టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓడి గ్రూపు స్టేజిలోనే పాక్ నిష్కమ్రించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట మాత్రమే విజయం సాధించింది.
మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచినప్పటకి అవి చెప్పుకోదగ్గ విజయాలు కావు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో గ్రూపు స్టేజి నుంచి పాక్ నిష్క్రమించడం ఇదే మొదటి సారి. అంతకుముందు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌ది ఇదే పరిస్థితి.
దారుణ ప్రదర్శన కనబరిచి వన్డే ప్రపంచకప్‌లో సైతం గ్రూపు స్టేజిలోనే నిష్క్రమించింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ముఖ్యంగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు వరల్డ్‌కప్ జట్టులో చోటివ్వడాన్ని తప్పుబడుతున్నారు. వారి స్ధానంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది మాజీలు అభిప్రాయపడుతున్నారు.
ఇక వరుసగా రెండు వరల్డ్‌కప్‌లలో నిరాశపరిచిన పాకిస్తాన్.. వచ్చే ఏడాది తమ స్వదేశంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనైనా సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాక్‌కు ప్రాతినిథ్యం వహించాలన్న తన కోరికను మాలిక్ వ్యక్తం చేశాడు. కాగా మాలిక్ 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆ తర్వాత టీ20ల్లో మాత్రమే 42 ఏళ్ల మాలిక్ కొనసాగాడు. టీ20ల్లో కూడా పెద్దగా పాక్ తరపున ఆడే అవకాశం రాలేదు. పాకిస్తాన్ తరపున మాలిక్ చివరగా 2021లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న మాలిక్.. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో మాత్రమే కొనసాగుతున్నాడు.
"నేను మళ్లీ పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను.రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాను. ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాను. నాలో ఇంకా ఫిట్‌నెస్ లెవల్స్ ఏ మాత్రం తగ్గలేదు. నా దేశం కోసం ఏమి చేయడానికైనా సిద్దంగా ఉన్నాను.
పాకిస్తాన్‌కు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందించేందుకు నా వంతు కృషి చేయాలని భావిస్తున్నానని" పీఎన్‌ఎన్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment