
SVP Trailer: Mahesh Babu Fans Hulchal At Bramaramba Theatre: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశు రామ్ దర్శకత్వంలో మహేశ్‌కు సరసన హీరోయిన్గా మహానటి కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచారు మేకర్స్. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై భారీగా హైప్ పెరిగింది.
తాజాగా 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్‌ను సోమవారం (మే 2)న విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ అయిన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్ చేశారు. ఈ క్రమంలో మహేశ్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అభిమానులకు గాయాలు కూడా అయినట్లు సమాచారం.
చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్
మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట
Comments
Please login to add a commentAdd a comment