నేడు గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష | today gurukula school entrance exam | Sakshi
Sakshi News home page

నేడు గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష

Published Tue, Aug 9 2016 11:32 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

today gurukula school entrance exam

తుని రూరల్‌ : ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలల్లో మిగిలిన ఉన్న సీట్లకు ఆరు, ఏడు తరగతుల్లో ప్రవేశాలకు బుధవారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ కన్వీనర్‌ డి.ఎస్‌.బి.శంకరరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గోకవరం మండలం భూపతిపాలెం (బాలురు), తుని మండలం జగన్నాథగిరి (బాలికలు) గురుకుల పాఠశాలల్లో మిగిలి ఉన్న ఖాళీల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ప్రవేశ పరీక్ష రాసేందుకు విద్యార్థులు జగన్నాథగిరి ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు ఉదయం తొమ్మిది గంటలకు రావాలన్నారు. హాల్‌టికెట్లు పొంది పదిగంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష రాయాల్సి ఉందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి సకాలంలో పరీక్ష కేంద్రానికి రావాలన్నారు. 9866559624 ఫోన్‌నంబరులో మరింత సమాచారం తెలుసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement