ఫ్యాన్స్‌కు క్లాస్ పీకిన మహేష్ | tollywood Prince mahesh fire on fans | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కు క్లాస్ పీకిన మహేష్

Published Mon, Dec 21 2015 3:51 PM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

ఫ్యాన్స్‌కు క్లాస్ పీకిన మహేష్

ఫ్యాన్స్‌కు క్లాస్ పీకిన మహేష్

ఎప్పుడూ కూల్‌గా ఉండే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబుకి కోపం వచ్చిందట. షూటింగ్ సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమానులకు చిన్నపాటి క్లాస్ పీకాడట. అభిమానుల హడావిడితో చాలావరకు ఓపిగ్గా ఉన్నా.. చివరకు కాస్త ఘాటుగానే స్పందించినట్లు తెలిసింది. ఈ సంఘటన ఊటీలో జరిగింది.

అసలు విషయం ఏమిటంటే.. మహేష్ బ్రహ్మోత్సవం షూటింగ్ కార్యక్రమాలు ఊటీలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన హీరోతో ఫొటోలు దిగాలనే ఆరాటంతో హంగామా చేశారు. ఎట్టకేలకు మహేష్ కూడా వాళ్లను కాదనలేక ఓకే అన్నారు. తీరా మహేష్ సిద్ధపడ్డాక తమ దగ్గర కెమెరా లేదని తెల్ల మొహాలేశారట. చివరికి షూటింగ్ స్పాట్‌లో ఉన్న కెమెరామన్‌ని పిలిపించి వాళ్లతో ఫొటోలు దిగి అప్పటికి అభిమానులను సంతృప్తిపరిచాడు. అయితే, అనవసరంగా తన సమయం వృధా కావడంతో కాస్త అసహనానికి గురై.. ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముందని ఫ్యాన్స్‌ని మెత్తగా మందలించాడట.

కాగా మహేష్ బాబు  డ్యూయెల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో  కాజల్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు.   శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో  వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఊటీలో  డిసెంబర్ 13 నుంచి  22 వరకు  జరుగనుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు క్రిస్ మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ కు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసినట్టు  సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement