వైరల్‌: ఆన్‌లైన్‌ క్లాస్‌లో టీచర్‌ ప్రశ్న.. ఉహించని రిప్లై విని ఏం చేసాడంటే! | Viral Video: Teacher Asks Quarter Meaning Student Says 30 Ml Watch | Sakshi
Sakshi News home page

Viral Video: ఆన్‌లైన్‌ క్లాస్‌లో టీచర్‌ ప్రశ్న.. ఉహించని రిప్లై విని షాక్‌!

Published Mon, Oct 11 2021 7:56 PM | Last Updated on Mon, Oct 11 2021 9:58 PM

Viral Video: Teacher Asks Quarter Meaning Student Says 30 Ml Watch - Sakshi

కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, టీచర్ల మథ్య జరిగిన సంభాషణలున్న వీడియోలు వైరల్‌గా మారి హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ తరహాలోనే సీఏ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్లాస్‌లో.. ఓ టీచర్‌ అడిగిన ప్రశ్నకు స్టూడెంట్‌ షాకింగ్‌ సమాధానం చెప్పగా ప్రస్తుతం అది నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఆ వీడియోలో.. ఎడ్నోవేట్ వ్యవస్థాపక సభ్యుడు సీఏ ధవల్ పురోహిత్ విద్యార్థులకు పాఠాలు చెప్తుంటాడు. ఆ స‌మ‌యంలో ఒక క్వార్ట‌ర్ అంటే ఎంత‌? అనే ప్ర‌శ్న‌ను విద్యార్థులను అడుగుతాడు. అక్క‌డ చాట్ బాక్స్‌లో ఉండే ఓ విద్యార్థి వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా 30 ఎంఎల్ అని రాశాడు.

చిర్రెత్తుకొచ్చిన ధవల్‌.. క్వార్ట‌ర్ అంటే 3 నెల‌లు.. అని ఓ వింత ఎక్స్‌ప్రెషన్‌తో వివరణ ఇచ్చాడు. దీంతో ఆన్‌లైన్ క్లాస్‌లో ఒకటే న‌వ్వులు. ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. ఓ నెటిజన్‌ అయితే సీఏ క్లాసెస్‌లోనే ఇలాంటివి జ‌రుగుతాయి? అని కామెంట్ చేశాడు. ఇంత‌కీ ఆ సమాధానం ఇచ్చని మహానుభావుడు ఎవరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Bhuvan Bam: నెలకు రూ.95 లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement