
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి అజ్మీరా గణేశ్(17) బుధవారం అనుమానాస్పదంగా తాను ఉంటున్న ప్రైవేటు హాస్టల్‌లో మృతి చెందాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మర్‌పల్లి శివారు చక్రతండాకు చెందిన వాల్యానాయక్ – పద్మల కుమారుడైన అజ్మీరా గణేశ్ మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో హాస్టల్ వసతి లేకపోవడంతో ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. మంగళవారం ఇంటికి వెళ్తానని తోటి విద్యార్థులకు చెప్పి వెళ్లిన గణేశ్ రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చాడు.
తెల్లవారుజాము తోటి విద్యార్థులు తమతో పాటు గణేశ్ లేకపోవడాన్ని చూసి సెల్‌కు ఫోన్‌చేశారు. ఫోన్ ఎత్తకపోవడంతో ఎక్కడిౖకైనా వెళ్లి ఉంటా డని భావించారు. హాస్టల్ రెండో అంతస్తుపైకి వెళ్లగా గణేశ్ పడిపోయి ఉండటాన్ని గమనించారు. గణే‹శ్ పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. M తమ కుమారుడిని ఎవరో చంపి.. పురుగుల మందు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాల్యానాయక్, పద్మ ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, అడ్డుకున్నారు. కేసు విచారణ జరిపిస్తామని డీఎస్పీ మల్లారెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment