వేధింపులతో పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య..! | TRR College Polytechnic Student Committed Suicide In In Hyderabad | Sakshi

వేధింపులతో పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య..!

Published Mon, Nov 4 2019 12:45 PM | Last Updated on Mon, Nov 4 2019 1:14 PM

TRR College Polytechnic Student Committed Suicide In In Hyderabad - Sakshi

డిటెండ్‌ చేస్తామని కాలేజీ యాజమాన్యం బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ : మీర్‌పేట్‌లోని తీగల రాంరెడ్డి (టీఆర్‌ఆర్‌) కాలేజీలో విషాదం చోటేచేసుకుంది. పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ చదుతున్న సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కాలేజీ యాజమాన్యం బెదిరింపుల వల్లనే సంధ్య బలవన్మరణానికి పాల్పడిందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పార్వతి మేడమ్‌ వేధింపులు భరించలేకనే సంధ్య మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కాలేజీ గేటు ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. డిటెండ్‌ చేస్తామని కాలేజీ యాజమాన్యం బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement