షోయబ్ మాలిక్ (PC: BPL X)
తనపై వస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ స్పందించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ ఫార్చ్యూన్ బరిషల్‌తో తన బంధం ముగిసిపోలేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే తాను బంగ్లాదేశ్ వీడి దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపాడు.
ఏకంగా మూడు నోబాల్స్
కాగా బీపీఎల్-2024 సీజన్‌లో బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఖుల్నా టైగర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఒకే ఓవర్లో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ ఏకంగా మూడు నోబాల్స్ వేయడం ఇందుకు కారణం.
షోయబ్ మాలిక్ ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బరిషల్ యాజమాన్యం షోయబ్ మాలిక్ కాంట్రాక్టును రద్దు చేసిందని వార్తలు వినిపించాయి.
ముందుగా నిర్ణయించిన ప్రకారమే
ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన షోయబ్ మాలిక్.. ‘‘ఫార్చ్యూన్ బరిషల్‌తో నా బంధం గురించి ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నా. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేను దుబాయ్‌లో ఓ మీడియా సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అందుకే మా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో చర్చించిన తర్వాతే బంగ్లాదేశ్‌ను వీడాను.
ఫార్చ్యూన్ బరిషల్ రానున్న మ్యాచ్‌లలో మరింత గొప్పగా రాణించాలని కోరుకుంటున్నా. ఒకవేళ నా సేవలు అవసరమైతే తప్పకుండా మళ్లీ వాళ్లకు మద్దతుగా బరిలోకి దిగుతాను. క్రికెట్ ఆడటం అంటే నాకు ఇష్టం. ఆటను కొనసాగిస్తూనే ఉంటా’’ అని షోయబ్ మాలిక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.
అతడు మాకోసం ఎంతో చేశాడు
అదే విధంగా.. ఫార్చ్యూన్ బరిషల్ యజమాని మిజానుర్ రహ్మాన్ సైతం ఈ విషయంపై స్పందించాడు. షోయబ్ మాలిక్‌పై వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలను అతడు కొట్టిపడేశాడు. ‘‘షోయబ్ మాలిక్ గొప్ప క్రికెటర్. అతడి గురించి వస్తున్న వదంతుల పట్ల నేను చింతిస్తున్నాను.
మాకోసం తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అలాంటిది అతడి గురించి మేము ఇలాంటి చెత్త ప్రచారాలు ఎలా చేస్తామనుకున్నారు’’ అని మిజానుర్ వీడియో సందేశంలో పేర్కొన్నాడు.
చదవండి: Shoaib Malik: ‘ఆమెతో మూడేళ్లుగా రిలేషన్‌లో షోయబ్.. భర్తకు తెలియకుండా..’
Official statement ;
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 26, 2024
I would like to address and dismiss the recent rumors circulating about my playing position with Fortune Barishal. I had a thorough discussion with our captain, Tamim Iqbal, and we mutually planned the way forward. I had to leave Bangladesh for a… pic.twitter.com/kmPqPt1nxv
Comments
Please login to add a commentAdd a comment