a commentAdd a comment