షోయబ్ మాలిక్‌పై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. జట్టు నుంచి ఔట్‌!? | BPL Franchise Owner Terminates Shoaib Maliks Contract Due To Match Fixing Allegations, Says Reports - Sakshi
Sakshi News home page

Shoaib Malik Match Fixing Allegations: షోయబ్ మాలిక్‌పై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. జట్టు నుంచి ఔట్‌!?

Published Fri, Jan 26 2024 12:18 PM | Last Updated on Fri, Jan 26 2024 3:15 PM

BPL Franchise Owner Terminates Shoaib Maliks Contract Due To Fixing Allegations - Sakshi

పాకిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్ మాలిక్‌కు ఊహించని షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌ ప్రీమీయర్‌ లీగ్‌ ఫ్రాంచైజీ ఫార్చూన్ బరిషల్ "ఫిక్సింగ్" అనుమానంతో షోయబ్ మాలిక్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. కాగా ఇప్పటికే మాలిక్‌ వ్యక్తిగత కారణాలతో బీపీఎల్‌-2024 నుంచి స్వదేశానికి వచ్చేశాడు. అంతలోనే మాలిక్‌కు ఫార్చూన్ బరిషల్ ఈ షాకిచ్చింది. ఈ లీగ్‌లో కేవలం 3 మ్యాచ్‌ల మాత్రమే ఆడాడు.
అసలేం జరిగిందంటే?
జనవరి 22న షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో ఫార్చ్యూన్ బరిషల్,ఖుల్నా రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన మాలిక్‌ ఓకే ఓవర్‌లో ఏకంగా మూడు నో బాల్స్‌ వేశాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. సాధరణంగా స్నిన్నర్లు నో బాల్స్‌ చాలా అరుదుగా వేస్తుంటారు. అటువంటిది మాలిక్‌ ఏకంగా మూడు నో బాల్స్‌ వేయడం తీవ్ర అనుమానాలకు దారితీసింది.

ఈ క్రమంలోనే ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ మాలిక్‌పై వేటు వేసింది. కాగా ఇటీవలే మాలిక్‌ మూడో పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు విడాకులిచ్చి పాక్‌ నటి సనా జావేద్ ను మాలిక్ వివాహమాడాడు.
చదవండి: IND vs ENG: ఆట మర్చిపోయావా గిల్‌.. జట్టు నుంచి తీసిపడేయండి! అతడిని తీసుకోండి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement