fails
-
రూపాయి కూడా ఉంచలే.. మీకో దండం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశతో చోరీకి వస్తే ఏమీ దొరక్కపోవడంతో ఓ చోరుడు తెగ ఫీలయ్యాడు! ‘ఎంత వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా లేదు... మీకో దండం’ అంటూ యజమానులను ఉద్దేశించి అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ హావభావాలు ప్రదర్శించాడు. చివరకు ఓ వాటర్ బాటిల్ చోరీ చేసి తిరిగి వెళదామనుకున్నప్పటికీ వెనక్కు వచ్చి టేబుల్‌పై రూ. 20 నోటు పెట్టి మరీ వెళ్లాడు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వినాయక మెస్‌లో గత బుధవారం జరిగిన ఈ విచిత్ర చోరీ యత్నం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి నష్టం లేకపోవడంతో మెస్ నిర్వాహ కులు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ ఇందుకు సంబంధించిన సీసీటీవీ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సన్నివేశం ప్రపంచాన్ని చుట్టేసింది.మండల కేంద్రం కావడంతో..మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మెస్ కావడంతో క్యాష్ కౌంటర్లో దండిగా కాసులు ఉంటాయనుకున్న దొంగ.. తలకు టోపీ, ముఖానికి టవల్‌తో ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. తొలుత క్యాష్ కౌంటర్ వద్ద, ఆ తర్వాత కిచెన్‌లో ఆరు నిమిషాలకుపైగా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో నిరాశ చెందాడు. తన ఆవేదనను హావభావాల ద్వారా అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ ప్రదర్శించాడు.అనంతరం క్యాష్ కౌంటర్ వెనుక ఉన్న రెండు ఫ్రిజ్‌లలో వెతుకుతూ ఒక దాంట్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకని మెస్లోంచి వాటర్ బాటిల్ చోరీ చేయడానికి మనస్కరించకలేదో ఏమో.. తన ప్యాంటు బ్యాక్ పాకెట్ నుంచి పర్సు బయటకు తీసి అందులో నుంచి రూ. 20 తీసి వాటర్ బాటిల్‌ను కొట్టేయలేదు కొనుక్కొని వెళ్తున్నా అన్నట్లుగా చూపుతూ అక్కడి నుంచి వెనుతిరిగాడు. -
టెన్త్ ఫెయిలైన 88,342 మంది తిరిగి బడికి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉన్నత విద్య చదవాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. అందుకే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారు. పలు సంస్కరణలు తెచ్చారు. అందులో భాగమే టెన్త్ ఫెయిలైన విద్యార్థులను తిరిగి స్కూళ్లలో ఎన్రోల్ చేయించి తరగతులకు పంపడం. వారు పదో తరగతి ఫెయిలైన తర్వాత చదువు మానేయకుండా ఈ చర్యలు చేపట్టారు. మధ్యలో చదువు మానేస్తే పిల్లల భవిష్యత్తు అస్తవ్యస్తమవుతుంది. దీంతో వారిని తిరిగి తరగతులకు పంపుతున్నారు. తిరిగి పదో తరగతిలో చేరిన వారికి విద్యా రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ ప్రభుత్వం అందిస్తోంది. గత విద్యా సంవత్సరంలో 1.23,680 మంది విద్యార్థులు టెన్త్ ఫెయిలయ్యారు. వారు తిరిగి స్కూల్స్‌లో చేరారా లేదా అనే వివరాలన్నింటినీ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వలంటీర్ల ద్వారా ప్రత్యేక ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌తో ప్రభుత్వం సేకరించింది. వారిలో 88,342 మందిని ఇప్పటివరకు తిరిగి పదో తరగతిలో ఎన్రోల్ చేయించింది. ఇప్పుడు ఈ విద్యార్థులంతా తిరిగి తరగతులకు హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై సమీక్షించారు. అదనంగా చేరికలు గత విద్యా సంవత్సరంతో పోల్చితే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 1,26,212 మంది అదనంగా చేరారు. గత విద్యా సంవత్సరంలో టెన్త్‌లో 6,64,511 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 7,90,723 మంది ఎన్రోల్ అయ్యారు. అందరినీ బడిబాట పట్టించడంతో పాటు ఆ పిల్లలందరూ డిగ్రీ వరకు చదివేలా సూక్ష్మస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేయడమే ఇందుకు కారణమని అధికారులు వెల్లడించారు. పాస్ అయిన విద్యార్ధులు అంతటితో చదువు ఆపేయకుండా తదుపరి కోర్సుల్లో చేరుతున్నారా లేదా అనే వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో సేకరిస్తోంది. చదువు ఆపేసిన వారిని పై తరగతుల్లో చేరేలా ప్రోత్సహిస్తోంది. ప్రతి పేద విద్యార్ధి ఆరి్థక స్థోమత లేక మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించేలా రాస్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, నాడు–నేడు కార్యక్రమాలన్నీ విద్యార్ధులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే పథకాలే. -
అధికారుల నిర్లక్ష్యం.. బెయిల్ వచ్చినా మూడేళ్లు జైళ్లోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. జైలు అధికారుల నిర్లక్ష్యం ఓ దోషి పాలిట శాపంగా మారింది. బెయిల్ వచ్చినప్పటికీ మూడేళ్లపాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. లక్ష రూపాయల జరిమానా విధించింది. చందన్ జీ ఠాకూర్(27)కు ఓ కేసులో జీవితఖైదు శిక్ష పడింది. సెప్టెంబర్ 29, 2020న హైకోర్టు అతని శిక్షను నిలిపివేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్ పత్రాలను హైకోర్టు రిజిస్ట్రీ మెయిల్ ద్వారా పంపించింది. ఆ మెయిల్ అటాచ్‌మెంట్‌ను జైలు అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో చందన్ ఠాకూర్ ఇప్పటివరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం మళ్లీ కోర్టును సంప్రదించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు కోర్టు పంపిన ఆర్డర్ కాపీలను మెయిల్లో ఓపెన్ చేయలేదనే విషయం ఈ వ్యవహారంలో బయటపడింది. దీనికారణంగా చందన్ ఠాకూర్‌కు శిక్ష నుంచి విముక్తి కలిగినా.. ప్రయోజనం లభించలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. జైలు అధికారుల నిర్లక్ష్యానికి రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
చాట్‌జీపీటీ చెప్పిందని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్..
ChatGPT false: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత ఉపయోగకరమో.. అంతే ప్రమాదకరమైనది కూడా. టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. చాట్‌జీపీటీ (ChatGPT) చెప్పింది కదా అని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడో ప్రొఫెసర్. రెడ్డిట్ థ్రెడ్ ప్రకారం.. టెక్సాస్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్.. విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాశారని అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాధనం తప్పుగా చెప్పడంతో క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేశాడు. ఇదీ చదవండి: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్! విద్యార్థులు వ్యాసాలు సొంతంగా రాస్తున్నారా లేదా అని పరిశీలించడానికి ఆ ప్రొఫెసర్ చాట్‌జీపీటీ సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ అనేది ఓపెన్ఏఐ అభివృద్ధి చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్‌బాట్. ఇది వచనాన్ని రూపొందించగలదు. భాషలను అనువదించగలదు. వివిధ రకాల సృజనాత్మక కంటెంట్‌ను రాయగలదు. మీ ప్రశ్నలకు సమాచార రూపంలో సమాధానం ఇవ్వగలదు. తమ ఫైనల్ ఎగ్జామ్స్‌లో భాగంగా విద్యార్థులు తాము రాసిన వ్యాసాలను సమర్పించారు. వారి ప్రొఫెసర్ ఆ వ్యాసాలను స్కాన్ చేయడానికి చాట్‌జీపీటీని ఉపయోగించారు. అయితే విద్యార్థులు సమర్పించిన వ్యాసాలు కంప్యూటర్ ద్వారా రాసినవని చాట్‌జీపీటీ సూచించింది. దీంతో విద్యార్థులు వ్యాసాలను సొంతంగా రాయలేదని భావించిన ప్రొఫెసర్ క్లాస్‌లోని విద్యార్థులందరినీ ఫెయిల్ చేశాడు. అయితే, చాట్‌జీపీటీ చెప్పింది తప్పు అని తేలింది. వ్యాసాలను విద్యార్థులే స్వయంగా రాశారని, కంప్యూటర్లను ఉపయోగించ లేదని స్పష్టమైంది. దీంతో ప్రొఫెసర్ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
వందల మంది ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన విప్రో!
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. పేలవమైన పనితీరు కారణంగా ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది. (ఇదీ చదవండి: మరో బాంబు, వేలమందికి షాకివ్వనున్న టెక్ దిగ్గజం) ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపుపై విప్రో స్పందించింది. ‘విప్రోలో, మేం అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందుకు గర్వపడుతున్నాం. సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రతి ఎంట్రీ - లెవల్ ఉద్యోగి వారి నియమించబడిన వర్క్ ప్లేస్‌లో నిర్దిష్టమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము. వ్యాపార లక్ష్యాలు, క్లయింట్ల అవసరాలు ఉద్యోగుల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మానిటరింగ్, రీట్రైనింగ్ వంటి ప్రక్రియల్లో భాగంగా కంపెనీ నుండి కొంతమంది ఉద్యోగుల విభజన చేయాల్సి ఉంటుంది. కాబట్టే ట్రైనింగ్ తర్వాత పేలవంగా రాణిస్తున్న ఫ్రెషర్స్‌ను విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని తెలిపింది. (స్విగ్గీ ఉద్యోగాల ఊచకోత: 380 మందిపై వేటు) -
పారాగ్లైడింగ్ చేస్తుండగా.. సరిగా ఓపెన్ కాకపోవడంతో విషాదం
ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తుండగా సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో విసత్‌పురా గ్రామంలోని పాఠశాలలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. దక్షిణ కొరియాకు చెందిన 50 ఏళ్ల షిన్ బైయాంగ్ మూన్ గుజరాత్‌లోని కడి పట్టణంలో పారాగ్లైడింగ్ చేస్తుండగా.. పారాగ్లైడర్ కనోపి సరిగా తెరుచుకోవడంలో విఫలమైంది. అంతే అతను ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో అతను దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. దీంతో అతడి స్నేహితులు హుటాహుటినా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వ్యక్తి పడిపోతున్నానన్న షాక్‌లో గుండెపోటుకి గురవ్వడంతో మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఆ కోరియన్ గుజరాత్‌లోని వదోదర పర్యటనలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం సదరు కొరియన్ షిన్, అతని స్నేహితుడితో కలిసి పారాగ్లైడింగ్‌కి వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా కేసు నమోదు చేసి కొరియన్ ఎంబసీకి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని అతడి స్వదేశానికి పంపే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. (చదవండి: క్రిస్మస్ చెట్టుకు బైడెన్ దంపతుల అలంకరణ.. ఫోటో వైరల్) -
ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలం.. నిరుపయోగంగా శాటిలైట్స్
సూళ్లూరుపేట(తిరుపతి): ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం విఫలమైందని అధికారికంగా ప్రకటించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఆ రాకెట్ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాలు ఇకపై పనికిరావని ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. మూడు దశలను విజయవంతంగా దాటిన రాకెట్.. టర్మినల్ దశలో అదుపు తప్పింది. రెండు ఉపగ్రహాలను 356x76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే.. ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ వాటిని 356 కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టింది. అందువల్ల ఈ ఉపగ్రహాలు పనికి రావని ఇస్రో వెల్లడించింది. సెన్సార్ విఫలమవటం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. టర్మినల్ దశలో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఇస్రో ఏర్పాటు చేసిన కమిటీ విశ్లేషిస్తోందని, ఈ కమటీ ఇచ్చే నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే ఎస్ఎస్ఎల్వీ-డీ2 ప్రయోగాన్ని చేపడతామని పేర్కొంది. ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహా వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ డీ1ను తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. ఈ రాకెట్ ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఈవోఎస్-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. ఆజాదీశాట్ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు. ఈ ప్రయోగంలో మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో మొదట వెల్లడించింది. టెర్మినల్ దశకు సంబంధించిన సమాచారం రావడంలో కొంత జాప్యం జరిగినట్లు తెలిపింది. (1/2) SSLV-D1/EOS-02 Mission update: SSLV-D1 placed the satellites into 356 km x 76 km elliptical orbit instead of 356 km circular orbit. Satellites are no longer usable. Issue is reasonably identified. Failure of a logic to identify a sensor failure and go for a salvage action— ISRO (@isro) August 7, 2022 -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం
-
అలా నటిద్దామనుకున్న టిక్‌టాకర్ పాట్లు చూడాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం కవితలు రాసినంత, పాటలు పాడుకున్నంత ఈజీకాదు. మహిళల జీవితంలో అదొక ఉద్విగ్న సందర్భమే అయినా, ఆ నవమోసాలు పడే అవస్తలు సవాళ్లు, ప్రసవ వేదన, తదనంతర బాధలు అన్నీఇన్నీ కావు. అందుకే ‘‘రైలు పట్టా మీద నాణెం విస్తరించిన బాధ’’ అంటూ ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల ‘లేబర్‌రూం’ అనే కవితలో వర్ణిస్తారు. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే దీన్ని స్వయంగా అనుభవిద్దామనుకున్న ఒక యువకుడికి ఎదురైన చేదు అనుభవం ఇపుడు వైరల్‌గా మారింది. అంతేకాదు పలువురిని ఆలోచింప చేస్తోంది. గర్భిణీలు పడే మానసిక, శారీరక కష్టాలను, స్వతహాగా అనుభవించాలనుకున్నాడు మెయిట్లాండ్ పాపులర్ టిక్‌టాకర్ హాన్లీ. ప్రెగ్నెంట్ లేడీగా కనిపించేలా పొట్టపై భారీ వాటర్ మిలన్‌ను, అలాగే ఛాతీ వద్ద కూడా రెండు చిన్న వాటర్ మిలన్లన అమర్చుకున్నాడు. అలా మొత్తం నిండు గర్భిణీలా తన అవతారాన్ని మార్చుకున్నాడు. ఇక్కడవరకు బాగానే ఉంది. కానీ ఆ తరువాతే అబ్బాయిగారికి అసలు కష్టాలు మొదలయ్యాయి. వేషం అయితే వేసుకున్నాడు కానీ, అంత బరువుతో లేచి తిరగడం మాత్రం అతని వల్ల కాలేదు. కనీసం మంచం మీద నుంచి కాలు కిందపెట్టలేకపోయాడు. నిజమైన గర్భధారణను అనుకరించడం అసాధ్యమైనప్పటికీ, ఒక ప్రయోగం చేయాలనుకున్నా... అదంత పెద్ద కష్టమేమీ కాదనుకున్నాను కానీ మంచం నుండి లేవడానికి చాలా కష్టపడ్డానని హాన్లీ చెప్పాడు. ఈ ఘటనకు సంధించిన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్! ‘తొమ్మిది నెలలు బిడ్డను మోయడం, జన్మనివ్వడం అషామాషీ కాదు.. ఫన్నీ అసలే కాదు. ఇదే వాస్తవం.. కావాలంటే మీరూ ట్రై చేయండి’ అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. గర్భధారణ, ప్రసవం సవాళ్లను తేలిగ్గా కొట్టిపారేశే వాళ్లకి ఇదొక గుణపాఠం అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ వీడియో కోటి 70 లక్షలకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. చదవండి: చర్చకు దారి తీసిన ఆనంద్ మహీంద్ర వైరల్ వీడియో -
లాక్డౌన్ విఫలం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో అమలైన నాలుగు విడతల లాక్డౌన్ విఫలమైందనీ, ప్రధాని మోదీ ఊహించిన ఫలితాలనివ్వలేదనీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని పునఃప్రారంభించేందుకు కేంద్రం దగ్గరున్న వ్యూహం ఏమిటో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. లాక్డౌన్ లేని సమయంలో ప్రభుత్వం అస్తవ్యస్తంగా పనిచేయడం వల్ల అత్యంత వినాశన కరమైన రెండో దశ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. పేద ప్రజల చేతికి డబ్బులు ఇవ్వకపోతే దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న రాహుల్.. రాష్ట్రాలకూ, వలసకూలీలకు కేంద్రం ఏం చేయాలనుకుంటోందో తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. లాక్డౌన్ లక్ష్యం నెరవేరకపోగా 60 రోజుల అనంతరం కూడా వైరస్ వ్యాప్తిచెందుతోందన్న విషయం స్పష్టమేనని రాహుల్ వ్యాఖ్యానించారు. -
వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు విఫలం
సాక్షి, హైదరాబాద్: దేశ విభజన సమయంలో ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు వలస కార్మికులు పడుతున్నారని, వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపిం చారు. వారి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనతకు నిరసనగా ఆదివారం గాంధీభవన్‌లో దీక్ష నిర్వహించా రు. ఇందులో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మె ల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీపీసీ సీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ పాల్గొన్నారు. సా యంత్రం నేతల దీక్షను ఉత్తమ్‌తో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఉత్తమ్ మాట్లాడుతూ వలసజీవులను ఆదుకోవడంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. వారు కనీసం వసతి కల్పించలేదని, తిండి కూడా పెట్టలేకపోయారని విమర్శించారు. నేరుగా లబ్ధి చేకూర్చాలి: లాక్‌డౌన్‌తో నష్టపోయిన వారికి నేరుగా లబ్ధి చేకూర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడా రు. ప్రభుత్వం మద్యం అమ్మకాలపై చూపిన శ్రద్ధ నష్టపోయిన వర్గాలపై చూపలేదన్నారు. మోదీతో రెండ్రోజులకోసారి మాట్లాడుతున్నట్లు చెబుతున్న సీఎం.. ప్రజల కోసం ప్యాకేజీ ఎందుకు అడగడం లేదన్నారు. కరోనా ముసుగులో ప్రైవేటీకరణ..: కరోనా వైరస్ ముసుగులో కేంద్రప్రభుత్వం అన్నిరంగాలను ప్రైవేటీకరించేందుకు యత్నిస్తోందని దీనిపై ఉద్యమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కరోనా నియంత్రణకు గాను దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో బాధితులకు మరింత సాయం చేయాలని టీపీసీసీ కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్ కమిటీ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఇందులో ఉత్తమ్, కుంతియాలు మాట్లాడుతూ ఇప్పటి వరకు కాంగ్రెస్ నా యకులు, కార్యకర్తలు లాక్డౌన్ నేపథ్యంలో చేసిన సాయాన్ని జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని కోరారు. కాగా, ఈ సమయంలో కార్మికుల పని సమయాన్ని పెంచేందుకు ప్రయత్నం జరుగుతోందని, ఇది కార్మిక హక్కులను కాలరాయడమేననన్నారు. అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని, దీనిపై ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న అనేక వర్గాలకు అండగా నిలిచేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీలో మరిన్ని ఉపకమిటీలు కూడా వేయాలని నిర్ణయించారు. అనంతరం ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు టీపీసీసీ ఖర్చులతో ఏర్పాటు చేసిన బస్సును ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించి పంపించారు. -
క్లినికల్ ట్రయల్స్‌లో ఆ డ్రగ్ ఫెయిల్..
న్యూయార్క్: కరోనా చికిత్సలో భాగంగా నిర్వహించిన మొదటిదశ క్లినికల్ ట్రయల్స్‌లో రెమ్‌డెసివర్ డ్రగ్ ఫెయిలయ్యింది. ఈ మందు వాడటం వల్ల దుష్ప్రభావాలు ఉన్నట్లు నిపుణులు నిర్ధారించారు. గిలెడ్ సైన్సెన్స్ తయారు చేసిన ఈ డ్రగ్ కరోనాపై పని చేయలేదని తేలింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించారు. రెమ్‌డెసివర్ ఔషదాన్ని 237 మంది కరోనా రోగులపై ప్రయోగిస్తే 158 మందిపై అది సైడ్ ఎఫెక్ట్స్ చూపడంతో మొదటిదశలోనే డ్రగ్ వాడకాన్ని నిషేదించినట్లు చైనా వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా వారిలో మరణాల రేటు కూడా నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే గిలెడ్ సైన్సెన్స్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. రెమ్‌డెసివర్ డ్రగ్‌పై ట్రయల్స్ కొనసాగుతాయని, ఇది కరోనాను అంతం చేస్తుందని నమ్ముతన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. క్లినికల్ ట్రయల్స్ సాధ్యమైనంత ఎక్కువగా జరిగినప్పడే ఔషధం పనితారు తెలుస్తుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో ఫార్మాకోపీడెమియాలజీ ప్రొఫెసర్ స్టీఫెన్ ఎవాన్స్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కరోనా సోకిన వెంటనే డ్రగ్‌ని ప్రయోగించాలని అప్పుడే అది సమర్థవంతంగా పనిచేయగలదని పేర్కొన్నారు. మనిషి శరీరంలో ఉండే డీఎన్ఏ, ఆర్ ఎన్ఏ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండటం వల్ల డ్రగ్ పనితీరు వేరుగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం కరోనాపై సంజీవనిలా పనిచేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు కూడా అన్ని దేశాల్లో ఒకే విధంగా పనిచేయడం లేదని..మనిషి రోగ నిరోధక శక్తిని బట్టి ఇది ప్రభావం చూపుతుందని అన్నారు. -
పల్లెలకు అందని సాంకేతిక విప్లవం
సీతంపేట: నాలుగేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభించిన ఫైబర్ నెట్ పల్లెల్లో ఎక్కడా కానరావడం లేదు. ప్రపంచం సాంకేతికంగా ముందడుగేస్తుంటే అప్పటి టీడీపీ సర్కారు పుణ్యమాని ఏపీ పల్లెలు వెనక్కు నడిచాయి. రూ.149కే ఇంటర్నెట్, ఫోన్, కేబుల్ ప్రసారాలను ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఊదరగొట్టింది. రూ.149కే నెలకు 250 చానళ్లు, 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 15 జీబీ నెట్ సౌకర్యం కల్పించనున్నామని ప్రకటించారు. టీవీ ప్రసారాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడానికే ఈ పథకాన్ని చేపట్టారని అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. దీని కోసం వందల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు తగ్గట్టుగానే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పురోగతిపై ఈ పథకం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. తమకు అనుకూలంగా లేని న్యూస్ చానళ్ల నోళ్లు నొక్కే ప్రయత్నాలు జరిగాయి. చివరకు ఆ పథకం ఎందుకూ కొరగాకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా దీని చిరునామా లేదు. అదేంటో తమకు తెలియదని కూడా పాలకొండ నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల ప్రజలు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫైబర్ ప్రాజెక్టు అమలు కావడానికి రూ.300 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జి ల్లాలోని సుమారు 6 లక్షల ఇళ్లకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు అంచనా వేశారు. 40 శాతం కూడా పూర్తి చేయకుండా టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. తలా తోకా లేని ఈ పథకాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లడం కష్టసాధ్యమని తెలుస్తోంది. దీనిపై కనీస అవగాహన కూడా ఎవరికీ లేకపోవడం విశేషం. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలపై కేబుళ్లు వేసి ఇప్పటికే ఏడాది దాటుతోంది. కేవలం అక్కడక్కడ తూతూమంత్రంగా ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించారు. పట్టణాల్లో కొన్నిచోట్ల గృహాలకు కనెక్షన్ ఇచ్చారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇళ్లకు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదు. ఎక్కడా కనెక్షన్ ఇవ్వలేకపోయారు. దీంతో ప్రైవేటుగా డిష్ టీవీ, సన్‌టీవీ, ఎయిర్టెల్ వంటి నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యనందించడానికి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులకు బోధించే తరగతులకు సైతం ఫైబర్‌నెట్ పూర్తిస్థాయిలో అందని పరిస్థితి ఉంది. మొత్తానికి కోట్లలో ప్రభుత్వ ధనం వృథా అయ్యింది. ప్రసారాలు రావడం లేదు.. మాకు ఎటువంటి ఫైబర్‌నెట్ రావడం లేదు. మారుమూల ప్రాంతమైనప్పటికీ ప్రతి ఇంటికీ టీవీ కనెక్షన్ ఉంది. కేబుల్ స్తంభాలకు వేస్తున్నపుడు మాకు నెట్వర్క్ వస్తుందని ఆశించాం. అమలు కాకపోవడంతో ప్రయివేట్ నెట్‌వర్క్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. –రాము, పొల్లకాలనీ అదేంటో తెలీదు.. ఫైబర్ నెట్ అంటే ఏంటో మాకు తెలీదు. కేవలం ఫోన్ మాత్రమే వినియోగిస్తున్నాం. అక్కడక్కడా ప్రయివేట్ సెల్ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. మా గ్రామాలకు ఎటువంటి నెట్, టీవీ కనెక్షన్లు లేవు. డిష్ ద్వారా టీవీలు చూస్తున్నాం తప్ప రూ.149 కనెక్షన్ లేదు. ఇవ్వలేదు. –ఎస్.బోడయ్య, లంగడుగూడ -
గృహనిర్మాణంలో... పక్కా దగా..
నెల్లూరు(సెంట్రల్): ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో పేదలకు ఇళ్లు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం సొంతంగా పేదలకు ఇళ్లను ఇస్తున్నట్లు కేంద్ర పథకానికి ముందు ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంగా మార్చేకుంది. ఈ పథకాల కింద 2016 నుంచి 2019 వరకు జిల్లాకు 37,046 ఇళ్లను ఇస్తామని ప్రకటించింది. ఇందులో యూనిట్ ఖరీదు రూ.3.50 లక్షలు కాగా లబ్ధిదారుడి వాటా కింద రూ.25 వేలు, బ్యాంకు నుంచి మరో రూ.75 వేలు ఇస్తామని, మిగిలిన రూ.2.50 లక్షలు సబ్సిడీ కింద ఇస్తామని చెప్పింది. ఈ పథకం కింద పలువురు బ్యాంకులకు వెళ్లి దరఖాస్తులు చేసుకోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేక పోవడంతో బ్యాంకర్లు నిధులు మంజూరుకు నిరాకరించారు. 20 శాతం కూడా పూర్తి కాని ఇళ్లు జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన హౌసింగ్‌కు సంబంధించి మొత్తం 37,046 ఇళ్లను కేటాయించారు. వీటిలో కేవలం 5 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది. 20 శాతం ఇళ్లు పునాదుల్లోనే నిలిచిపోవడం గమనార్హం. మిగిలనవి కనీసం పునాదులకు కూడా నోచుకోలేదు. ఇళ్ల నిధులు మళ్లింపు జిల్లాలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ గ్రామీణ గృహ పథకం ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయగా, చంద్రబాబు మాత్రం వాటిని ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పసుపు–కుంకమ పథకానికి మళ్లించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటితోనే నెట్టుకుని వస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. రూ.55 కోట్ల బకాయిలు జిల్లాలో ప్రస్తుతం హెచ్ఎఫ్ఏ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా పథకం ద్వారా రూ.47 కోట్లు, ఎన్టీఆర్ రూరల్ పథకం ద్వారా మరో రూ.8 కోట్లు మొత్తం రూ.55 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై అదిగో ఇదిగో అంటూ నాన్చుడు ధోరణి తప్ప నిధులు మాత్రం విడుదల చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా చంద్రబాబును నమ్మి ఇళ్ల నిర్మాణం చేపట్టినందుకు సరైన గుణపాఠం వచ్చిందని, ఇక మీదట ‘నిన్ము నమ్మం బాబూ’ అంటూ పలువురు లబ్ధిదారులు మండిపడుతున్నారు. జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ గృహ పథకం నియోజకవర్గం మండలాలు పంచాయతీలు ఐదేళ్లలో మంజూరైన ఇల్లు ఆత్మకూరు 6 123 4,512 కావలి 4 70 5,062 కోవూరు 5 79 4,188 నెల్లూరు రూరల్ 1 31 1,550 గూడూరు 5 117 6,255 సూళ్లూరుపేట 6 122 3,663 సర్వేపల్లి 5 113 3,869 వెంకటగిరి 6 135 4,089 ఉదయగిరి 8 138 3,858 మొత్తం 37,046 పునాదులకే పరిమితం ఆత్మకూరురూరల్: తెలుగుదేళం పాలనలో పేదొడి పక్కా ఇళ్ల కల కల్లగా మారింది. అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చిన చంద్రబాబు విస్మరించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పేదలకు ఇళ్లు మంజూరు చేసింది. నియోజకవర్గంలో ఆరు మండలాలలు ఉంటే.. వరుసగా మూడేళ్లు కాలంలో 4,515 ఇళ్లు మంజూరు చేశారు. అయితే ఇందులో అత్యధిక శాతం ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన ఇళ్లకు చాలా వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అరకొరగా కేటాయింపులు చేసి పేదల గృహ నిర్మాణాలను పునాదులు దాటకుండా పచ్చ పార్టీ నేతలు తమకు అన్యాయం చేశారని ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మండలంలోని నువ్వూరుపాడు, అప్పారావుపాళెం, పమిడిపాడు, కరటంపాడు, దేపూరు, రామస్వామిపల్లి తదితర గ్రామాల్లో సుమారు 500 కుటుంబాల గిరిజనులు ఉండగా వారిలో అత్యధిక శాతం పూరిల్లు కూడా లేని వారు ఉన్నారు. పమిడిపాడులో 30 కుటుంబాల గిరిజనులు తాత్కాలిక నివాసాలు ఉండగా నువ్వూరుపాడు ఎస్టీకాలనీలో నాలుగేళ్ల క్రితం మంజూరైన 14 మంది గిరిజనుల కుటుంబాల పక్కా ఇళ్లు బేస్మెంట్ దశలో నయాపైసా బిల్లు కాక నిలిచిపోయింది. అనుమసముద్రంపేట మండలంలో దాదాపు 849 గృహాలు మంజూరు కాగా 90 గృహాలు మినహా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. లబ్ధిదారులకు ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో లబోదిబో అంటున్నారు. ఇందులో అధిక శాతం టీడీపీ అనుకూల వర్గానికే గహాలు మంజూరైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అనంతసాగరం మండలంలో ఎన్టీఆర్ గృహæ లబ్ధిదారులకు ఐదు నెలలుగా బిల్లులు రాక ఎదురు చూస్తున్నారు. మండలంలో 1,223 గృహాలు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాల లబ్ధిదారులు దాదాపు 236 మంది ఉన్నారు. పచ్చ ముద్ర ఉంటేనే ఇల్లు సూళ్లూరుపేట: ఐదేళ్ల టీడీపీ పాలనలో నిజమైన అర్హులకు పక్కా ఇళ్లు అందని ద్రాక్షలా తయారైంది. రిజర్వ్డ్ నియోజకవర్గమైన సూళ్లూరుపేటలో ఆరు మండలాలు ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మొత్తం 3,663 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో సగం కూడా పూర్తి కాలేదు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నుడా కింద సుమారు 1,838 ఇళ్లు మంజూరు కాగా ఇవి కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 17.3 శాతం, ఎస్టీలకు 5.3 శాతం ఇళ్లు ఇవ్వమని ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అయితే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో సుమారు 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు పేదరికంలో ఉన్నారు. మంజూరు చేసిన ఇళ్లను సైతం అర్హులైన పేదలకు ఇవ్వలేదు. జన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించిన వారికే, అది అధికార పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. బిల్లుల మంజూరులో సైతం నిర్లక్ష్యం ప్రదర్శించారు. పూర్తిస్థాయిలో బిల్లులు మంజూరు కాకపోవడంతో సగం ఇళ్లు కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ గృహ పథకం ఒక మిథ్య ముత్తుకూరు : టీడీపీ పాలనలో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రెండేళ్ల వరకు పేదలకు పక్కా గృహాలు మంజూరు కానేలేదు. నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటే.. ఐదేళ్లకు గాను 3,869 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. 2016–17 సంవత్సరంలో సర్వేపల్లి నియోజకవర్గానికి 1,350 ఇళ్లు మంజూరురైతే అధికారుల లెక్కల ప్రకారం అన్నీ పూర్తయ్యాయి. 2017–19కి 1,221 ఇళ్లకు 770 పూర్తయ్యాయి. 2018–2019 సంవత్సరంలో 1,348 పక్కాగృహాలు మంజూరుకాగా 1,000 ఇళ్లు మాత్రమే నిర్మాణం ప్రారంభమయ్యాయి. ఒక మండలానికి ఏటా అరకొరగానే ఇళ్లు మంజూరు కావడంతో వందల సంఖ్యలో ఉన్న పేదలు నేటికీ పూరిపాకల్లో బతుకీడుస్తున్నారు. నుడా కింద 7,470 పక్కాగృహాలు మంజూరైనప్పటికీ 90 శాతం ఇళ్ల నిర్మాణం ప్రారంభంకాలేదు. హౌసింగ్ ఇంజినీర్ల అంచనాల ప్రకారం శ్లాబు నిర్మాణం, సిమెంట్ పూత పనులు జరిగితేనే పక్కా ఇల్లు పూర్తనట్టు లెక్క. దీంతో 70 శాతం తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ లేని ఇళ్లే దర్శన మిస్తున్నాయి. ఒక ఇంటికి ప్రభుత్వం మంజూరు చేసే రూ.1.35 లక్షలు, మరుగుదొడ్డికి రూ.15 వేలు చాలీచాలక పోవడమే దీనికి కారణం. కలగా మారిన పక్కా ఇళ్లు ఉదయగిరి: వైఎస్సార్ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుత టీడీపీ పాలనలో పక్కా ఇళ్లు పచ్చతమ్ముళ్లు, జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలున్న వారికే మాత్రమే మంజూరయ్యాయి. ఈ ఐదేళ్ల ప్రభుత్వం హయాంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉంటే.. 3,858 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో కేవలం 270 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావన్నీ కూడా వివిధ దశల్లోనూ, పునాదులకే పరిమితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్మించిన వాటికి కూడా పూర్తిస్థాయిలో బిల్లులు లబ్ధిదారులకు అందలేదు. మంజూరు చేసిన బిల్లులు కూడా జన్మభూమి కమిటీలకు, లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే అందాయి. అసలైన పేదలకు మాత్రం పక్కా ఇళ్లు మంజూరు కాలేదు. నియోజకవర్గంలో ఎక్కువ ఇళ్లు అధికార పార్టీ నేతలు, వారి బంధువులు, వారికి సమీపస్తులకు మాత్రమే మంజూరు కావడం విశేషం. కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించకుండానే బిల్లులు కాజేశారు. వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన ఏఈలను సస్పెండ్ చేశారు. ఉదయగిరి డీఈ కూడా సస్పెండ్ అయ్యారు. దీన్ని పక్కా ఇళ్ల నిర్మాణంలో అవినీతి ఏస్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. వరికుంటపాడు మండలం గణేశ్వరపురం, నార్తుకొండాయపాళెం, విరువూరు, రామాపురం, తదితర పంచాయతీల్లో పక్కా ఇళ్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుంది. దుత్తలూరు మండలంలో కొత్తపేట, వెంగనపాళెం, ముత్తరాశిపల్లి, నాయుడుపల్లి, దుత్తలూరు పంచాయతీల్లో బిల్లులు నిర్మించకుండానే అధికారులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై నిధులు భోంచేశారు. అసంపూర్తి.. అసంతృప్తి బుచ్చిరెడ్డిపాళెం: ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఐదేళ్లుగా అర్హులను మోస చేశారు. కోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాలు..79 పంచాయతీలు ఉంటే 2014 నుంచి 2019 వరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మొత్తం ఐదేళ్లలో 4,188 ఇళ్లు మంజూరు చేసింది. అయితే వీటిలో 3,196 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా 992 అసంపూర్తిగానే ఉన్నాయి. కొన్ని ఇళ్లు బేస్‌మట్టానికే పరిమితమయ్యాయి. దాదాపు రూ.3 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నేటికీ ఖాతాల్లో బిల్లు బకాయిలు పడడం లేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. శ్లాబులు వేసుకుని బిల్లుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
టీఆర్ఎస్ను టార్గెట్ చేయడంలో వ్యూహం లేదా
-
'ధంతేరస్' రోజు బంగారానికి ఏమైంది?
న్యూఢిల్లీ: 'ధంతేరస్' రోజు గోరెడు బంగారమైనా సొంతం చేసుకోవాలని ప్రజలు భావిస్తారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ భారతదేశీయులు పవిత్రమైన రోజుగా పరిగణించే ధంతేరస్ రోజు బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ. అలాగే ఈరోజు కచ్చితంగా అమ్మకాలు జోరందుకుంటాయనీ, తమ వ్యాపారం బావుంటుందని బంగారం దుకాణందారులు కూడా ఆశిస్తారు. ఈ మేరకు ధంతేరస్ రోజు అమ్మకాలతో పసిడి మెరుపులు మెరిపించడం మామూలే. కానీ ఈ ఏడాది మాత్రం ఇందుకు విరుద్ధంగా బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. బంగారం కొనుగోళ్లు పసిడి ధరలకు ఊతమివ్వలేకపోయాయి. పవిత్రమైన పండుగ సందర్భంగా ఆభరణాల కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ధోరణి ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. బులియన మార్కెట్ లో పది గ్రాముల పసిడి110 రూపాయలు క్షీణించి రూ 30,590 వద్ద నమోదవుతోంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో కూడా పుత్తడి లాభాలతో ప్రారంభమైనా నష్టాల్లోకి జారుకుంది 53 రూపాయల నష్టంతో 29,874 వద్ద ఉంది. అయితే బంగారు ఆభరణాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ గ్లోబల్ ట్రెండ్ కారణంగా బంగారం ధరలు బలహీన పడుతున్నాయని బులియన్ ట్రేడర్స్ చెబుతున్నారు. విలువైన ఖనిజాలు మార్కెట్ల బలహీనంగా ధోరణి బంగారం ధరల పతనానికి దారితీసిందని తెలిపాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ బంగారం ధరలు వన్నె తగ్గాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరలు బలహీనంగా ఉన్నాయి. సింగపూర్ లో ఔన్స్ బంగారం ధర 0.17తగ్గి 1,266 డాలర్లు నమోదైంది. 99.5 స్వచ్ఛత బంగారం 110 క్షీణించి రూ. 30,440 వద్ద ఉంది. వెండి ధరలు కూడా 0.34శాతం క్షీణించాయి. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ రూ. 24,500 పలుకుతోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో డిసెంబర్ డెలివరీ బంగారు రూ 46 పతనమై (0.15 శాతం)10 గ్రాములు రూ 29,881 వద్ద ఉంది. -
‘ప్యాకేజీ’ నిధులను స్వాహా చేసేందుకే..
వీరవల్లి (హనుమాన్‌జంక్షన్ రూరల్) : ఏపీకి ప్యాకేజీ రూపంలో వచ్చే నిధులను స్వాహా చేయవచ్చు అనే ఆశతో సీఎం చంద్రబాబు ఉన్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలసు పార్థసారథి అన్నారు. బాపులపాడు మండలంలోని వీరవల్లిలో యాదవుల ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో శనివారం రాత్రి ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కొడెబోయిన బాబి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. హోదాతో ఉపాధి.. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే సంక్షేమ ప«థకాలకు నిధులు, పరిశ్రమలకు పన్ను రాయితీలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశతో వైఎస్సార్ సీపీ హోదా కోసం పొరాటం చేస్తుందని చెప్పారు. టీడీపీ నేతల జేబులు నింపేందుకే సీఎం చంద్రబాబు, ప్యాకేజీని స్వాగతిస్తుందన్నారు. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మాజీ డైరెక్టర్ పద్మనాభం పాల్గొన్నారు. -
కరువుపై ఏపీ సర్కారు ఫ్లాప్ షో !
-
'పవర్ ఆఫ్ పాటీదార్' కు సెన్సార్ చిక్కులు!
సూరత్ః పవర్ ఆఫ్ పాటీదార్ పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలో గుజరాత్ రాష్ట్రంలో చెలరేగిన పాటీదార్ ఆందోళన ఆధారంగా తెరకెక్కనున్న గుజరాతీ సినిమా విడుదలకు అనుమతి నిరాకరించింది. రాళ్ళు రువ్వుకోవడం, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారి నిజమైన పేర్లను వాడటం వంటి అనేక కారణాలతో సినిమా విడుదలకు తిరస్కరించింది. పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో గతంలో గుజరాత్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆందోళనల నేపథ్యంలో తీసిన గుజరాతీ సినిమా 'పవర్ ఆఫ్ పాటేదార్' విడుదలకు సీబీఎఫ్సీ అనుమతి నిరాకరించింది. గుజరాత్ లో జరిగిన ఆందోళనల్లో రాళ్ళు రువ్వుకోవడం వంటి సన్నివేశాలతోపాటు, ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ మొదలైనవారి పేర్లను సినిమాలో వాడటమే కాక, ఆందోళన సమయంలో హార్థిక్ కు సహాయకులుగా ఉన్నవారే సినిమాలో పాత్రలు ధరించడంపై కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే సెన్సార్ బోర్డు ఇప్పటిదాకా సినిమాలో అభ్యంతరకర సీన్లు కట్ చేయడంపై తమకు ఎటువంటి రాత పూర్వక ఆదేశాలు జారీ చేయలేదని, అటువంటి ఆదేశాలు అందితే సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సినిమా నిర్మాత మహేష్ పటేల్ తెలిపారు. సినిమాలో హార్థిక్ పటేల్ తో సహా ఆందోళనలోపాల్గొన్న అనేకమంది నాయకులకు చెందిన పేర్లను వాడటంతోనే సీబీఎఫ్సీ అడ్డు చెప్తున్నట్లు పటేల్ తెలిపారు. అంతేకాక పాటీదార్ టైటిల్ పై కూడా సీబీఎఫ్సీ అభ్యంతరం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్ ఆందోళన, హార్థిక్ పటేల్ కు సంబంధించిన కథలు తెరకెక్కితే.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ అటువంటి సినిమాలు రాకుండా చేసేందుకు ఇది.. ప్రభుత్వం చేస్తున్నప్రయత్నంలో భాగంలానే ఉందని పటేల్ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఆనందీ బెన్ క్యారెక్టర్ ను సినిమాలో పెట్టడం కూడా అభ్యంతరానికి మరోకారణంగా తెలుస్తోందన్నారు. ఒకవేళ బోర్డు.. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు కట్ చేసేందుకు ఆదేశిస్తే అందుకు తాము సిద్ధమేనని, కానీ సినిమా మొత్తానికే సమస్యాత్మకం చేస్తున్నారని, ఇప్పటికే కేసర్ భవానీ ఫిల్మ్ ప్రొడక్షన్ సమర్పణలో 12 కు పైగా గుజరాతీ సహా ఇతర భాషా చిత్రాలను నిర్మించిన 'పవర్ ఆఫ్ పాటీదార్' నిర్మాత పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
బ్యాంక్ దోపిడీకి యత్నం..
-
కొనేవారే కరువయ్యారు!
వేలకోట్ల రుణాలను ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త.. విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల అమ్మకానికి సైతం నానా తిప్పలూ పడాల్సివస్తోంది. భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రుణం తీసుకొని మోసగించి, మాల్యా విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సంబంధించి ఆస్తులను కొనేందుకూ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. తాజాగా ఆయన కంపెనీకి చెందిన జెట్ విమానం వేలానికి పెట్టగా కనీస ధర కూడ పలకకపోవడంతో వేలం నిలిపివేయాల్సి వచ్చింది. లిక్కర్ కింగ్ విజయమాల్యా ఆస్తుల వేలంలో మరోసారి నిరాశ ఎదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏవియేషన్ సపోర్ట్ కంపెనీ.. అల్నా ఏరో డిస్ట్రిబ్యూషన్ వేసిన బిడ్ ను సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రిజెక్ట్ చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ ఛైర్మన్ విజయమాల్యాకు చెందిన లగ్జరీ జెట్ విమానం.. వేలానికి పెడితే కనీస ధర 150 కోట్లు వస్తుందని అంచనా వేసిన కంపెనీకి నిరాశే మిగింలింది. బిడ్ కేవలం 1.09 కోట్ల రూపాయల అతి తక్కువ ధర రావడంతో ట్యాక్స్ అధికారులు అమ్మకానికి నిరాకరించారు. కనీస ధర కూడ పలకకపోవడంతో వేలాన్ని నిలిపివేశారు. -
అక్షయ తృతీయనాడు 30 వేల దిగువకు పసిడి
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సెంటిమెంట్ వ్యాపారులకు నిరాశ మిగిల్చింది. డిమాండ్ బాగా పెరిగిందని ఆన్ లైన్ వ్యాపారులు ఒకవైపు ప్రకటించగా, బంగారు ఆభరణాల దుకాణాలు మాత్రం అక్షయ తృతీయ రోజు పసిడి అమ్మకాలు ఆశించినంతగా లేక వెలవెల బోయాయి. పవిత్రమైన అక్షయ తృతీయ రోజు అంచనాలకు అనుగుణంగా వ్యాపారం జరగలేదు. కొనుగోలుదారులనుంచి స్పందన పెద్దగా లేకపోవడంతో బులియన్ మార్కెట్ చిన్నబోయింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో విలువైన మెటల్ మార్కెట్ లో మెరుపులు మాయమయ్యాయి. ఒక దశలో పసిడి 250 రూ.ల నష్టపోయి 10గ్రా. ధర 30,100 దగ్గర స్థిరంగా ట్రేడయిన పసిడి ధరలు ఆతర్వాత 30 వేల మార్క్ దిగువకు పడిపోయాయి. 389 రూపాయలను కోల్పోయి 29, 989 స్థాయిని నమోదు చేసింది. బలహీన అమెరికా పే రోల్ నివేదిక అనంతరం డాలర్ విలువ పుంజుకుంది. దీంతోపాటు విదేశీ మార్కెట్లలో బలహీన ధోరణి బంగారం ధరలు పతనానికి దారితీసిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ లేకపోవడం, ఈ మధ్య కాలంలో ధరలు పెరగడం కారణంగా పవిత్రమైన అక్షయ తృతీయ సెంటిమెంట్ పనిచేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బలహీనంగా ఉన్నప్పటికీ, కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ కి చెందిన వ్యాపారి గౌరవ్ ఆనంద్ తెలిపారు. వివాహాది శుభకార్యాలు ముగియడం, ప్రస్తుతం మూఢం నడుస్తున్నందున, భారీ కొనుగోళ్లు ఆశించలేమని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారులనుండి డిమాండ్ తగ్గడంతో వెండి కూడా బలహీనంగానే ట్రేడ్ అవుతోంది. దాదాపు కిలో రూ 350 క్షీణతతో రూ 41.200 దగ్గర ఉంది. గ్లోబల్ గా పసిడి ధరలను ప్రభావితం చేసే సింగపూర్ మార్కెట్ లో బంగారం 0.7 శాతం, వెండి అరశాతం మేర ధరలు పడిపోయాయి. ఇది దేశరాజధాని నగరంలోని బులియన్ మార్కెట్ ను కూడా ప్రభావితం చేసింది.అటు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. -
కేజ్రీవాల్ తో ఫోన్ లో మాట్లాడిన కన్హయ్య
న్యూ ఢిల్లీః ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్ నాయకుడు కన్హయ్య ఫోన్ లో సంభాషించారు. ముందుగా ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించిన కన్హయ్య వీలు కుదరకపోవడంతో ఫోన్ లోనే మాట్లాడారని సీపీఐ నాయకుడు డి రాజా తెలిపారు. అయితే విద్యార్థి కార్యకర్త అపరాజితతో కలసి రాజా ముఖ్యమంత్రిని కలవడం ప్రత్యేకత సంతరించుకుంది. తన కుమార్తె... జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి కార్యకర్త అపరాజిత తో సహా.. రాజా ఢిల్లీ సచివాలయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిశారు. ముఖ్యమంత్రిని కలసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన.. కన్హయ్య ట్రాఫిక్ జామ్ కారణంతో రాలేకపోయాడని, ముఖ్యమంత్రితో టెలిఫోన్ లో సంభాషించాడని తెలిపారు. బహుశా తిరిగి శనివారం వారిద్దరూ కలిసే అవకాశం ఉందని కూడ వెల్లడించారు. అయితే అపరాజిత ముఖ్యమంత్రిని కలిసేందుకు నా కుమార్తెగా రాలేదని, జెఎన్ యు విద్యార్థి కార్యకర్తగా, దేశద్రోహం కేసులో జైలు నుంచి బెయిల్ పై విడుదలైన కన్హయ్య కుమార్ కు మద్దతుదారుగా వచ్చిందని రాజా తెలిపారు. కన్హయ్య కుమార్, అపరాజితలు ఇద్దరూ సీపీఐ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్ ఎఫ్) సభ్యులే. కాగా కన్హైయా కుమార్ విషయంలో సీపీఐకి ఏవైనా భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు ఉన్నాయా అన్న విలేకరుల ప్రశ్నకు రాజా అటువంటివేమీ లేవని సమాధానం ఇచ్చారు. -
'ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ విఫలం'
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే సుమారు 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రాష్ట్రంలో రైతాంగం ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు పరిచిన పథకాల్లో కొన్ని ఇప్పటికీ కొనసాగుతండడం వల్లే ప్రజలకు ఊరట కలుగుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కేసీఆర్ విఫలం చెందారని జగన్ అన్నారు. కాగా, జగన్ రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాశీబుగ్గ, అలంకార్ థియేటర్, పోచమ్మ మైదానం, ధర్మారం, ములుగు క్రాస్‌రోడ్డు, హన్మకొండ చౌరస్తా మీదుగా జగన్ పర్యటిన కొనసాగింది. దారి పొడవునా వ్యాపారులు, యువకులు, కూలీలతో వైఎస్ జగన్ ముచ్చటించారు. సాయంత్రం 6.30 గంటలకు హయగ్రీవాచారి మైదానంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. -
అవినీతి సర్కారుకు బుద్ధి చెప్పాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అవినీతిమయమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వాలు మనుగడ కోల్పోవడం ఖాయమని అన్నారు. సీపీఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సీపీఐ ఎమ్మెల్సీ చంద్రశేఖర్, నాయకులు రామకృష్ణ, బాలమల్లేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, కానీ పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు.