ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కడెం డ్రిస్టిబ్యూటరీ 30వ కాల్వలో పడి మృతి చెందాడు.
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కడెం డ్రిస్టిబ్యూటరీ 30వ కాల్వలో పడి మృతి చెందాడు. మృతుడ్ని కంకణాల బక్కయ్య(44)గా గుర్తించారు. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయిన బక్కయ్య సోమవారం ఉదయం కడెం కాల్వలో శవమై కనిపించడంతో... ప్రమాదవశాత్తూ పడిపోయాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న సందేహాలు నెలకొన్నాయి.