
సాక్షి, బెంగళూరు: విధి నిర్వహణలోవున్న ఒక మహిళా టెక్కీ అనుమానాస్పద రీతిలో భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన బుధవారం మారతహళ్లి సమీపంలోని జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గీతాంజలి అనే వివాహిత నగరంలోని క్రిష్ణా బిజినెస్ టెక్ పార్కులోని నాలుగో అంతస్తులో ఉన్న అధ్వా ఆప్టిక్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు గోవాలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె పుట్టినరోజు కూడా జరుపుకున్నట్లు తెలిసింది.
బుధవారం విధులకు హాజరైన గీతాంజలి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కార్యాలయ భవనం నుంచి కిందకు పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కంపెనీ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిందా? ఎవరైనా తోసివేశారా ? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment