చెలరేగిన సాయిరాజ్, నరేశ్ | sairaj and naresh hits a ton in a league match | Sakshi
Sakshi News home page

చెలరేగిన సాయిరాజ్, నరేశ్

Published Fri, Aug 12 2016 12:40 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

sairaj and naresh hits a ton in a league match

ఎ డివిజన్ రెండు రోజుల లీగ్
నేషనల్ సీసీ 362/4 డిక్లేర్డ్

హైదరాబాద్: నేషనల్ సీసీ బ్యాట్స్‌మెన్ సాయిరాజ్ ప్రశాంత్‌రెడ్డి (139 బంతుల్లో 166; 23 ఫోర్లు), నమని నరేశ్ (128 బంతుల్లో 112; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగారు. ఇద్దరు సెంచరీలతో కదంతొక్కారు. దీంతో గురువారం మొదలైన ఈ రెండు రోజుల మ్యాచ్‌లో తొలిరోజు నేషనల్ సీసీ 63 ఓవర్లలో 4 వికెట్లకు 362 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పీకేసీసీ ఆట నిలిచేసమయానికి 27 ఓవర్లలో 6 వికెట్లకు 73 పరుగులు చేసింది. ప్రణవ్ సూర్య 32 పరుగులు చేయగా, హరి శివప్రసాద్ 4 వికెట్లు తీశాడు.
 మిగతా మ్యాచ్‌ల స్కోర్లు
 
ఉస్మానియా: 226 (కృపాకర్ 51, తరుణ్ 48; సాధన్ 3/66, అహ్మద్ 3/49), న్యూబ్లూస్: 103/2 (భగత్ ప్రతాప్ 46).
 గ్రీన్‌టర్ఫ్: 376 (కుస్రో కిస్టి 96, అక్షయ్ 76, గోపీనాథ్ 45; సందీప్ 4/38), నిజామ్ కాలేజ్‌తో మ్యాచ్.
 విజయ్ హనుమాన్: 231 (శశధర్ 64, శివ కుమార్ 62; సచిన్ హరిశ్చంద్ర 5/32), మహమూద్ సీసీ: 52/0.
 స్పోర్టీవ్ సీసీ: 79/9 (వివేక్ 30, జగదీశ్ 4/27, పొన్నయ్య 3/14), మాంచెస్టర్: 311/9 (నరేశ్ 62, సాయికుమార్ 48, శ్రవణ్ 40; అనుదీప్ 3/56, ఆసిఫ్ 3/64).
 అగర్వాల్ సీనియర్స్: 178 (ఫరాజ్ 32, అలీఖాన్ 36, విశాల్ 36; హరిబాబు 4/37), ఎస్‌బీఐ: 38/2.
 ఫ్యూచర్ స్టార్స్: 244/3 (రోహన్ 91, అంకిత్ 63 బ్యాటింగ్, వికాస్ రావు 45 బ్యాటింగ్), ఆక్స్‌ఫర్డ్‌బ్లూస్‌తో మ్యాచ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement