ఈ ఎగ్జామ్‌ పాస్‌ అయితే రూ.151 కోట్ల స‍్కాలర్‌ షిప్‌ | Sakshi
Sakshi News home page

ఈ ఎగ్జామ్‌ పాస్‌ అయితే రూ.151 కోట్ల స‍్కాలర్‌ షిప్‌

Published Fri, Aug 6 2021 8:07 AM

Upgrad Jeet Announces  Inr 151 Crores Scholarship Who Will Crack Nra Exam - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ అప్‌గ్రేడ్‌కు చెందిన కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ అప్‌గ్రేడ్‌జీత్‌... రూ.151 కోట్ల కామన్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (ఎన్‌ఆర్‌ఏ) సీఈటీ ఉపకార  వేతనాలకు అర్హత పరీక్షలను నిర్వహించనుంది. ఈ నెల 8న జాతీయ స్థాయిలో జరగనున్న ఈ పరీక్ష రాసేందుకు ఇప్పటికే 2.5 లక్షల మంది నమోదు చేసుకున్నారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  గత నెలలో 18, 25 తేదీలలో రెండు సార్లు జీత్‌సీఈటీ టెస్ట్‌కు అపూర్వ స్పందన లభించిందని.. అందుకే మరొక టెస్ట్‌ను నిర్వహించనున్నామని అప్‌గ్రేడ్‌జీత్‌ సీఈఓ రితేష్‌ రౌషన్‌ తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్‌ రెండు రౌండ్లుగా పరీక్ష ఉంటుంది. 

ఎన్‌ఆర్‌ఏ సీఈటీ ఎగ్జామ్‌ అంటే?
కేంద్ర ప్రభుత్వశాఖలైన కాగ్‌, సెంట్రల్‌ సెక్రటరియేట్‌ సర‍్వీస్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌, రైల్వే,విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర శాఖల్లో ఉద్యోగుల భర్తీకి కేంద్రం నేషనల్‌ రిక్రూట్‌ మెంట్‌ ఏజెన్సీ కామన్‌ ఎలిజిబులిటి టెస్ట్‌ (NRA CET) టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఆ ఎగ్జామ్‌ లో ఉత్తీర్ణత సాధించిన వారు ఆయా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో విధులు నిర్వహించవచ్చు. అయితే ఈ ఎగ్జామ్‌ ఎలా నిర్వహిస్తారు? ఏఏ సబ్జెట‍్లను ఎలా చదివితే జాబ్‌ ఎలా వస్తుందనే అంశంతో పాటు.. అభ్యర్ధులకు కోచింగ్‌ ఇచ్చి వారికి ఉపాధి కల్పించేందుకు ప్రముఖ కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ అప్‌గ్రేడ్‌జీత్‌  'జీత్‌సీఈటీ టెస్ట్‌' ను నిర్వహించి భారీ మొత్తంలో  స్కాలర్‌ షిప్‌ను అందించేందుకు సిద్ధమైంది.

స్కాలర్‌ షిప్‌కు అభ్యర్ధుల ఎంపిక  
ఈ ఎగ్జామ్‌ ఆగస్ట్‌ 8న (వచ్చే ఆదివారం) నిర్వహించనుంది. ఈ ఎగ్జామ్‌ రాసే అభ్యర్ధులను రెండు రౌండ్లుగా విభజించింది. ప్రిలిమినరీ రౌండ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులను మెయిన్స్‌ ఆహ్వానిస్తారు. ఈ రెండో రౌండ్‌ లో ఎంత మంది పాస్‌ అవుతారో వారిలో మెరిట్‌ ఆధారంగా  3వేల మంది అభ్యర్ధులను ఎంపిక చేసి వారికి  6నెలల NRA CET కోర్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా అందిస్తోంది. దీంతో పాటు రూ.151కోట్ల స్కాలర్‌ షిప్‌ ను అందిస్తుండగా.. ఇక రెండో రౌండ్‌లో 3వేల మందిని మినహాయించి మిగిలిన అభ్యర్ధులకు ఒక నెల NRA CET కోర్స్‌  సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తున్నట్లు అప్‌గ్రేడ్‌జీత్‌ సీఈఓ రితేష్‌ రౌషన్‌ ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement