ప్రపంచంలో ఎంతోమంది మరణిస్తుంటారు. కొన్ని సహాజ మరణాలు కాగా, మరికొందరు అసహజ రీతిలో మరణిస్తుంటారు. అయితే కొన్ని సంఘటనలు వింటే అస్సలు నమ్మబుద్ది కాదు. కానీ కళ్లముందు సాక్ష్యాలు కనబడితే మాత్రం నమ్మకుండా ఉండలేరు.
ఇలాంటి కోవలోకే వస్తుంది ఓ డెత్ మిస్టరీ. లండన్‌కు చెందిన జాయిస్ విన్సెంట్ అనే మహిళ చనిపోయిన తీరు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. అసలు ఏంటా కథ? అన్నది ఈ మిస్టరీ స్టోరీలో తెలుసుకుందాం..
లండన్‌కు చెందిన జాయిస్ విన్సెంట్ అనే మహిళ విచిత్రమైన రీతిలో మరణించింది. 1965, అక్టోబర్19న యూకేలో జన్మించిన ఈమె పదాహారేళ్ల వయసులో మ్యూజిక్ వైపు దృష్టిపెట్టింది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తన నలుగురు తోబుట్టువులే ఆమె ఆలనాపాలనా చూసేవారు. అయితే ఎందుకో తెలియదు కానీ కొన్నాళ్లకు తన కుటుంబం నుంచి విన్సెంట్ బయటకు వచ్చేసింది. ఓ సంస్థలో చిన్న ఉద్యోగిగి చేరి తన కాళ్లపై తను నిలబడింది. అయితే కుటుంబంతో మాత్రం శాశ్వతంగా బంధాన్ని తెంపేసుకుంది.
అప్పటినుంచి విన్సెంట్ ఒంటిరి జీవితానికి అలవాటుపడింది.లండన్‌లోని బెడ్‌సిట్ అపార్ట్‌మెంట్స్‌లో ఆమె నివసించేది. ఇవి గృహహింసల నుంచి విముక్తి పొందిన మహిళలకు తక్కువ అద్దెతో వసతి కల్పించే ఆవాసకేంద్రాలన్నమాట. ఓసారి ట్రస్ట్ అధికారులు ఆమె ఫ్లాట్ కాలింగ్ బెల్ ఎంతసేపు కొట్టినా తలుపుతీయలేదు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు గుండె జలదరించే దృశ్యం కనిపించింది.
ఎదురుగా టీవీ ముందు కుర్చీలో అస్థిపంజరం వాళ్లకు దర్శనం ఇచ్చింది. అది విన్సెంట్‌దే అని తెలుసుకునేందుకు ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. ఆశ్చర్యకరమైన మరో విశేషం ఏమిటంటే.. టీవీ చూస్తేన్నట్లుగానే సోఫాలో కూర్చొని చేతిలో టీవీ రిమోట్ పట్టుకొని ఉండటం అధికారులకే ఒళ్లు గగుర్పొడిచింది. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది.
2006 జనవరి 25న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె ఫ్రిజ్‌లోని ప్రోడక్ట్స్ ఎక్స్‌పైరీ డేట్ ఆధారంగా ఆమె చనిపోయి అప్పటికే మూడేళ్లు అయ్యిందని విచారణలో బయటపడింది. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయడం, స్నేహితులతోనూ సంబంధాలు తెంచేసుకొని ఒంటరిగా ఉండటం, టీవీ చూస్తూ చనిపోవడం, అది మూడేళ్లకు బయటపడటం.. ఇవన్నీ ఇప్పటికీ అలా మిస్టరీగానే ఉండిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment