ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ.. | man arrested in tenth class exam writes he's friends | Sakshi
Sakshi News home page

ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ..

Published Sun, Mar 19 2017 4:15 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ.. - Sakshi

ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ..

కాగజ్‌నగర్‌ టౌన్‌: పదో తరగతి పరీక్ష ఒకరికి బదులుగా మరొకరు రాస్తూ దొరికిపోయిన సంఘటన శనివారం కాగజ్‌నగర్‌లో వెలుగు చూసింది. పట్టణంలోని ఆర్‌ఆర్‌వో కాలనీలో జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాల కేంద్రంలో కరీం తెలుగు పరీక్ష రాయాల్సి ఉంది. గతంలో తెలుగు పరీక్షలో ఫెయిల్‌ అయినందున ఆయన మరోసారి ఈ పరీక్ష రాయాల్సి ఉంది.

అయితే, అతనికి బదులుగా అతని సన్నిహితుడు బీకాం చదివిన జమీర్‌ శనివారం తెలుగు రెండో పేపర్‌ రాస్తుండగా సీఎస్‌ దేవాజీ పట్టుకున్నారు. శుక్రవారం మొదటి పేపర్‌ సైతం జమీరే రాసినట్లు తెలిసింది. పోలీసులు జమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జమీర్‌తో పాటు కరీం.. ఇన్విజిలేటర్, సిట్టింగ్‌ స్క్వాడ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మజీద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement