ఎంపీ ఇంట్లో పని మనిషి అనుమానాస్పద మృతి | Maid found dead at BSP MP’s residence, torture suspected | Sakshi
Sakshi News home page

ఎంపీ ఇంట్లో పని మనిషి అనుమానాస్పద మృతి

Published Tue, Nov 5 2013 11:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

Maid found dead at BSP MP’s residence, torture suspected

న్యూఢిల్లీలోని సౌత్ ఎవెన్యూలోని బహుజన సమాజ్ పార్టీ ఎంపీ ధనుంజయ్ సింగ్ నివాసంలో మహిళ పనిమనిషి మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆ ఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహన్ని పోలీసుల స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

 

అయితే ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి సింగ్ హింసించడం వల్ల పని మనిషి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పనిమనిషి ఒంటి నిండా గాయాలు ఉన్నాయని తెలిపారు.అలాగే ఆమె తలకు తీవ్ర గాయమైనట్లు తాము గుర్తించామన్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ అసలు సంగతి బహిర్గతమవుతుందని పోలీసులు వెల్లడించారు.

 

ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి సింగ్ తరచుగా పని మనిషి రాకీని హింసించేదని తొటి పనిమనిషి రాంపాల్ను విచారించగా తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని జన్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ధనుంజయ్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ  తరుపున పోటీ చేసి విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement