న్యూఢిల్లీ: హత్య కేసుకు సంబంధించి బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, అతని భార్య జాగృతి సింగ్ ల బెయిల్ అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. పని మనిషి హత్య కేసులో వీరిద్దరూ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇది వరకే మెజిస్టేరియల్ కోర్టు వీరి బెయిల్ను తిరస్కరించడంతో నిందితులు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. కేసులో నిజానిజాలు వినకుండా కింద కోర్టు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిందని సింగ్ సెషన్స్ కోర్టులో వాదనలు వినిపించారు. మెజిస్టేరియల్ కోర్టు తీర్పుతో ఏకీభవించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ వారి బెయిల్ పిటీషన్ను తోసిపుచ్చారు. పని మనిషి కొ్ట్టేందుకు భార్య జాగృతిని ఎంపీ తరుచు ప్రోత్సహించినందుకు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.ధనుంజయ్ నివాసంలో పని మనిషిగా చేసిన రాఖీభద్ర హత్యకు గురికావడంతో వీరిని ఈ నెల 5న అరెస్టు చేశారు.