హైదరాబాద్(అబిడ్స్): నగరంలోని జియాగూడలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. జియాగూడక చెందిన ప్రియాంక(19) సమర్ధనారయణ ఆశ్రమంలోని చెట్ల పొదల్లో విగతజివిగా కనిపించింది.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.