యువనటి బిదిశ అనుమానాస్పద మృతి
గురుగ్రామ్: తన నటన, సంగీతంతో అశేష ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న నటి, గాయని బిదిశా బెజ్బరువా అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయారు. అసామీ నటిగా పాపులర్‌అయిన బిదిశా.. ఇటీవలే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు.
సోమవారం ఢిల్లీ శివారు గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరివేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి మరణంపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
బిదిశా స్వస్థలం గువాహటి. చిన్నతనం నుంచే సంగీతం, నటనల పట్ల శ్రద్ధకనబర్చిన ఆమె.. టీనేజ్‌లో ఉండగానే రంగప్రవేశం చేసింది. అసామీ నాటకాలు, సంగీత కార్యక్రమాల ద్వారా పేరు సంపాదించుకుంది. ఇటీవలే విడుదలైన ‘జగ్గా జాసూస్’ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. కెరీర్ కీలక దశలో ఉన్న తరుణంలో బిదిశా మరణవార్త ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఏడాది కిందటే.. గుజరాత్‌కు చెందిన నిశీత్ ఝా అనే వ్యక్తితో బిదిశ వివాహం జరిగింది. అయితే, నిశీత్ కుటుంబీకులు బిదిశను వేధింపులకు గురిచేయడంతో ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారామె. కాగా, భర్తతో మాత్రం సత్సంబంధాలే కొనసాగుతున్నట్లు తెలిసింది. బిదిశ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు భర్తతో కలిసి టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. బిదిశది ఆత్మహత్యేనా? లేక మరొకటా? అనేది ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.