Keerthy Suresh Photo Goes Viral, Fans Are On Fire - Sakshi
Sakshi News home page

కీర్తి సురేష్‌ ఫోటో వైరల్‌.. ఫైర్‌ అవుతున్న ఫ్యాన్స్‌

Jun 22 2023 3:09 PM | Updated on Jun 22 2023 3:31 PM

Keerthy Suresh Photo  Viral Fans Are On Fire - Sakshi

టాలీవుడ్‌ మహానటి కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తతో సంబంధం సెట్ అయిందని ఆ మధ్య తెగ వార్తలు వచ్చాయ్‌. వాటిపై కీర్తి తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యారు కూడా.. తనకు పెళ్లి చేసే సమయంలో అందరికీ చెప్పే చేస్తామని వారు తెలిపారు. ఇదే విషయాన్ని కీర్తి సురేశ్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. దాంతో ఆ గొడవ సద్దుమనిగింది.

(ఇదీ చదవండి: నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు!)

తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఎరుపు రంగు డ్రెస్‌లో కీర్తి సురేష్ నవ్వుతూ ఉండగా.. ఆమెతో పాటు ఒక వ్యక్తి ఎంతో సన్నిహితంగా ఫోటోలో కనిపించాడు. ఇంకేముంది ఇప్పుడా ఫోటో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ ఫోటోకు క్యాప్షన్‌గా  మెకానిక్‌తో ప్రేమాయణం అంటూ  రాసుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఆ ఫోటోలు నావి కావు. . నాకు ట్వీటర్‌ ఖాతానే లేదు: జయవాణి)

ఈ ఫోటో విషయంపై కీర్తి అభిమానులు మండిపడుతున్నారు. సినిమా షూటింగ్‌ సమయంలో ఎవరితో అయినా ఒక్క ఫోటో దిగితే ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తారా? అంటూ ఫైర్‌ అవుతున్నారు. అసలు ఇలాంట ఆలోచనలు ఎలా వస్తాయని వారు మండిపడుతున్నారు.  ‘భోళా శంకర్’ చిత్రం షూటింగ్‌ సమయంలో  కీర్తి సురేష్‌తో ఒక టెక్నిషియన్‌ ఫోటో దిగాడని, దానిని పట్టుకుని అసభ్యంగా ప్రచారం చేయడం ఎంటని, వారు కామెంట్‌ చేస్తున్నారు. మరోసారి కీర్తీ సురేష్‌పై ఇలాంటి ప్రచారాలు చేస్తే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆమె అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement