కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన సమివుల్లా(17) అనే యువకుడు శివభాష్యం సాగర్ (వరదరాజస్వామి) ప్రాజెక్ట్ స్పిల్‌వేలో గురువారం శవమై కనిపించాడు. కురుకుంద గ్రామానికి చెందిన రహంతుల్లా కుమారుడైన సమివుల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
కురుకుంద గ్రామంలో తమ నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న సమివుల్లా బుధవారం మధ్యాహ్నం బైక్ పై బయటకు వెళ్లాడు. తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. కొడుకు కోసం తల్లి దండ్రులు పలు చోట్ల వెతికారు.
గురువారం ఉదయం నల్లమల అడవుల సమీపంలో బైక్ ఉందన్న సమాచారం తో అక్కడికి వెళ్లి వెతికారు. ప్రాజెక్ట్ స్పిల్ వేలో సమీవుల్లా శవం తేలుతూ కనిపించడంతో తల్లిదండ్రులు భోరు మన్నారు. సమాచారమందుకున్న ఆత్మకూరు ఎస్‌ఐ ఓ మహేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్ళి శవాన్ని పోస్టుమార్ట కోసం తరలించారు.
కాగా.. తమ కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. మృతుడి కాళ్లు చేతులపై గాయాలున్నాయి.. సమీవుల్లా ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా కొట్టి పైనుంచి నీళ్లలో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి అనుమానాస్పద మృతి
Published Thu, Oct 8 2015 5:30 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement