ఉక్రెయిన్‌పై రష్యా దాడి కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా ప్రతిఏటా రష్యాలో మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. ప్రతి ఏడు నిర్వహించినట్లుగా..ఈ ఏడాది రష్యాలో విక్టరీ డే వేడుకల్ని రష్యా నిర్వహించింది. అయితే అదే సమయంలో ఉక్రెయిన్ సానుభూతి పరులపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తూ..పరోక్షంగా రష్యాను దెబ్బకొడుతున్న ఎలన్ మస్క్‌కు..రష్యన్ ఆర్మీ కమాండర్ ఏకంగా ధమ్కీ ఇచ్చాడు. ఈ విషయాన్ని నేరుగా ఎలాన్ మస్క్ తెలిపాడు.
The word “Nazi” doesn’t mean what he seems to think it does pic.twitter.com/pk9SQhBOsG
— Elon Musk (@elonmusk) May 9, 2022
రష్యన్ భాషలో ఉన్న కమాండర్ టెస్టిమోనీ ట్వీట్‌ను ఇంగ్లీష్‌లోకి ట్రాన్సలేట్ చేసి మరీ ఎలాన్ మస్క్ స్పందించాడు. అంతు చిక్కని తీరిలో తాను చనిపోతే.. అందుకు సంబంధించిన కారణం ముందే తెలుసుకోవడం భలేగా ఉందంటూ కొంటెగా రష్యన్ కమాండర్‌ను రెచ్చగొట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్విట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వైరల్ అవుతున్న ఆ ట్విట్‌లపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
If I die under mysterious circumstances, it’s been nice knowin ya
— Elon Musk (@elonmusk) May 9, 2022
ఎలాన్ మస్క్ ట్వీట్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. నీకు మద్దతుగా మేమున్నామంటూ కొందరు స్పందిస్తుండగా.. నీకేమైనా అయితే ట్విటర్ ఉంటుందా అంటూ మరికొందరు మస్క్‌కు ఆయన తరహాలోనే జవాబు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment