
ఆర్నెల్ల పసికందు అనుమానాస్పద మృతి
అభం శుభం తెలియని ఆర్నెళ్ల పసికందు అనుమానాస్పదంగా మృతిచెందింది.
హైదరాబాద్: అభం శుభం తెలియని ఆర్నెళ్ల పసికందు అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని అంబర్‌నగర్‌లో బుధవారం జరిగింది. వివరాలు.. విజయలక్ష్మీ, ప్రవీణ్‌కుమార్‌లకు ఐదేళ్ల క్రితమే పెళ్లైంది. వారికి ఇద్దరు సంతానం వర్షిత్(3), ప్రశస్య (6 నెలలు). ప్రవీణ్‌కుమార్ అకౌంటెంట్‌గా పనిచేస్తూ... అప్పుల బాధ తట్టుకొలేక రెండునెలల కిందటే ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పటినుంచి విజయలక్ష్మీ తల్లి ఇంట్లో ఉంటోంది. అయితే బుధవారం ఉదయం పిల్లలను ఇంట్లోనే వదిలేసి ఆమె బయటకు వెళ్లింది. విజయ లక్ష్మీ ఎక్కడికెళ్లిందో అని చూస్తున్న కుటుంబ సభ్యులకు ప్రశస్య శవమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.