close friend
-
కేంద్ర మంత్రి ఆప్తుడి ఇంట ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: హస్తినలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎల్జేపీ(రామ్ విలాస్ వర్గం) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన హులాస్ పాండేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసుకుంది. పాట్నా, బెంగళూరు, ఢిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాలతోపాటు బంధవుల ఇళ్లలోనూ తన బృందాలతో తనిఖీలు జరిపింది.ఆర్థిక లావాదేవీల అవకతవకలకు సంబంధించి.. హులాస్ పాండే(Hulas Pandey) మీద గతంలో చాలా ఆరోపణ వచ్చాయి. అయితే ఈడీ మాత్రం దాడులకు సంబంధించిన ప్రత్యేకమైన కారణాలను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. హులాస్ పాండే ఎల్జేపీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. పాండే గతంలో బీహార్ ఎమ్మెల్సీగా పని చేశారు. తొలినాళ్లలో నితీశ్ కుమార్(Nitish Kumar) జేడీయూలో పని చేసిన ఈయన.. తర్వాత ఎల్జేపీ(LJP)లో చేరారు. అప్పటికే పాండే.. చిరాగ్‌ల మధ్య మంచి స్నేహానుబంధం ఉంది. ఇక ఎల్జేపీలో చేరాక.. ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నింటిని ఇతనే చూసుకునేవారు. ఇదిలా ఉంటే.. 2012 నాటి హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పాండే పేరును చేర్చారు. దీంతో.. అనివార్య పరిస్థితుల మధ్య కిందటి ఏడాది డిసెంబర్లో ఎల్జేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పాండే రాజీనామా చేయాల్సి వచ్చింది. వివాదాస్పద ప్రకటనతో అప్పుడప్పుడు వార్తల్లోనూ నిలుస్తుంటారీయన.ఏమీటా కేసు..2012 జూన్ 1వ తేదీన రణ్వీర్ సేన అధినేత బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా భోజ్‌పుర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ జరిపిన సీబీఐ పాండే మీద సంచలన ఆభియోగాలు నమోదు చేసింది. ముఖియాకు పేరు వస్తుండడంతో తన రాజకీయ పలుకుబడి మసకబారిపోతుందనే భయంతోనే పాండే ఈ హత్య చేయించాడని పేర్కొంది. అయితే..పాండే మాత్రం ఆ ఆరోపణలను రాజకీయ కుట్రగా ఖండిస్తూ వస్తున్నారు. ఈలోపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సీబీఐ ఛార్జ్‌షీట్‌ను తప్పుబట్టింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. అయితే.. ఈ ఉదయం నుంచి ఆయనకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ(ED) బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా.. స్థానిక పోలీసుల సపోర్ట్ తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇదీ చదవండి: అయోధ్య గ్రేటర్ దేన్ ఆగ్రా! -
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ..
కాగజ్‌నగర్ టౌన్: పదో తరగతి పరీక్ష ఒకరికి బదులుగా మరొకరు రాస్తూ దొరికిపోయిన సంఘటన శనివారం కాగజ్‌నగర్‌లో వెలుగు చూసింది. పట్టణంలోని ఆర్‌ఆర్‌వో కాలనీలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కేంద్రంలో కరీం తెలుగు పరీక్ష రాయాల్సి ఉంది. గతంలో తెలుగు పరీక్షలో ఫెయిల్ అయినందున ఆయన మరోసారి ఈ పరీక్ష రాయాల్సి ఉంది. అయితే, అతనికి బదులుగా అతని సన్నిహితుడు బీకాం చదివిన జమీర్ శనివారం తెలుగు రెండో పేపర్ రాస్తుండగా సీఎస్ దేవాజీ పట్టుకున్నారు. శుక్రవారం మొదటి పేపర్ సైతం జమీరే రాసినట్లు తెలిసింది. పోలీసులు జమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జమీర్‌తో పాటు కరీం.. ఇన్విజిలేటర్, సిట్టింగ్ స్క్వాడ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మజీద్ తెలిపారు. -
ఆ హీరో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాకు ఇప్పుడు మంచి మిత్రుడు దొరికాడన్న సంతోషంలో తేలిపోతోంది. 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలో తన కో స్టార్ అయుష్మాన్ తనకు చాలా దగ్గరి మిత్రుడుగా మారిపోయాడని పరిణీతి తెలిపింది. ఈ 'దమ్ లగాకే హైసా' హీరో ఇటీవల.. పరిణీతి చాలా చక్కగా పాడుతుందని, ఆమె సింగింగ్ను ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చని పొగడ్తలతో ముంచెత్తాడు. దీనిపై పరిణీతి స్పందిస్తూ.. 'అతడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను పాడటం ఎప్పుడు విన్నా సరే అతడు సింగింగ్ను ప్రొఫెషనల్‌గా తీసుకోమంటూ చెబుతుంటాడు. అతడు కూడా గొప్ప గాయకుడు. నేను పాడుతుంటే తాను నాతో పాటు జాయిన్ అవుతాడు. నేను ఎంతలా పాడినా.. నా పాటలకు అడ్డు చెప్పకుండా వినే కో స్టార్ నాకు దొరికాడు' అంటూ ఆయుష్మాన్‌తో తన ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకొచ్చింది. -
నా పరిస్థితి నరకంలా ఉంది...
జీవన గమనం నాకు ఒక అమ్మాయి పరిచయమైంది. ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అంతా బాగానే ఉందనుకునే లోపు ఈ మధ్యే ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో మ్యారేజ్ జరిగింది. అప్పటి నుంచి ఆమె నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అంటీ ముట్టనట్టుగా ఉంటోంది. ఇది వరకు ఎంతో క్లోజ్‌గా మాట్లాడే తను ఈ మధ్య నాతో ఏదో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతోంది. ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అన్న తనే ఇప్పుడు అదంతా అప్పటి మాట అంటోంది. ఈ పరిస్థితి నాకు నరకంలా ఉంది. తన గురించి ఆలోచించకుండా ఉండలేక పోతున్నా. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. దయ చేసి తగిన పరిష్కారం సూచించండి. - జగదీశ్, ఈ-మెయిల్ ఒక వ్యక్తి తన మనసులో భావాలు మరో వ్యక్తితో పంచుకోవటం కోసం పెట్టుకున్న పేరే ‘స్నేహం’ అని ఎక్కడో రాశాను. దీనికి తోడు స్త్రీ పురుషుల మధ్య స్నేహంలో ‘ఆకర్షణ’ అనే మరో అంశం కూడా ఉంటుంది. ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలో నాగేశ్వరరావు సావిత్రిని పవిత్రంగా ప్రేమిస్తాడు. అర్ధరాత్రయినా మూడ్ వస్తే (చూడాలన్న మూడ్ వస్తే) నిష్కల్మష హృదయంతో వెళ్లి తలుపు కొడుతూ ఉంటాడు. వీరి పవిత్ర స్నేహం చూసి సావిత్రి మొగుడుకి ఒళ్లుమండి, నిండు గర్భవతిని ఇంట్లోంచి గెంటేస్తాడు. తాను ఆమెని ‘చెల్లి’గా ప్రేమిస్తున్నానని హీరో క్లారిఫై చేస్తే, అప్పుడు జగ్గయ్య కళ్లు తెరుచుకుంటాయి. స్క్రీన్‌ప్లే చెయ్యటానికి తల ప్రాణం తోకకొచ్చిందని ఆ సినిమా రచయిత గొల్లపూడి మారుతీరావు స్వయంగా చెప్పారు. ఎందుకంటే, అది ‘అన్నా- చెల్లి అనుబంధం’ అని ముందే చెబితే సస్పెన్స్ ఉండదు. చివర్లో చెబితే, ‘ఈ విషయం ముందే చెప్పి ఏడవొచ్చు కదా’ అని ప్రేక్షకులు విసుక్కునే ప్రమాదం ఉంది. ఈ కత్తి మీద సాముని (ప్రేక్షకులకు మాత్రమే తెలిసేటట్టూ, పాత్రలకు తెలియకుండా నాగేశ్వరరావుకి ఫ్లాష్‌బ్యాక్‌లో ఒక చెల్లిని సృష్టించి, ఆమెతో ‘పాడమని నన్నడగవలెనా/ పాడమని నన్నడగ తగునా’ అన్న రెండర్థాల ఆత్రేయ పాట పాడించి) చేశారు కాబట్టి హిట్టయింది. స్త్రీ పురుషుల మధ్య పవిత్ర స్నేహాన్ని భర్తలే కాదు, ప్రేక్షకులు కూడా ఒప్పుకోరని చెప్పటం ఇక్కడ ఉద్దేశం. పెళ్లవగానే భర్తతో గొడవలెందుకని మీ స్నేహితురాలు మిమ్మల్ని దూరంగా పెట్టి ఉండవచ్చు లేదా మీ మీద ఇంటరెస్టు తగ్గిపోయి ఉండవచ్చు. మీరు ఆమెకు రాఖీ కట్టి వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వటం ఒక మార్గం. దానికన్నా... మీరు కూడా పెళ్లి చేసుకుని, మీ భార్యలోనే మంచి స్నేహితురాల్ని చూసుకోవటం ఉత్తమం. నేను ఇంటర్లో ఉండగా ఒక వ్యక్తిని ప్రేమించాను. నేను డిగ్రీలోకి వచ్చాక ఈ సంగతి తెలిసి మా పేరెంట్స్ హెచ్చరించారు. నేను ప్రేమించడం మాత్రం మానలేదు. దీంతో నన్ను కాలేజీకి పంపడం మానేశారు. మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను అనే మాట ఇచ్చిన తరువాత కొద్దిరోజులుగా కాలేజీకి వెళ్తున్నాను. ఈలోగా అతడు వేరే మతం పుచ్చుకున్నాడని తెలియడంతో మేం విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోవ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. నేను టెన్త్‌లో ఉన్నప్పటి నుంచి నా మీద ప్రేమ పెంచుకున్నాడు. మేం ఒకే కులానికి చెందిన వాళ్లం. నేను అతనితో ప్రేమలో పడ్డాను. అతనికి ఆస్తులేమీ లేవు. మా పేరెంట్స్ ఇప్పుడు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆస్తిపరుడైన అబ్బాయి కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? - పేరు రాయలేదు మన జీవితంలోంచి ఒకరు నిష్క్రమించినప్పుడు, ప్రేమని తిరిగి ఫ్రెష్‌గా మొదలుపెట్టవచ్చనీ, ప్రేమను పునః ప్రారంభించటం తప్పు కాదనీ చెప్పే ఒక పాజిటివ్ వివాదాస్పదమైన చర్చ ‘ప్రేమ ఒక కళ’ అన్న పుస్తకంలో జరిగింది. ప్రేమలో ఫెయిల్ అయితే, జీవితం అక్కడే ఆగిపోదు. జీవితంలో కామాలే తప్ప ఫుల్‌స్టాపులు ఉండవు అన్న ఆ పుస్తకంలోని వాక్యాన్ని నిజం చేసినందుకు ముందుగా అభినందనలు. ఇక మీ సమస్యకొస్తే, ప్రతీ సమస్యకీ రెండు మూడు పరిష్కారాలు ఉంటాయి. ఏ పరిష్కారం మనకు ’ఆరోగ్యకరమైన సంతోషాన్ని’ ఇస్తుందో తెలుసుకుంటే, సగం సమస్యలు ఉండవు. పరిష్కారం మెట్లు మెట్లుగా అలోచించాలి. ప్రేమ ముఖ్యమనుకుంటే ఆ రెండో అబ్బాయిని మీ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్లండి. వాళ్లు వద్దంటే, అబ్బాయిని వదిలెయ్యాలా? మీ పెద్దల్ని వదిలెయ్యాలా తేల్చుకోండి. అబ్బాయిని వదిలెయ్యాలనుకుంటే, పెద్దలు కుదిర్చిన పెళ్లికొడుకుని మూడోసారి ప్రేమించి, జీవితాన్ని సుఖమయం చేసుకోండి. - యండమూరి వీరేంద్రనాథ్