రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా కందరుకూరు మండలంలోని బొక్కలగడ్డ తండాలో శనివారం ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడిఉంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కేసు నమొదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.